Skip to main content

Posts

Showing posts from January, 2016

మగవారి ముద్దు ఫోటోతో ....?

ఇస్లామాబాద్:  పురుషులిద్దరు ముద్దు పెట్టుకుంటున్న ఫోటో.. ముద్రించకుండా ఖాళీగా వదిలేసిన స్థానిక యాజమాన్యం..దీంతో ప్రపంచ వ్యాప్తంగా భావప్రకటన స్వేచ్ఛ పై మరోసారి చర్చ. ముందు పేజిలో ఖాళీ స్థలంతో ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ ఆర్టికల్ ను శుక్రవారం ప్రచురించడంతో వివాదానికి తెర లేపింది. ఇంటర్ నేషనల్ న్యూయార్క్ టైమ్స్ కు అనుబంధంగా పాకిస్తాన్ లోని స్థానిక పత్రిక ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ నడుస్తోంది. చైనాలో ట్రాన్స్ జెండర్ హక్కుల కోసం న్యూయార్క్ టైమ్స్ ఓ ఆర్టికల్ ను ది ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ కు పంపింది. ఆ ఆర్టిక్టల్ తో పాటూ చైనాలోని ఓ యువకుడు మరో పురుషుడికి చెంపపై ముద్దు పెట్టుకొంటున్న ఫోటోను ప్రచురించాలి. కానీ, ఆ ఆర్టికల్ మాత్రమే ప్రచురించి ఆ ఫోటో స్థానాన్ని ఖాళీగా వదిలేశారు. అది కూడా ముందు పేజీలో. దీంతో న్యూయార్క్ టైమ్స్ పాఠకులు ఉదయం లేచి చూడగానే పేపర్ ముందు పేజీలో బ్లాంక్ గా కనిపించింది. 'పాకిస్థాన్ లోని మా ముద్రణ భాగస్వామి ఆ ఫోటోను తొలగించారు. ఫోటోను తీసివేయడం వెనక ఎడిటోరియల్ స్టాఫ్ కు ఎలాంటి ప్రమేయం లేదు' అని ఇంటర్నేషనల్ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఆ ఫోటో ప్రచురిస్తే స్థాన...

కొత్త అధ్యాయం....?

*  ఆసీస్ గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన ధోని బృందం *  2-0తో టి20 సిరీస్ కైవసం *  రెండో మ్యాచ్‌లో 27 పరుగులతో ఓడిన ఫించ్‌సేన మెల్‌బోర్న్: దుమ్మురేపే బ్యాటింగ్... కళ్లు చెదిరే క్యాచ్‌లు... మెరుపు ఫీల్డింగ్... బౌలర్ల రాణింపు... ప్రతీకారేచ్ఛతో రెచ్చిపోయిన భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో చేసిన సమష్టిపోరాటం ఇది. ఏమాత్రం అలసత్వం చూపకుండా... ఏ అవకాశాన్ని వదలకుండా... అదరహో అన్న రీతిలో ఆడుతూ కంగారూల గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శుక్రవారం ఎంసీజీలో జరిగిన రెండో టి20లోనూ 27 పరుగుల తేడాతో ఫించ్‌సేనపై నెగ్గిన ధోని బృందం... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టి20 సిరీస్‌ను కైవసం చేసుకుని ఈ ఘనత అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 184 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (47 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫామ్‌ను కొనసాగించగా, శిఖర్ ధావన్ (32 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులకే...

ఆర్యను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు...?

ఆర్యను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అయితే... అంటున్న త్రిషను ఎవర్‌గ్రీన్ ప్రైమ్‌టైమ్ కథానాయిక అనిపేర్కొనవచ్చు. కారణం అందరికీ తెలిసింది.మూడు పదుల వయసు దాటిన ఈ ప్రౌఢ నిత్య సంచలన నటి. నటీమణుల్లో అధిక వదంతులకు కేంద్రబిందువు ఎవరన్న విషయంలో నయనతార, త్రిష పేర్లు పోటీ పడతాయనడంలో అతిశయోక్తి ఉండదేమో. విశేషం ఏమిటంటే వారిద్దరు ఒకప్పుడు బద్దశత్రువులైతే ఇప్పుడు ప్రియమైన నేస్తాలు. 13 ఏళ్ల నట జీవితంలో ఐదు పదుల చిత్రాల సంఖ్యను అవలీలగా అధిగమిస్తున్న నేటికీ క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతుండడం సాదారణ విషయం కాదు.ఈ హారర్‌కు మారిన ఈ చెన్నై చిన్నది నటించిన తాజా చిత్రం అరణ్మణై-2 శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా త్రిషతో చిన్న చిట్‌చాట్.   ప్ర:  మీకూ దెయ్యంగా మారాలని ఆశ పుట్టినట్లుందే? జ:   తొలిసారిగా అరణ్మణై-2 చిత్రంలో దెయ్యంగా నటించాను. అరణ్మణై చిత్రం నాకు బాగా నచ్చింది. దానికి సీక్వెల్ చిత్ర కథ దర్శకుడు సుందర్.సీ చెప్పినప్పుడు అందులో నటించే అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. కుష్బూ నాకు మంచి స్నేహితురాలు. అరణ్మణై-2లో నటించడానికి ఇదొకకారణం. ఇందులో నటించే అవకాశం రావడం ఘనతగా భావిస్తున్నాను. సిద్...

పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు...?

ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. స్టార్ హీరోలందరూ వరుస సినిమాలతో హవా చూపిస్తుంటే పవన్ మాత్రం సినిమాకు సినిమాకు మధ్యలో భారీ గ్యాప్ తీసుకుంటూ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ముగింపు దశలో ఉండటంతో పవర్ స్టార్ చేయబోయే నెక్ట్స్ సినిమాపై టాక్ మొదలైంది. ఇప్పటి వరకు పవన్ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాకపోయినా, పవన్ తో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్, కొమరం పులి లాంటి డిజాస్టర్ అందించిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడన్న వార్త, ప్రముఖంగా వినిపించింది. అంతేకాదు అజిత్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ సినిమా వీరంను పవన్ తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడన్న వార్త తాజాగా వినిపిస్తోంది. వీటికి తోడు గోపాల గోపాల ఫేం కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడట. మరి ఈ మూడు సినిమాలో పవన్, ఏ సినిమాకు కమిట్ అవుతాడో తెలియక అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు తికమక పడుతున్నారు.

టుడే అప్ డేట్స్...!!!

తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నేడు టీఆర్ఎస్ బహిరంగ సభ. ఈ సభలో ప్రసంగించనున్న కేసీఆర్ వైఎస్ఆర్ జిల్లాలో నేడు రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన నేటి నుంచి ఇంజనీరింగ్ పీజీ ప్రవేశ పరీక్ష గేట్.  దేశవ్యాప్తంగా 9 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హజరుకానున్నారు.   ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నేటి మధ్యాహ్నం చంద్రబాబు మీడియా సమావేశం అండర్ - 19 వరల్డ్ కప్ లో నేడు భారత్ - న్యూజిలాండ్ ఢీ హైదరాబాద్ లో నేడు ఏపీ, తెలంగాణ విద్యుత్ ఉన్నతాధికారుల సమావేశం. సర్వీస్ రికార్డులు, ఉద్యోగుల విభజనపై చర్చ కుల వివక్షను వ్యతిరేకిస్తూ నేడు న్యూఢిల్లీలో ర్యాలీ నేడు రోహిత్ బర్త్ డే. ఈ సందర్భంగా హెచ్ సీయూలో విద్యార్థుల దీక్ష నేడు తెలంగాణలో కళాశాలల బంద్ కి పిలుపునిచ్చిన ఏబీవీపీ

'నా బెడ్‌రూం నిండా ఆయన ఫొటోలే'...?

లండన్: యవ్వనప్రాయం ఎన్నో ఆకర్షణలు, మోహాలతో నిండి ఉంటుంది. యుక్తవయస్సులో కలిగే అలాంటి ఆకర్షణలకు, మోహాలకు తాను కూడా అతీతం కాదని అంటోంది హాలీవుడ్ బ్యూటీ లిల్లీ జేమ్స్. టీనేజ్‌ప్రాయంలో తాను ర్యాన్ ఫిలిప్‌ అంటే పడిచచ్చిపోయేదానన్ని, తన పడక గది నిండా ఆయన ఫొటోలే ఉండేవని చెప్తోంది. ప్రైడ్ అండ్ ప్రిజుడిస్, జాంబీస్‌ వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన ఈ భామ ప్రస్తుతం మ్యాత్ స్మిథ్‌తో డేటింగ్ చేస్తోంది. 'క్రూయెల్ ఇంటెన్షన్' సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ర్యాన్‌ అంటే తన యవ్వనప్రాయంలో విపరీతమైన ప్రేమ ఉండేదని లిల్లీ తెలిపింది. 'నా బెడ్రూమ్‌ నిండా ఆయన ఫొటోలే ఉండేవి. నేను ఆయనను ఎంతగా ప్రేమించానంటే అతని చిన్నచిన్న ఫొటోలన్నీ కలిపి ఓ పెద్ద పోస్టర్ చేసుకొని నా గదిలో అతికించుకున్నా' అని ఈ భామ 'ఫిమెల్ ఫస్ట్‌'తో తెలిపింది.

వర్మ నెక్ట్స్ సినిమా 'గవర్నమెంట్'....?

వీరప్పన్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ నార్త్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాడు. కొంత కాలంగా సౌత్ లో సినిమాలు చేస్తున్న వర్మ, వీరప్పన్ సినిమా తరువాత బాలీవుడ్ వెళ్లిపోయాడు. వీరప్పన్ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో భారీగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కూడా ఎనౌన్స్ చేశాడు. 'గవర్నమెంట్' పేరుతో వర్మ తెరకెక్కించనున్న ఈ సినిమాలో మరోసారి తనకు బాగా పట్టున్న అండర్ వరల్డ్ నేపథ్యాన్ని తీసుకోనున్నాడు. అయితే తన గత సినిమాల మాదిరిగా రాసుకున్న కథతో కాకుండా ముంబై మాఫియాలో నిజంగా జరిగిన పరిణామాలను ఈ సినిమాకు కథగా ఎంచుకున్నాడు. వీరప్పన్ సినిమాను తీసినంత రియలిస్టిక్ గా ముంబై మాఫియా నేపథ్యాన్ని వెండితెర మీద ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు. ముఖ్యంగా గవర్నమెంట్ సినిమాలో దావూద్ ఇబ్రహీం, చోటారాజన్ ల స్నేహం, తరువాత వారి మధ్య మనస్పర్థలు రావటం. దావూద్ కు తీవ్రవాదులు, ఐయస్ ఐతో ఉన్న సంబంధాలు, అండర్ వరల్డ్ మాఫియాకు ముంబై రాజకీయాలకు, పోలీస్ వ్యవస్థకు ఉన్న రిలేషన్స్ గురించి చూపించనున్నాడట. తను ప్రతి సినిమాను వివాదా...

ఎఫ్‌బీలో ఇక ....... అమ్మకాలకు చెక్!

సాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌లో ఇక తుపాకులు అమ్మకాలకు చెక్‌ పడనుంది. ఫేస్‌బుక్‌, దాని అనుబంధ ఫొటోషేరింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేటు తుపాకుల అమ్మకాలను నిషేధిస్తున్నట్టు సోషల్ మీడియా దిగ్గజం ప్రకటించింది. ఈ మేరకు తమ పాలసీలో మార్పులు తీసుకువచ్చింది. నిజానికి ఫేస్‌బుక్‌లో నేరుగా తుపాకుల అమ్మకాలు జరుగనప్పటికీ, వాటిని అమ్మే డీలర్లు మాత్రం తుపాకుల ఫొటోలను పోస్టు చేసి.. వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ప్రైవేటు తుపాకుల అమ్మకాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి.  ప్రైవేటు ఆయుధాల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి చర్చలకు వేదికగా మారుతోంది.  ఈ నేపథ్యంలో దీనిని నిరోధించేందుకు ఫేస్‌బుక్ తమ పాలసీలో మార్పులు తీసుకువచ్చింది. అయితే, తగిన లైసన్సు కలిగిన డీలర్లపై ఈ నిషేధం ఉండబోదని ఫేస్‌బుక్ ప్రాడక్ట్ పాలసీ చీఫ్ మోనికా బికెర్ట్‌ తెలిపారు. గతంలో ఔషధాల అమ్మకాల విషయంలోనూ ఫేస్‌బుక్ ఇదే తరహాలో నిషేధం విధించింది.

సోషల్ మీడియాలో తప్పులతో ఉద్యోగాలకు ఎసరు...?

హైదరాబాద్  : సోషల్ మీడియాను ఆస్వాదిస్తూ నేటి యువతరం గంటల తరబడి అందులో లీనమైపోతోంది. తమ భావాలను వ్యక్తీకరిస్తూ ప్రతి అంశంపైనా స్పందిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డిన్.. ఇలా వేదిక ఏదైనా కావొచ్చు. స్నేహితులతో చాటింగ్, తమ కామెంట్స్ పోస్టుచేయడంతో పాటు అనేక విషయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఆ పోస్టింగ్స్ వల్ల మీ ఉద్యోగానికే ఎసరు రావొచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు సోషల్ మీడియాలో మీరు చేసిన పోస్టింగ్స్ మీకు ఉద్యోగం రాకుండా ప్రతిబంధకంగా మారొచ్చు... తస్మాత్ జాగ్రత్త అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో విడుదలైన సోషల్ రిక్రూటింగ్ సర్వే తాజా ఎడిషన్‌లో దీనికి సంబంధించి అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవలి కాలంలో అమెరికా లాంటి దేశాల్లో రిక్రూటింగ్ ఏజెన్సీలు, రిక్రూటర్లు అత్యంత ప్రతిభావంతులైన నిపుణుల కోసం అన్వేషిస్తున్నాయి. వృత్తి నిపుణుల కోసం అన్వేషణలో అవి సోషల్ మీడియాపై ప్రధానంగా దృష్టి సారించాయని ఆ సర్వేలో వెల్లడైంది. రోజులు గడుస్తున్న కొద్దీ పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిభావంతులను ఎంపిక చేసుకోవడంలో రిక్రూటర్స్ 73 శాతం సోషల్ రిక్రూటింగ్ పైన, 63 శాత...

4 గంటల్లో 23 సార్లు ఆగిన గుండె....!!

కొచ్చి  : ఆయన వయసు 60 ఏళ్లు. ఎంచక్కా తన ఏడేళ్ల మనవడితో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. ఆయనకు కేవలం 4 గంటల వ్యవధిలో 23 సార్లు గుండె ఆగింది. అయినా తట్టుకుని నిలబడ్డారు!! విపరీతంగా సిగరెట్లు కాల్చే అలవాటున్న ఆ పెద్దాయన గుండెల్లో బాగా నొప్పిగా ఉందని చెప్పినప్పుడు.. ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి ఈసీజీ తీయిస్తే, గుండెపోటు వచ్చినట్లు తేలింది. ఆయనకు చికిత్స చేసేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించకపోగా.. పదేపదే చాలాసార్లు ఆయన గుండె ఆగిపోయింది. తర్వాత ఆయనను ఆస్టర్ మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. తొలిసారి గుండెపోటు వచ్చినప్పుడే పెద్ద ఆస్పత్రికి తీసుకురాకపోవడంతో.. తొలి గంటలో అందించాల్సిన చికిత్స అందలేదని.. అయినా అసలు నాలుగు గంటల్లో 23 సార్లు గుండె ఆగడం చిన్న విషయం కాదని సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ అనిల్ కుమార్ చెప్పారు. స్టెంటు వేయడం ద్వారా బ్లాకు క్లియర్ చేశామని తెలిపారు. సాధారణంగా గుండెపోటు వస్తే గుండెలో ఒక భాగానికి రక్తసరఫరా ఆగుతుందని, కానీ.. ఇక్కడ ఏకంగా గుండె కొట్టుకోవడమే ఆగిందని (కార్డియాక్ అరెస్ట్) ఆయన వివరించారు. ఆయన ఇక జీవనగమన...

డబ్బు కోసమే టీవీ షోలు చేస్తా...?

