రానున్న ఎన్నికలలో నేను ఓటు వేయను అని విశ్వ నటుడు కమలహాసన్ అన్నారు. ఆయన జోక్‌గా అన్న విషయం కాదు. పత్రికా ముఖంగానే చెప్పారు. కమలహాసన్ నటిస్తూ, రాజ్‌కమల్ ఇంటర్‌నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం శభాష్‌నాయుడు. తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్ర నిర్మాణంలో లైక్ ప్రొడక్షన్ భాగస్వామ్యం పంచుకుంటోంది. ప్రముఖ మలయాళ దర్శకుడు టి.కె.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకిగా శ్రుతిహాసన్ నటించడం విశేషం. ముఖ్యపాత్రలో రమ్యకృష్ణతో పాటు బ్రహ్మానందం సౌరభ్‌శుక్లా, ఆనంద్ మహాదేవ్, భరత్‌బహుండల్, ఫరిదాజలాల్, సిద్ధిక్, మనునారాయణన్ తదితరులు నటిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక టి.నగర్, హబీబుల్లా రోడ్డులోని నడిగర్ సంఘం ఆవరణంలో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను ప్రదర్శించారు. కార్యక్రమంలో కమలహాసన్, శ్రుతిహాసన్, దర్శకుడు టి.కె.రాజీవ్‌కుమార్, సంగీత దర్శకుడు ఇళయరాజా, లైక్ సంస్థ అధినేత సుభాష్‌కరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమలహాసన్ విలేకరులతో మాట్లాడుతూ ఇది హ్యూమరస్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల...