సాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌లో ఇక తుపాకులు అమ్మకాలకు చెక్ పడనుంది. ఫేస్‌బుక్, దాని అనుబంధ ఫొటోషేరింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేటు తుపాకుల అమ్మకాలను నిషేధిస్తున్నట్టు సోషల్ మీడియా దిగ్గజం ప్రకటించింది. ఈ మేరకు తమ పాలసీలో మార్పులు తీసుకువచ్చింది. నిజానికి ఫేస్‌బుక్‌లో నేరుగా తుపాకుల అమ్మకాలు జరుగనప్పటికీ, వాటిని అమ్మే డీలర్లు మాత్రం తుపాకుల ఫొటోలను పోస్టు చేసి.. వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
ప్రైవేటు తుపాకుల అమ్మకాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. ప్రైవేటు ఆయుధాల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి చర్చలకు వేదికగా మారుతోంది. ఈ నేపథ్యంలో దీనిని నిరోధించేందుకు ఫేస్‌బుక్ తమ పాలసీలో మార్పులు తీసుకువచ్చింది. అయితే, తగిన లైసన్సు కలిగిన డీలర్లపై ఈ నిషేధం ఉండబోదని ఫేస్‌బుక్ ప్రాడక్ట్ పాలసీ చీఫ్ మోనికా బికెర్ట్ తెలిపారు. గతంలో ఔషధాల అమ్మకాల విషయంలోనూ ఫేస్‌బుక్ ఇదే తరహాలో నిషేధం విధించింది.

Post a Comment