కేవలం డబ్బు కోసమే తాను టీవీ షోలు చేస్తానని తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరైన తమిళ హీరో మాధవన్ చెప్పాడు. 1990లలో 'సీ హాక్స్', 'బనేగీ అప్నీ బాత్' లాంటి షోలతో మాధవన్ అందరినీ ఆకట్టుకున్నాడు. డబ్బులు బాగా వస్తాయంటేనే టీవీ షోలు చేయాలన్నది తన ఆలోచన అని.. అయితే సినిమాలు చేసేటప్పుడు మాత్రం డబ్బు గురించి ఆలోచించేది లేదని చెప్పాడు. వాణిజ్య ప్రకటనలు ఎలా చేస్తామో టీవీ షోలు కూడా అలాగే చేస్తానని స్పష్టం చేశాడు. గతంలో 'తోల్ మోల్ కే బోల్' 'డీల్ యా నో డీల్' లాంటి రియాల్టీ షోలకు హోస్ట్‌గా కూడా మాధవన్ వ్యవహరించాడు. కానీ వాటన్నింటి కంటే, 'రెహనా హై తేరే దిల్ మే', 'రంగ్ దే బసంతి', 'తను వెడ్స్ మను', 'త్రీ ఇడియట్స్' లాంటి సినిమాలతో ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకులందరినీ ఆకర్షించాడు. తాజాగా సాలా ఖుద్దూస్ సినిమాలో కోచ్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో మాధవన్ సరసన కొత్త నటి రితికా సింగ్ నటించింది. రాజ్‌కుమార్ హిరానీ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో ...?

మెగా ఫ్యామిలీలో వివాదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టేందుకు మెగా హీరోలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొంత కాలంగా అన్నయ్య చిరంజీవికి దూరంగా ఉంటున్న పవన్, ఈ మధ్యే మళ్లీ ఆ కుటుంబానికి దగ్గరవుతున్నాడు. ఇటీవల సర్దార్ సెట్ నుంచి చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసి పవన్, ఆ తరువాత చిరు 60వ పుట్టినరోజు వేడుకల్లోనూ సందడి చేశాడు. తాజాగా చిరంజీవి కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ కు వెళ్లి తమ్ముడితో కాసేపు సరదాగా గడిపాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన విలేజ్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్న సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశాడు. పవన్ కళ్యాణ్ తో పాటు యూనిట్ సభ్యులతో సరదాగా గడిపిన మెగాస్టార్, అభిమానులతో పాటు యూనిట్ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. చిరు, పవన్ తో పాటు ఇతర యూనిట్ సభ్యులు కలిసి దిగిన ఫోటోను నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

విజయవాడ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం...!!!

విజయవాడ (రైల్వేస్టేషన్) : రైల్వేస్టేషన్‌లో బాంబు ఉందంటూ బుధవారం ఫోన్ రావడంతో పోలీసు అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక ఆగంతకుడు సెల్ నుంచి ఫోన్‌చేసి, రైల్వే స్టేషన్‌లో బాంబు ఉందని చెప్పాడు. అప్రమత్తమైన పోలీసు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి స్టేషన్‌లోని పలు ప్లాట్‌ఫారాలు, పార్శిల్ కార్యాలయంతో పాటు స్టేషన్‌లోని అణువణువూ తనిఖీచేశారు. పలు రైళ్లలో సైతం తనిఖీలు నిర్వహించారు. రైల్వే ఎస్‌పీ షిమోషి బాజ్‌పాయ్ నేతృత్వంలో 60 మంది సిబ్బంది స్టేషన్‌లో విస్తృతంగా తనిఖీ చేశారు. రెండు గంటలసేపు గాలించినా బాంబు ఆనవాళ్లు లభించకపోవడంతో వచ్చిన ఫోన్‌కాల్ ఆకతాయిగా నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ నంబరు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

నేటి వార్తా విశేషాలు....!!!

ఢిల్లీ: నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నేటి నుంచి గ్రేటర్ ప్రచార బరిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు రేపు గ్రేటర్ లో ఏపీ చంద్రబాబునాయుడి పర్యటన నేడు మీట్ ది ప్రెస్ ద్వారా ప్రజల్లో సీఎం కేసీఆర్ ఎల్లుండి పరేడ్ గ్రౌండ్స్ లో టీఆర్ఎస్ బహిరంగ సభ హెచ్ సీయూలో కొనసాగుతున్న విద్యార్థుల దీక్ష నేటి నుంచి హెచ్ సీయూలో ఎస్సీ, ఎస్టీ అధ్యాపకుల సిబ్బంది రిలే దీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో చలో ఢిల్లీకి విద్యార్థుల పిలుపు నేడు తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఎథిక్స్, హ్యూమన్ వాల్యుస్ పరీక్షలు అండర్-19 వరల్డ్ కప్: నేడు మిర్పుర్ లో ఐర్లాండ్ తో భారత్ ఢీ ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో బ్యాంకర్ల సమావేశం ఎన్ సీసీ, క్యాడెట్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీలో టీచర్ సంఘాల ధర్నా

ఒక్క ట్వీట్‌తో 81.77 కోట్లు సంపాదించింది...!

లండన్‌: బ్రెడ్డుముక్కను తింటూ కూడా బరువును ఎలా తగ్గించుకోవచ్చో చెప్తూ పెట్టిన ఓ ట్వీట్‌కు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఓఫ్రా విన్‌ఫ్రే అక్షరాల 12 మిలియన్ డాలర్లు (రూ. 81.77 కోట్లు) సంపాదించింది. 'వెయిట్‌ వాచర్స్' కంపెనీ తరఫున బ్రెడ్‌ తింటూ 26 పౌండ్ల బరువును ఎలా తగ్గవచ్చో తెలిపే ఓ వీడియోను ఆమె ట్వీట్టర్‌లో పోస్టు చేసింది. ఈ కంపెనీలో మీడియా మొఘల్‌గా పేరొందిన విన్‌ఫ్రేకు 6 మిలియన్‌ డాలర్ల వాటా ఉండగా.. ఈ ఒక్క ట్వీట్‌ వల్ల ఆమె సంపద 18 శాతం పెరిగి 12 మిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో 'వెయిట్ వాచర్స్' కంపెనీలో ఆమె షేర్‌ విలువ ఒకే ఒక్క గంటలోనే 2.10 శాతానికి పెరిగిందని 'ఫిమెల్ ఫస్ట్‌' మీడియా సంస్థ తెలిపింది. మల్టీ మిలియన్ డాలర్ ట్వీట్‌గా హల్‌చల్  చేసిన ఈ ట్వీట్‌లో 'బ్రెడ్‌ తినండి. బరువు తగ్గండి. ఏంటి? నిజమా! అవును. నాతోపాటు ఈ 30 సెకండ్ల వీడియో క్లిప్పును చూడండి. నేను 26 పౌండ్ల బరువు తగ్గాను. నేను ప్రతిరోజూ బ్రెడ్ తింటాను' అని విన్‌ఫ్రే పేర్కొంది. హాలీవుడ్ స్టార్స్ జెన్నిఫర్ హడ్సన్, జెన్సీ మెక్‌క్యాథీ తరహాలోనే గత అక్టోబర్‌ నుంచి 'వెయిట్‌ వాచర్స్‌' కంపెనీకి బ్ర...

స్టార్ ఎట్రాక్షన్... డ్యాన్స్...!

ప్రతిష్ఠాత్మక ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ’ (ఐఫా) తొలిసారిగా దక్షిణాదికి వచ్చి చాలా సంచలనాలే సృష్టించింది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నాలుగు సినిమా పరిశ్రమలకు సంబంధించి తొట్టతొలిసారిగా చేసిన ‘ఐఫా - ఉత్సవం’ 2016 అవార్డుల వేడుకలో రెండో రోజైన సోమవారం నాడు ఎన్నో విశేషాలు చోటుచేసుకున్నాయి. జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అందించిన ఈ ‘ఐఫా - ఉత్సవం’లో క్రేజీ హీరోలు రామ్‌చరణ్, అఖిల్, అందాల తార తమన్నా తదితరులు పలు హిట్ పాటలకు ఆహూతుల ఎదుట ప్రత్యక్షంగా నర్తించారు. దాంతో,  గచ్చీబౌలిలోని ఔట్‌డోర్ స్టేడియమ్‌కు విచ్చేసిన జనం వేదికకే కళ్ళప్పగించి, చూస్తూ ఉండిపోయారు. ప్రముఖ హిందీ నటీనటులు ప్రసిద్ధ అవార్డు ప్రదానోత్సవాల్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలాకాలంగా ఉన్నదే. కానీ, తెలుగు హీరోలు స్టేజ్ డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి. ఎలక్ట్రిఫయింగ్ రామ్‌చరణ్ ‘ఐఫా - ఉత్సవం’లో స్టేజ్ ప్రదర్శన కోసం కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు రామ్‌చరణ్. ఆ కృషి మొత్తం సోమవారం వేదికపై కనిపించింది. ఒరిజినల్‌గా మంచి...

lactobex-c tablet

if any one wants this tablets contact me 9885923045::hari pls mention this add is in  freshdeals365.com   dont foreget to mention

అదరగొట్టారు...!

ధనాధన్ క్రికెట్‌లో తమదైన ముద్ర చూపిస్తూ చెలరేగిన ధోని సేన అడిలైడ్‌లో అదుర్స్ అనిపించింది. వన్డే పరాజయాల భారాన్ని వెనక్కి తోస్తూ టి20 పోరులో శుభారంభం చేసింది. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ బ్యాటింగ్‌లో కదంతొక్కిన కోహ్లికి తోడుగా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ సత్తా చాటడంతో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన కంగారూలు చేతులెత్తేయడంతో గణతంత్ర దినోత్సవాన భారత్ పండుగ చేసుకుంది. తొలి టి20లో భారత్ ఘనవిజయం * 37 పరుగులతో ఆసీస్ చిత్తు * కోహ్లి 90 నాటౌట్ * రాణించిన బుమ్రా * శుక్రవారం రెండో మ్యాచ్ అడిలైడ్: వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ ఇచ్చిన విజయోత్సాహం, ఆత్మవిశ్వాసం భారత్ జట్టు టి20ల్లో కూడా వెన్నంటి నిలిచినట్లుంది. ఫలితమే మూడు మ్యాచ్‌ల సిరీస్ మొదటి పోరులో ఏకపక్ష విజయం. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 37 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ విరాట్ కోహ్లి (55 బంత...

గల్ఫ్ మోసాలపై సినిమా...!!!

సిరిసిల్ల రూరల్: గల్ఫ్ వలస కార్మికుల కష్టాలు, నేత కార్మికుల జీవితాలపై సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రముఖ సినీ దర్శక, నిర్మాత వై.సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన చిత్ర నిర్మాణ యూనిట్‌తో కలిసి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పర్యటించి నేత కార్మికుల జీవన విధానంపై అధ్యయనం చేశారు. వస్త్ర పరిశ్రమ, కార్మికుల కష్టాలను సైతం గల్ఫ్ సినిమాలో చూపించనున్నట్లు చెప్పారు. సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి ఎల్లమ్మ దేవాలయం ఆవరణ, దేశాయిపల్లి గుట్టలు, జిల్లెల్లలోని పురాతన గడీని సందర్శించి వాటి చరిత్రను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ పండుగలు, విశిష్టత, ప్రజల జీవన విధానం, వలసలకు కారణాలు, గల్ఫ్ మోసాలు, గల్ఫ్ బాధితుల సమస్యలపై సిరిసిల్ల, పరిసర గ్రామాల్లో పిబ్రవరి 8 నుంచి 11 వరకు పాటలు, సన్నివేశాలను చిత్రికరీంచనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పోచంపల్లిలో పలు సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపారు. గల్ఫ్‌లో ఆత్మహత్యలకు పాల్పడ్డ వారి కుటుంబాలను కూడా కలసి పలు విషయాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఆయన వెంట కెమెరామన్ జయరాం, ఆర్ట్ డెరైక్టర్ నాగు, గల్ఫ్ వలసవాదుల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు జనగామ శ్రీనివాస్, లయన్స్ క్ల...

తొలిసారి విచారణకు అగ్రిగోల్డ్ చైర్మన్లు...?

విజయవాడ: అగ్రి గోల్డ్ కేసులో నేడు మరోసారి విచారణ జరగనుంది. సహకారశాఖ అధికారులు ఎదుట అగ్రి గోల్డ్ చైర్మన్లు వెంకట రామారావు, శేషు నారాయణ, ఇతర డైరెక్టర్లు తొలిసారిగా హాజరుకానున్నారు. అగ్రిగోల్డ్ పరివార్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వారు రూ.600 కోట్లకు పైగా డిపాజిట్లను సేకరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే డిపాజిట్ దారులను సహకారశాఖ అధికారులు విచారించారు.

నేటి వార్తా విశేషాలు...!!!!

నేడు దేశ వ్యాప్తంగా యూనివర్సిటీల బంద్ కు హెచ్ సీయూ జాక్ పిలుపు నేడు మధ్యాహ్నం 3గంటలకు గ్రేటర్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ. జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహంపై చర్చ ప్రత్యేక హోదాపై నేడు కాకినాడలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యువభేరి అంబేద్కర్ భవన్ లో ప్రత్యేక హోదాపై విద్యార్థులు, యువతతో వైఎస్ జగన్ ముఖాముఖి. అనంతరం కాకినాడ జేఎన్ టీయూ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో బహిరంగ సభ. నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరనున్న మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, తనయుడు శశిధర్, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు నేడు కేరళ వెళ్లనున్న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన

మేమిద్దరం స్నేహితులమే...!

- హన్సిక క్యూట్‌గాళ్ హన్సిక ఆ మధ్య ‘చంద్రకళ’లో బాగానే భయపెట్టగలిగారు. ఈసారి మళ్లీ ‘కళావతి’గా భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. సుందర్.సి దర్శకత్వంలో  ‘అరణ్మణై-2’  పేరుతో  తమిళంలో  తెరకెక్కిన ఈ చిత్రాన్ని సర్వంత్ రామ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ సంయుక్తంగా ‘కళావతి’  పేరిట తెలుగులో అందిస్తున్నాయి. శుక్రవారం ‘కళావతి’ రిలీజవుతున్న సందర్భంగా హన్సిక  ఏమంటున్నారంటే... * నేను మొదటి నుంచి బబ్లీ గాళ్ తరహా పాత్రలే చేస్తూ వచ్చా. కానీ దర్శకుడు సుందర్ ‘చంద్రకళ’లో గ్రామీణ యువతి పాత్ర చేయించారు. మొదట్లో సందేహించా. కానీ ఆ పాత్ర అందరికీ నచ్చేసింది. ఈ ‘కళావతి’ కూడా కొత్తగా ఉంటుంది. ఇందులో తొలిసారిగా గర్భవతిగా కనిపిస్తాను. గర్భవతులు ఎలా నడుస్తారో గమనించా. * సిద్ధార్థ్‌తో నాకిది మూడో సినిమా. అతను మంచి కో-యాక్టర్. సుందర్. సి డెరైక్షన్‌లోనే ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ చేశాం. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో ఈ సినిమా చేశా.       * ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో నాకు, త్రిషకు ఏవో మనస్పర్థలు వచ్చాయనీ, త్రిష కోపంగా ఉందనీ చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అలాంటిదేం లేదు....

అధర్వ ర్యాగింగ్ చేశారు..?

నటుడు అధర్వ తనను ర్యాగింగ్ చేశారని పేర్కొన్నారు నటి ఆనంది. నటిగా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తెలుగింటి ఆడపడుచు అన్న విషయం తెలిసిందే. అయినా తమిళంలో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఆనంది కయల్ చిత్రంతో ఇక్కడ మంచి స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో తనను అశ్లీలంగా నటింపచేశారంటూ ఆరోపణలతో కాస్త కలకలం సృష్టించిన ఆనందితో చిట్‌చాట్. ప్ర: మీ గురించి చెప్పండి? జ: ప్లస్‌టూ చదువుతుండగానే చిత్ర రంగప్రవేశం చేశాను. నేను నటిని కాక ముందు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. అదంటే నాకు చాలా ఆసక్తి. అయితే చదువు పూర్తి చేయమని అమ్మ హితవు పలకడంతో బీబీఏ కోర్స్‌లో చేరాను. ప్రభుసాలోమన్ దర్శకత్వంలో నటించిన కయల్ చిత్రం నా జీవితాన్ని మార్చేసింది. ఆ చిత్రం తరువాత పలు మంచి అవకాశాలు వరిస్తున్నాయి. కయల్ చిత్రం 2014 చివరిలో విడుదలైంది. 2015లో అధర్వ, దినేశ్, జీవీ ప్రకాశ్‌కుమార్‌లతో నటించిన చిత్రాలు విజయం సాధించాయి. 2016 నూతన సంవత్సరాన్ని జీవీ ప్రకాశ్‌కుమార్‌తో జత కడుతున్న తాజా చిత్ర షూటింగ్‌లోనే జరుపుకున్నాను. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది విజయవంతంగా సాగుతుందనే నమ్మకం ...

సెల్‌ఫోన్‌లో డ్రైవింగ్ లెసైన్స్....?

* వాహన్ బీమా తరహాలో సరికొత్త యాప్ * అన్ని రకాల డాక్యుమెంట్లతో ‘ఎం-వాలెట్’ * త్వరలో ప్రవేశపెట్టనున్న ఆర్టీఏ సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లెసైన్స్, ఆర్‌సీ వెంట తెచ్చుకోవడం మరిచిపోయారా. ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని ఫైన్ వేస్తారేమోనని ఆందోళనకు గురవుతున్నారా... ఇక నుంచి ఇలాంటి ఆందోళనలు అవసరం లేదు. జేబులో ఎలాంటి డాక్యుమెంట్లూ లేకపోయినా సరే నిశ్చింతగా రోడ్డెక్కవచ్చు. ట్రాఫిక్ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు బెంబేలెత్తవలసిన పనిలేదు. అయితే అందుకోసం చేయాల్సిందల్లా మీ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ప్లే నుంచి ఒక మొబైల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడమే. ఆ యాప్ ద్వారా మన డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసుకోవడమే. ‘స్మార్ట్’ సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోన్న రవాణా శాఖ త్వరలో ‘ఎం-వాలెట్’ పేరుతో సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ యాప్ ద్వారా వాహనదారులు ఈ-డ్రైవింగ్ లెసైన్స్, ఈ-ఆర్‌సీ, ఈ-ఇన్స్యూరెన్స్, ఈ-పొల్యూషన్ తదితర వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఇటీవల ప్రవేశపెట్టిన ‘వాహన్ బీమా’ తరహాలో ఎం-వాలెట్ సేవలందజేస్తుంది. వాహనాల ఇన్సూరెన్స్ వివరాలను, వివిధ ...

ఉద్యోగ అవకాశాలు...!!!

బీహెచ్‌యూ టీచింగ్ ఫ్యాకల్టీ బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ).. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వాని స్తోంది. మొత్తం ఖాళీలు 59. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 10. వివరాలకు www.bhu.ac.in చూడొచ్చు.  బాబా ఫరీద్ వర్సిటీలో 37 పోస్టులు  ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ ఫిజిస్ట్, టెక్నీషియన్  ఫర్ న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నీషియన్, రేడియోథెరపీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 37. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 5. వివరాలకు www.bfuhs.ac.in చూడొచ్చు.  చాచా నెహ్రూ బాల చికిత్సాలయలో వివిధ పోస్టులు  ఢిల్లీలోని చాచా నెహ్రూ బాల చికిత్సాలయ.. ిపీడియాట్రిక్స్, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, రేడియాలజీ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 9. ఇంటర్వ్యూ తేది జనవరి 29. వివరాలకు www.delhi.gov.in చూడొచ్చు. ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో వివిధ పోస్టులు కోల్‌కతాలోని ఐసీఏ...

ఆ ఉగ్రవాది... అఫ్రిదీ...?

పోలీసు అధికారిపై కాల్పులు జరిపింది అతడే రియాజ్ భత్కల్ ద్వారా ఐఎంలోకి 2008 నుంచి పూర్తి అజ్ఞాతవాసం   సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని పరప్పన అగ్రహార ప్రాంతంలో శనివారం తెలంగాణ పోలీసు అధికారిపై హత్యాయత్నం చేసిన ఉగ్రవాది ఆలమ్ జబ్ అఫ్రిదీ అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిర్థారించింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉండి, 2008 నుంచి అజ్ఞాతంలో ఉన్న ఇతగాడు ప్రస్తుతం జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ ఉగ్రవాద సంస్థకు శిక్షకుడిగా పని చేస్తున్నాడని అధికారులు చెబుతున్నారు. ఇటీవల బెంగళూరులోని ఫ్రెంచ్ కాన్సులేట్‌కు పది రోజుల క్రితం వచ్చిన బెదిరింపు లేఖ సైతం ఇతడి పనేనని దాదాపు నిర్థారించాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జోహాపురా ప్రాంతానికి చెందిన ఆలమ్ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ద్వారా ఉగ్రవాద బాట పట్టాడు. హలోల్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద శిక్షణకు హాజరుకావడంతో పాటు మరికొందరినీ ఉగ్ర బాట పట్టించాడు. 2008లో జరిగిన అహ్మదాబాద్, సూరత్, జైపూర్ పేలుళ్లలో కీలకపాత్ర పోషించిన ఇతడికి ఐఎం మాస్టర్‌మైండ్స్ రియాజ్, ఇక్బాల్ భత్కల్స్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. నాటి పేలుళ్లలో బాంబులు పెట్టడానికి వినియోగించిన స...

కుర్రాళ్లూ... కొట్టేయండి..!

నేటి నుంచి అండర్-19 ప్రపంచకప్ * ఫేవరెట్‌గా భారత్ ఢాకా: ఓవైపు ఉరకలెత్తే ఉత్సాహం... మరోవైపు గెలవాలన్న కసి... వెరసి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కుర్రాళ్ల క్రికెట్ పండగకు బంగ్లాదేశ్‌లో రంగం సిద్ధమైంది. నేటి నుంచి బంగ్లాదేశ్‌లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి తలపడుతున్నాయి. ఫిబ్రవరి 14 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న మాజీ చాంపియన్ భారత్... గ్రూప్ ‘డి’లో ఐర్లాండ్, నేపాల్, న్యూజిలాండ్‌లను ఎదుర్కొంటుంది. గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, ఫిజి, వెస్టిండీస్, జింబాబ్వే; గ్రూప్ ‘బి’లో అఫ్ఘానిస్తాన్, కెనడా, పాకిస్తాన్, శ్రీలంక; గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య బంగ్లాదేశ్, నమీబియా, డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్ ఉన్నాయి. భద్రతాకారణాలరీత్యా ఆస్ట్రేలియా జట్టు ఈ మెగా ఈవెంట్ నుంచి వైదొలిగింది. తొలి రోజున బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా; ఫిజీతో ఇంగ్లండ్ ఆడనున్నాయి. భారత్ తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో వార్మప్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన భారత్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న యువ భారత్ జట్టుకు ఇ...

లేని అమ్మాయికి కాని రేప్...?

నిజం నిదానంగా చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టివస్తుందట.  సరిగ్గా ఇలాంటిదే ఈ కథ! కామోగెలో పీటర్సన్ అనే ఒక అమ్మాయి రేప్‌కి గురైందని సౌతాఫ్రికాకి చెందిన ఖుతి మెకానానిసె అనే ఒకమ్మాయి ట్వీట్ చేసింది. ఒకటి కాదు. రెండు కాదు... ఏకంగా డెబ్భయి ట్వీట్లు చేసింది. ఆ కథ నిజమో కాదో తెలుసుకోకుండా పత్రికలు ప్రచురించాయి, ట్విట్టర్ వీరులు స్పందించారు. సోషల్ మీడియా సలసల మరిగింది. ఆఖరికి ప్రభుత్వ విభాగాలు సైతం స్పందించాయి. కొందరైతే బాధతో దేశం వదిలేస్తామని మన ఆమీర్ ఖాన్‌లా ప్రకటించేశారు. అంతలో ఖుతి నెమ్మదిగా అసలు విషయాన్ని బయటపెట్టింది. లేని కామోగెలోపై జరగని రేప్ గురించి తాను కట్టు కథ అల్లానని ఒప్పుకుంది. పైగా మహిళలపై అత్యాచారాలను ఎత్తి చూపేందుకే తానిలా చేశానని చెప్పి దులిపేసుకుంది. అంతా బాగుంది. కానీ ఇలాంటి చీప్ ట్రిక్కులు అసలైన ఇష్యూలను నాన్నా పులి కథలా మార్చేసే ప్రమాదం కూడా ఉందని ఖుతిలాంటి వాళ్లు గుర్తుంచుకోవాలి.

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.

కడప సెంట్రల్ జైలు నుంచి 47 మంది ఖైదీల విడుదల

కడప (వైఎస్సార్ జిల్లా) : కడప కేంద్ర కారాగారం నుంచి మంగళవారం 47 మంది జీవిత ఖైదీలను విడుదల చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన 58 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కడప కేంద్ర కారాగార అధికారులకు లేఖ ద్వారా తెలియజేసింది. వారిలో 8 మంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. మహిళలను కొద్ది రోజుల క్రితమే నెల్లూరు జైలుకు తరలించారు. అక్కడ వారు విడుదల అవుతున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 50 మందిలో 47 మందిని మంగళవారం విడుదల చేయగా..మరో ముగ్గురికి వేరే కేసులతో సంబంధం ఉండటంతో విడుదల నిలిపివేశారు.

పాకెట్ లో పాకెట్... ఆ జీన్స్ మతలబేంటి...?

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా జీన్ ప్యాంట్ల గురించి తెలియని వారుండరు. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో పిల్లలు, యువతీ యువకులతో పాటు వృద్ధులు సైతం జీన్స్ అంటే ఒక క్రేజ్ ఉంది. అందరూ ధరిస్తున్న జీన్స్ లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అందరూ సాధారణంగా గమనించేదే... కానీ అదెందుకు ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా ఎవరైనా దర్జీ వద్ద షర్ట్, ప్యాంటు ఇంకేదైనా కుట్టిస్తే రహస్యంగా కొన్ని పాకెట్స్ కుట్టించుకునే అలవాటు ఉన్న వారు కూడా ఉంటారు.   కానీ జీన్స్ విషయంలో అలా కాదు. అదేమంటే... జీన్స్ ముందు భాగంలో ఉంటే (పాకెట్) జేబులో మరో చిన్న పాకెట్ కూడా ఉంటుంది. అది కూడా ప్యాంటు కుడివైపు ఉండే పాకెట్ లో మాత్రమే. ప్రపంచంలో ఏ జీన్స్ చూసినా ముందుండే పెద్ద పాకెట్ లో పైకి కనిపించే విధంగా ఓ చిన్న పాకెట్. అది చతురస్రాకారంలో కనిపిస్తుంటుంది. ఆ చిన్న పాకెట్ కు కూడా రెండు వైపులా బలమైన బటన్స్ తో ఉంటుంది. అది జీన్స్ ప్రత్యేకత. అయితే ఆ చిన్న పాటి పాకెట్ ఎందుకోసం. ఈ విషయం చాలా మందికి తెలియదు. దాని ఉపయోగమేంటో కూడా తెలియదు. దీనిపై లోతుగా వెళితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీన్స్ అభిమానులకు ఈ విషయంపై పెద్దగా అవగాహన లేదని తేలింద...

టీమిండియా చేతిలో ఆసీస్ చిత్తు...!!

అడిలైడ్:  ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ లో టీమిండియా బోణి చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి ట్వంటీ20లో టీమిండియా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 189 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 19.3 ఓవర్లలో 151 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(44) ఫర్వాలేదనిపించగా, స్టీవ్ స్మిత్(21), డేవిడ్ వార్నర్(17), షేన్ వాట్సన్(12), ట్రావిస్ హెడ్(2), వేడ్(5), ఫాల్కనర్ (10)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఆసీస్ చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ లో ఆకట్టుకున్నటీమిండియా.. ఆపై బౌలింగ్ లో కూడా రాణించి సమష్టి విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా బౌలర్లలో బూమ్రా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్, జడేజా, హార్దిక్ పాండ్యాలకు తలో రెండు వికెట్లు లభించాయి. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఆశిష్ నెహ్రా నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లి దూకుడుగా ఆడటంతో 189 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. కోహ్లి(90 నాటౌట్; 55 బంతుల్లో9 ఫోర్లు, 2 సిక్స్లర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగ...