Skip to main content

Posts

Showing posts from May, 2016

శామ్ సంగ్ గెలాక్సీ సీ7 ధర, ఫీచర్లు ఇవే...

దక్షిణ కొరియా బహుళ జాతీయ మొబైల్ కంపెనీ శామ్ సంగ్ గెలాక్సీ 'సీ' సిరీస్ నుంచి కొత్త గెలాక్సీ సీ7ను  అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ పోన్ ఎప్పటినుంచి  వినియోగదారులకు అందుబాటులో ఉంచుతుందో మాత్రం ప్రకటించలేదు. ఇటీవలే గెలాక్సీ సీ5ను శామ్ సంగ్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. శామ్ సంగ్ గెలాక్సీ సీ5 కంటే గెలాక్సీ సీ7 వేరియంటే పెద్దదిగా ఉంటుందని పేర్కొంది. ధర, ఫీచర్లను మాత్రమే కంపెనీ ప్రస్తుతం విడుదల చేసింది. శామ్ సంగ్ గెలాక్సీ సీ7 రెండు వేరియంట్లలో లభ్యం కానుందని పేర్కొంది. 32 జీబీ వేరియంట్ ధర రూ. 26,600, 64జీబీ ధర రూ.28,600గా ఉంచుతున్నట్టు తెలిపింది. శామ్ సంగ్ గెలాక్సీ సీ7 ఫీచర్స్.... ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మాలో హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ 5.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ఎస్ఓసీ 4జీబీ ర్యామ్ 16 మెగాపిక్సెల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా 32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు 128జీబీ వరకు విస్తరణ మెమరీ 3300 ఎంఏహెచ్ బ్యాటరీ గోల్డ్, పింక్, గ్రే, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం ఫింగర్ ప్రింట్ స్...

72 ఏళ్ల తర్వాత బయటపడింది!

అది ఎప్పుడో 1944వ సంవత్సరం. అప్పట్లో రెండో ప్రపంచయుద్ధం భీకరంగా జరుగుతోంది. ముగ్గురు సిబ్బందితో కూడిన అమెరికా బాంబర్ విమానం ఒకటి శత్రుస్థావరాల మీద దాడికి బయల్దేరింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా అది వెళ్తుండగా శత్రుసైన్యాలు దాన్నిగుర్తించి పేల్చేశాయి. దాంతో ఆ విమానం కాస్తా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఆ ఘటన జరిగి ఇప్పటికి 72 ఏళ్లు గడిచింది. టీబీఎం-1సి అవెంజర్ విమానం ఇన్నేళ్ల తర్వాత సముద్ర అడుగుభాగంలో కనిపించింది. దాంట్లోనే విమాన సిబ్బంది అవశేషాలు కూడా కనిపించాయి. ఇన్నాళ్ల బట్టి ఆ విమానం కోసం శాస్త్రవేత్తలు గాలిస్తూనే ఉన్నారు. ఇలా వివిధ సందర్భాల్లో కనిపించకుండా పో యిన అమెరికన్ విమానాలను కనిపెట్టేందుకు 'ప్రాజెక్ట్ రికవర్'ను చేపట్టారు. ఆ ప్రాజెక్టు సాధించిన విజయాల్లో ఇదొకటి. అత్యాధునిక సోనార్ టెక్నాలజీని ఉపయోగించి విమానాలు ఎక్కడున్నాయో వీళ్లు తెలుసుకుంటారు. కనిపించకుండా పోయిన సిబ్బంది మృతదేహాలలో మిగిలిన భాగాలను దేశానికి తీసుకొచ్చి, వారికి సగౌరవంగా అంత్యక్రియలు జరిపించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ప్రాజెక్ట్ రికవర్ గ్రూపు సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎరిక్ టెరిల్ తెలిప...

పొరపాటున కండోమ్ మింగేసిందట!

కడుపు నొప్పి వస్తుందని ఆసుపత్రికి వచ్చిన ఓ యువతి పొట్టలో కండోమ్‌ను గుర్తించిన డాక్టర్లు కంగుతిన్నారు. కామెరూన్ లోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో యువతి అపెండిక్స్ లో ఉన్న కండోమ్ ను తొలగించిన డాక్టర్లు.. ఆమెకు కడుపునొప్పి నుంచి విముక్తి కలిగించారు. వివరాల్లోకి వెళ్తే.. కడుపునొప్పితో పాటు వికారంగా ఉందని ఇటీవల ఓ 26 ఏళ్ల యువతి కామెరూన్ లోని ఓ ఆసుపత్రికి వచ్చింది. దీంతో ఆమె స్కాన్ రిపోర్టును పరిశీలించిన వైద్యులు.. అమె అపెండిక్స్ ఉబ్బి ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు అపెండిక్స్ ను తొలగించే క్రమంలో అక్కడే ఉన్న రబ్బర్ లాంటి ఓ పదార్థాన్ని చూసి షాక్ తిన్నారు. దానిని పరీక్షించి చూసిన వైద్యులు చివరికి కండోమ్ గా తేల్చారు. కండోమ్ ను ఆమె నోటి ద్వారా తీసుకోవటం వల్ల అది అపెండిక్స్ వరకూ వచ్చి అడ్డుపడిందని  వైద్యులు తెలిపారు. వారం రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసిన సందర్భంలో ప్రమాదవశాత్తూ కండోమ్ ను మింగినట్లు ఆ యువతి వెల్లడించడంతో డాక్టర్లకు అసలు విషయం తెలిసింది. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMEN...

వారికి పే టీఎం, షాప్ క్లూస్ మద్దతు

క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఫ్లిప్ కార్ట్ నుంచి ఆఫర్ లెటర్లు అందుకుని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు  రెండు ఈ కామర్స్ సంస్థలు ముందుకు వచ్చాయి.  గుజరాత్ బాధిత విద్యార్థులకు  ఐఐఎం పేటీఎమ్, షాప్ క్లూస్ మద్దతు లభించింది. ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ లెటర్స్ అందుకుని భంగపడి, ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఐఐఎం గ్రాడ్యుయేట్లకు  తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు  యోచిస్తున్నట్టు పేటిఎం ప్రకటించింది.  వారికి ఉద్యోగాలిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అమిత్ సిన్హా తెలిపారు. ఈ మేరకు  అహ్మదాబాద్ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు.  విద్యార్థుల ప్రొఫైల్స్ పంపమని అడిగామనీ, వాటిని  పరిశీలించిన మీదట  నైపుణ్యానికి తగ్గట్టుగా పోస్టింగ్స్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.  ఇటీవల జరిగిన ప్లేస్‌మెంట్లలో పలు ఐఐఎంల నుంచి 50 మందిని విధుల్లోకి తీసుకున్నామని  పేర్కొంది. అలాగే  అహ్మదాబాద్ విద్యార్థులకూ తమ సంస్థలో అవకాశం ఇస్తామని  ప్రకటించింది. ప్లేస్ మెంట్  సెల్ నుంచి తమకు  ఈమెయి...

ఛార్జింగ్ కూడా షేర్ చేయొచ్చు!

యాండ్రాయిడ్ ఫోన్ల ప్రపంచం విస్తరించింది. ప్రతి మనిషికీ ఫోన్ అత్యవసర వస్తువుగా మారిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించుకోవడంలో జనం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయిపోతున్నారు. ఫోన్ కాల్స్ మాట్లాడటమే కాక వాయిస్ మెసేజిలు పంపడంతో పాటు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఫోన్ బ్యాలెన్స్‌ను కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే  టెక్స్ట్, ఫొటోలు, వీడియోలతో పాటు.. తాజాగా ఫోన్ ఛార్జింగ్ ను సైతం షేర్ చేసుకునే అవకాశాన్ని లండన్ పరిశోధకులు అందుబాటులోకి తేనున్నారు. అత్యవసర సమయాల్లో ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఇకముందు ఉండవట. ఫోన్ చార్జింగ్ ను షేర్ చేసుకునే వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ఫోన్ లో పూర్తిగా ఛార్జింగ్ అయిపోయినపుడు ఇతరుల ఫోన్ నుంచి ఎటువంటి వైర్, కేబుల్ అవసరం లేకుండా పవర్ షేర్ చేసుకునే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పవర్ షేక్ పేరుతో లండన్ యూనివర్సిటీ పరిశోధకులు  అభివృద్ధి పరుస్తున్న కొత్త వైర్ లెస్ టెక్నాలజీని త్వరలో అందరికీ అందుబాటులోకి తేనున్నారు.  పవర్ ట్రాన్స్ మిట్ కాయిల్స్ ద్వారా ఒక మొబైట్ ఫోన్ న...

ట్విన్ సిస్టర్స్‌.. ఆదుర్స్

విజయనగరం అర్బన్: విజయనగరంలోని ట్విన్ సిస్టర్స్(కవలలు)కు ఎంసెట్ మెడికల్ విభాగంలో టాప్ ర్యాంకులు లభించాయి. కొడాలి అలేఖ్య 145 మార్కులతో 62వ ర్యాంక్, అఖిల 126 మార్కులతో 1,275వ ర్యాంక్ సాధించింది. వీరి తల్లిదండ్రులు తిరుమల ప్రసాద్, కృష్ణశాంతి వృత్తిరీత్యా వైద్యులు. పట్టణంలో వీరు ఓ ప్రైవేటు ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ట్విన్ సిస్టర్స్ అలేఖ్య, అఖిల మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిడిలేని వాతావరణం లభించడం వల్లే ర్యాంక్ సాధించగలిగామన్నారు. తల్లిదండ్రుల బాటలోనే వైద్యసేవలను అందించడమే లక్ష్యమని చెప్పారు. జిప్‌మార్, ఎయిమ్స్ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి జాతీయ స్థాయి మెడికల్ కళాశాలల్లో చదవాలనుకుంటున్నట్లు తెలిపారు.   click the below image to get a best deal:: https://www.facebook.com/freshdeals365 When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and...

క్షణాల్లో వెబ్‌సైట్ సిద్దం...!!

సొంత డొమైన్‌పై ఉచితంగా వెబ్‌పేజీ కేటగిరి వారీగా రెడీమేడ్‌ మెనూ సిద్ధం రూ.5వేలకే ప్రత్యేక డొమైన్‌, ఏడాది నిర్వహణ చిన్న దుకాణాలే లక్ష్యంగా మైడిజీ సిటీ స్టార్టప్‌   ఒక వ్యాపార సంస్థకు వెబ్‌సైట్‌ పెట్టుకుని నిర్వహణ చేయడానికి వేలల్లో డబ్బులు పోయాలి. దాంతో చిన్నపాటి వ్యాపార సంస్థలు అంత ఖర్చు చేసి వెబ్‌సైట్‌పెట్టుకోవడానికి వెనకాడుతారు. దాని వల్ల వారి వివరాలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితమయిపోతుంటాయి. కచ్చితంగా ఈ అంశమే ఆకర్షించిన శ్రీనివాస్‌, వెంకట్‌, శ్రీకాంతలు వేగంగా, అతి తక్కువకే వెబ్‌సైట్‌ అందిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి మై డిజీ సిటీ స్టార్ట్‌పకు శ్రీకారం చుట్టారు. మరి ఇది నగర ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో పరిశీలిద్దామా...   రెండు నిమిషాల్లో వెబ్‌సైట్‌ ఒక వెబ్‌సైట్‌ రెడీ చేయాలంటే నెలల తరబడి వేచి ఉండాలని అనుకుంటారు. కేవలం రెండు నిమిషాల్లో వెబ్‌పేజీ సిద్ధం చేసి మైడిజీసిటీ వారు అందిస్తున్నారు. అంత వేగంగా ఇవ్వడానికి వెనక దానికి చాలా కసరత్తు చేశారు. ముందుగానే ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. దాని ద్వారా రెడీమేడ్‌ టెప్లెట్స్‌, ఎవరైనా మార్చుకునేలా వీలుండే మెనూలు...

చైనా తప్పుడు పోస్టులు ఎన్ని...

సున్నితమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చైనా ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 4880 లక్షల తప్పుడు పోస్ట్ లను సోషల్ మీడియాలో పోస్టు చేసిందని తేలింది. ప్రభుత్వ ఉద్యోగులే రహస్యంగా ఈ పని చేపట్టినట్టు సర్వేల్లో తెలిసింది. చాలా కాలం నుంచే వార్తల్ని, సమాచారాన్ని చైనా తన ఆధీనంలో ఉంచుకుందని వెల్లడైంది. అయితే అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్, గూగుల్ లాంటి వాటిని, ఇతర విదేశీ వెబ్ సైట్లను చైనా తన దేశంలో నిషేధించింది. స్థానిక సోషల్ మీడియా సైట్లు కూడా ప్రస్తుతం తన అథారిటీల ఆధీనంలో నడుస్తున్నాయి. హర్వర్డ్ యూనివర్సిటీ డేటా పరిశోధకుడు గ్రే కింగ్, చైనా "ఫిప్టీ సెంట్ పార్టీ" అనే పరిశోధనను చేపట్టారు. ప్రభుత్వానికి అనుకూలంగా సోషల్ మీడియాలో కామెంట్, పోస్టు చేసిన వారికి ప్రభుత్వం 50 చైనీస్ సెంట్లు ఇస్తుందని ప్రజల్లో రూమర్స్ రావడంతో ఆయన ఈ పరిశోధన చేశారు. ఇంటర్నెట్ లో జరిగే రాజకీయ చర్చల్లో ఎక్కువగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటున్నాయని ఈ పరిశోధన కనుగొంది. వాదనలకు, వివాదస్పద అంశాలకు మాత్రం ఈ పోస్టులు దూరంగా ఉంటున్నాయని తెలిపింది. ఎప్పడికప్పుడూ సబ్జెక్టును మారుస్తూ.. ...

బెట్టింగ్ డబ్బుల కోసం ఏ మగాడు చేయలేని పని

రియాల్టీ షోల పిచ్చి రానురానూ ముదిరిపోతోంది. ఈ మధ్య హైద్రాబాద్‌లో ఓ రియాల్టీ షో స్టంట్ పేరుతో ఒంటికి నిప్పంటించుకుని పాతబస్తీకి చెందిన కుర్రాడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే అమెరికన్లతో పోలిస్తే మన దేశంలో ఈ రియాల్టీ షోల వ్యామోహం చాలా తక్కువనే చెప్పాలి. అయితే అమెరికన్లలో చాలామందికి బెట్టింగ్ పిచ్చి బాగా ఎక్కువ. ఫ్రెండ్‌తో బెట్ కట్టిన కెనడాకు చెందిన బ్రియాన్ జాంబిక్ అనే 55 ఏళ్ల మెజీషియన్ ఏ మగాడు చేయలేని, చేయకూడని పని చేశాడు. ఫ్రెండ్ బెట్ కట్టాడని ఆపరేషన్ చేయించుకుని వక్షోజాలు పెంచుకున్నాడు. అయితే జాంబిక్ ఈ బెట్‌లో గెలుచుకున్న మొత్తం 100 డాలర్లు. జాంబిక్ విషయం తెలుసుకున్న ఓ రియాల్టీ షో నిర్వాహకులు అతనితో ప్రోగ్రాం చేశారు. అతనిని రియాల్టీ షోకు రప్పించేందుకు నిర్వాహకులు 5వేల డాలర్లు సమర్పించుకున్నారు. జాంబిక్‌తో పాటు శస్త్ర చికిత్స చేసిన సర్జన్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. అతని పిచ్చితో ఏదో చేసుకుంటే రియాల్టీ షో పేరుతో పరువు తీసుకోవాలా అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  click the below image to get a best deal:: When you Call., Don't forget to m...

ప్రసవాన్ని ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఈ రోజుల్లో ఆనందం వచ్చినా, బాధ కలిగినా చాలామంది ముందుగా చెప్పుకునేది ఫేస్‌బుక్‌కే. రకరకాల కార్యక్రమాలకు ఫేస్‌బుక్‌ వేదిక అవుతోంది. అందుకే తన భార్య.. బిడ్డను కనడాన్ని కూడా ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు ఓ వ్యక్తి. కాలీఫోర్నియాకు చెందిన ఫకమలో కిహే ఎకీ( Fakamalo Kihe Eiki) అనే వ్యక్తి తన భార్యకు నొప్పులు మొదలైన దగ్గర్నుంచి బిడ్డ బయటకు వచ్చే వరకు జరిగిన ప్రాసెస్‌ను ఫేస్‌బుక్‌ ద్వారా తన స్నేహితులకు లైవ్‌లో చూపించాడు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన చాలామంది ఆమెను ఎంకరేజ్‌ చేస్తూ ఆ సమయంలోనే కామెంట్స్‌ కూడా పోస్ట్‌ చేశారు. ఆ ప్రత్యక్ష ప్రసార వీడియోను ఇప్పటి వరకు 23 వేల మంది చూశారు. అన్ని యాంగిల్స్‌ నుంచి ఆ వీడియోను తీసి నెట్‌లో పెట్టాడు. 45 నిమిషాల ఆ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. click the below image to get a best deal:: When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit aga...

అభి‘షాక్‌’ ...!!!

  అభిషేక్‌, ఐశ్వర్యరాయ్‌ జంటకు ఫాలోయింగ్‌ ఎక్కువే. ఈ గ్లామర్‌ కపుల్‌ ఎక్కడ కనిపించినా కెమెరా ఫ్లాష్‌లు వెలుగుతూనే ఉంటాయి. అయితే ఆలుమగల మధ్య చిరాకులు, పరాకులు కామనే. ఈ గిల్లికజ్జాలు నాలుగు గోడల మధ్యసాగితే ఫర్వాలేదు. కాని, నలుగురిలో బయటపడితే మాత్రం గోరంతలు కొండతలుగా చెప్పుకుంటారు.   ఐశ్వర్య సెకండ్‌  ఇన్నింగ్స్‌కు గ్రాండ్‌ షోగా నిలిచిన సరబ్‌జిత ప్రీమియర్‌ షో సందర్భంగా ఐష్‌, అభిల మధ్య సాగిన ఓ సీను ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ప్రీమియర్‌ షోకు బచ్చన్‌ ఫ్యామిలీతో పాటు ఇండసీ్ట్ర పెద్దలంతా విచ్చేశారు. షో ముగిశాక.. సెలబ్రిటీలంతా వేదికపైకి చేరుకున్నారు. అభి, ఐష్‌ చెట్టాపట్టాలేసుకుని వేదికనెక్కారు. ఇద్దరినీ ఫొటోలకు పోజివ్వాల్సిందిగా ఫొటోగ్రాఫర్లు కోరడం.. ఐష్‌ సరేననడం.. మామూలుగానే జరిగిపోయాయి. అంతలోనే ఏమైందో కాని, అభిషేక్‌ నెర్వ్‌సగా ఫీలయ్యాడు. ఐష్‌ చేయిని నెమ్మదిగా వదిలించుకుని వెనుక నుంచి వేదిక పక్కకు వచ్చేసే ప్రయత్నం చేశాడు. ఫొటో దిగడానికి రావాల్సిందిగా భార్య పిలుస్తున్నా.. వినీ విననట్టు వ్యవహరించాడు. దీంతో ఐశ్వర్యనే భర్త దగ్గరగా వెళ్లి చేయి...

బ్రహ్మోత్సవం...ప్రతి హృదయాన్ని కదిలిస్తోంది

బాపుగారి బొమ్మని తలపించే అందం ప్రణీత సొంతం. అలాంటి అమ్మాయి లంగా, ఓణి, పరికిణీలతో కనిపిస్తూ బావా.. బావా అంటూ సందడి చేస్తే వెండితెరకి వచ్చే కళే వేరు. అందుకే ప్రణీతని దర్శకులు మరదలు పాత్రల్లో చూపించడానికి ఇష్టపడుతుంటారు. ‘బావ’ సినిమానే తీసుకోండి. అందులో ప్రణీత మరదలు పిల్లే. ‘అత్తారింటికి దారేది’లోనూ అంతే. పవన్‌కల్యాణ్‌కి మరదలే అవుతుంది. శుక్రవారం వచ్చిన ‘బ్రహ్మోత్సవం’లోనూ మహేశ్ మరదలిగా నటించింది. ఆ పాత్రల్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ ప్రణీత సందడి చేస్తున్న విధానం కుర్రకారుకు భలే నచ్చుతోంది. ‘‘మరదలిగానే కావచ్చు గానీ ‘బ్రహ్మోత్సవం’లో నా పాత్ర కొత్త కోణంలో ఉంటుంది. ఇందులో భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆక ట్టుకొనే ప్రయత్నం చేశా’’ అంటున్న ప్రణీతతో ‘సాక్షి’ స్పెషల్ చాట్...   ♦  నేను నటించిన మంచి చిత్రాల్లో ‘బ్రహ్మోత్సవం’ ఒకటి. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రతి హృదయాన్ని కదిలించే విధంగా ఉంటుంది. అందుకే ఈ కథ వినగానే నేను వెంటనే కనెక్ట్ అయిపోయా. పాత్రకి సంబంధించి కూడా ప్రతి అణువణువూ ఆస్వాదించా. ముఖ్యంగా నా పాత్ర తన మనసులోని భావోద్వేగాలను బయటప...

లవ్ రాజు ఎవరో..!

  ‘ఐ యామ్ ఇన్ లవ్’.  ‘చాలా సంవత్సరాల నుంచి తను పరిచయం’. ‘నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ తను’.‘తనది కూడా నాలా హెల్పింగ్ నేచర్’.‘వంట సూపర్బ్‌గా చేస్తాడు. నాన్‌వెజ్ కూడా’. ‘రిస్క్ లేదు. పెద్దలొప్పేసుకున్నారు’. ‘ఆ యంగ్ హీరో పేరడగొద్దు తర్వాత చెబుతాను’. అని సమంత ‘సాక్షి’కి చెప్పేసింది. ఆ లవర్ బోయ్ ఎవరో మీరు చెప్పగలరా? ♦ ‘24’ సినిమాలో కాలం వెనక్కి వెళుతుంది కదా.. మీకలాంటి అవకాశం వస్తే.. మీ లైఫ్‌లో దేన్ని చెరిపేయాలనుకుంటారు? 2012లో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. ఒక్కసారి వెనక్కి వెళ్లగలిగితే వాటిని ఎరేజ్ చేసేస్తాను. ♦ ఏంటవి.. ప్రొఫెషనలా? పర్సనలా? రెండు రకాలుగా తీసుకోకూడని డెసిషన్స్ తీసుకున్నాను. ♦ మీలాంటి అందగత్తెలకు ప్రపోజల్స్ బాగానే వస్తాయి. లవ్‌లో పడేయడానికి చాలామంది ట్రై చేస్తుంటారు కూడా.. అప్పుడేమనిపిస్తుంది? ఎవరైనా వచ్చి, నన్ను లవ్‌లో పడేయడానికి ట్రై చేస్తే ఆ విషయం కూడా మనసుకి ఎక్కించుకోనంత బోర్‌గా తయారైపోయాను. ఓల్డ్ అయిపోయాను. వర్క్‌లో ఇన్‌వాల్వ్ అయిపోయాను. నిజం చెప్పాలంటే ఈ మధ్య నా లైఫ్ నాకే బోరింగ్‌గా ఉంది. ఇప్పుడు పెళ్లి, పిల్లలు.. ఆ స్టేజ్‌కి వచ్...

ఇక స్మార్ట్‌ఫోన్‌కు బై బై....!

  - 2021 నాటికి కనుమరుగు కానుందని అంచనా - వాటి స్థానంలో ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ సాధనాలు - ‘ఎరిక్‌సన్’ సర్వేలో అధిక శాతం ప్రజల అభిప్రాయం  ఇంకో ఐదేళ్లలో స్మార్ట్‌ఫోన్లు అనేవి లేకుండా పోతాయా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) ఆధారంగా పనిచేసే సాధనాలు రానున్నాయా.. అవుననే అంటోంది స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఎరిక్‌సన్. కొంతకాలం జపాన్‌కు చెందిన సోనీతో కలసి ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్లు తయారు చేసింది. ప్రస్తుతం ‘కన్జూమర్ ల్యాబ్స్’ అనే మరో సంస్థను నడుపుతోంది. వినియోగదారుల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులను గుర్తించడమే ఈ సంస్థ లక్ష్యం. దాదాపు 40 దేశాలకు చెందిన లక్ష మందిపై సర్వే చేసి ఇటీవలే 2016కు సంబంధించిన అంచనాలను విడుదల చేసింది. 2021 నాటికల్లా స్మార్ట్‌ఫోన్లు ఉండకపోవచ్చని సర్వేలో తేల్చింది. సగానికి పైగా ప్రజలు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారని ఎరిక్‌సన్ పేర్కొంటోంది. ఈ సర్వేలోని మరికొన్ని విశేషాలు.. నిర్ణయాల్లోనూ ‘స్మార్ట్’..  ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల ద్వారా ఇంటర్నెట్ వాడకం విస్తృతమైంది. వ్యక్తులు తీసుకునే నిర్ణయాల్లోనూ ఇంటర్నెట్ ప్రభా...

తప్పు చేశాను... భయమేస్తోంది

సందేహం నా వయసు 20. ఐదు నెలల క్రితం పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయని స్కాన్ చేయించుకుంటే ఓవరీస్‌లో సిస్ట్ ఉందని తేలింది. రెండు నెలలు ట్యాబ్లెట్స్ వేసుకుంటే సెట్ అయింది. నేను నెలక్రితం మా బావతో అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్‌లో పాల్గొన్నాను. ఒకే నెలలో నాలుగుసార్లు కలిశాం. కానీ మూడుసార్లు మాత్రం పిల్ వేసుకున్నాను. చివరి పిల్ వేసుకున్న వారం తర్వాత లైట్‌గా బ్లీడింగ్ కనిపించింది. కానీ ఇంతవరకు పీరియడ్స్ రాలేదు. నాకు భయంగా ఉంది, సలహా ఇవ్వండి?                                                                      - ఓ సోదరి, పేరు రాయలేదు ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అనేది ఎప్పుడో ఒకసారి సంరక్షణ లేకుండా కలిస్తే గర్భం రాకుండా ఉండటానికి వాడేది. ...

గుమాస్తా కుమార్తె టాపర్...!!!

ఎంసెట్ మెడికల్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన హేమలత  విజయవాడ(గుణదల)/కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రతిభకు ఆర్థిక స్థితిగతులు అడ్డంకి కాదని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిని రుజువు చేసింది. బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసే ఓ సాధారణ వ్యక్తి కుమార్తె ఎంసెట్-2016 మెడికల్ విభాగంలో తొలి ర్యాంకు సాధించి స్ఫూర్తిదాయకం గా నిలిచింది. శనివారం విడుదలైన ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో కర్నూలు జోహరాపురానికి చెందిన మాచాని హేమలత మొదటి ర్యాంకు సాధించింది. కర్నూలులోని శ్రీనివాస క్లాత్ స్టోర్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న మాచాని వీరన్న, చంద్రకళ దంపతుల రెండో కుమార్తె హేమలత. తన ముగ్గురు బిడ్డ లు చదువులో ఆణిముత్యాలని చెప్పారు. తన సంతానాన్ని ఉన్నత స్థానంలో నిలపడానికి నిరంతరం శ్రమిస్తున్నానని వీరన్న తెలిపారు.  నాన్న కల నెరవేర్చిన హేమలత  మాచాని వీరన్న, చంద్రకళ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. పెద్ద కుమార్తె సౌజన్య ప్రస్తుతం మహానందిలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతోంది. రెండో కుమార్తె హేమలత ఎంసెట్ మెడిసిన్‌లో స్టేట్ ఫస్టు ర్యాంకు సాధించింది. వీరిద్దరూ కర్నూలులోని ఓ ప్ర...

రామ్ గోపాల్ వర్మ పిల్లి చుడండి...?

రామ్ గోపాల్ వర్మ పిల్లి అనగానే ఆయన పెంచుకుంటున్న పిల్లి అనుకుంటే పొరపాటే. ఈ పిల్లి హావభావాలు చూస్తే వర్మ దీనితో సినిమా చేసినాచేస్తాడు. ఎందుకంటే దానికో కారణం ఉంది. చాలామందికి హారర్ చిత్రాలు చూడటమంటే ఎంతో ఇష్టం. కొంతమంది భయపడుతూనే సగం కళ్లతో దెయ్యాల సినిమాలు చూస్తుంటారు. ఆ సమయంలో వారి ముఖంలో కనిపించే హావభావాలు చూడాలి.... ఆ కళే వేరు. అంత భయపడుతూ చూడటం ఎందుకని అడిగితే ఇష్టమని సమాధానం చెబుతారు. అయితే ఇదంతా ఇప్పుడెందుకంటే దానికి కారణం లేకపోలేదు. మనుషులు దెయ్యాల సినిమాలు చూసి భయపడటం సహజం. ఒక పిల్లి హారర్ సినిమా చూసి భయపడితే ఎలా ఉంటుంది. ఇలాంటి ఆలోచనే చేశారు కొంతమంది. వెంటనే పిల్లిని ఒంటరిగా కూర్చోబెట్టి టీవీలో దెయ్యాల సినిమా వేసి చూపించారు. ఆ పిల్లి పెర్ఫామెన్స్ చూస్తే ఔరా అనాల్సిందే. ఆ వీడియోను మీరూ చూడండి. click the video to watch the ram gopal varma cat    click the below image to get a best deal:: When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted...

ఐటిలో అవకాశాలెన్నో..

  కొంతమంది యువత డిగ్రీ చేసిన వెంటనే మాస్టర్స్‌ చేయాలనుకోరు. కాలేజీ నుంచి బయటకు రాగానే తమ కాళ్లమీద తాము నిలబడాలనుకుంటారు. ఇలాంటి వారికి కేవలం గ్రాడ్యుయేషన్‌ చేస్తే జాబ్‌ రాదు. వీళ్లు ఏదైనా షార్ట్‌టర్మ్‌ కోర్సులపై దృష్టిసారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే కాలేజిలో డిగ్రీ చేసి బయటకు రాగానే ఉద్యోగం సంపాదించుకోవడానికి షార్ట్‌ టర్మ్‌ కోర్సులు బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిప్లొమా లేదా సర్టిఫికేట్‌ కోర్సులు చేస్తే ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ కోర్సుల వివరాలు...     డిజిటల్‌ మార్కెటింగ్‌ అర్హత: ప్లస్‌ టు/అండర్‌గ్రాడ్యుయేషన్‌ కాలపరిమితి: 4-8 నెలలు ఉద్యోగ అవకాశాలు: ఎస్‌ఇవొ ఎగ్జిక్యూటివ్‌, సోషల్‌ మీడియా ఎక్స్‌పర్ట్‌, ఇంటర్‌నెట్‌ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, సోషల్‌మీడియా మార్కెటింగ్‌, సర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌: ది ఇన్‌ష్టిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అకౌంట్స్‌ (ఐసిఎ), కోల్‌కత వెబ్‌ అకాడమీ, ఎన్‌ఐఐటి, ఇండస్‌ నెట్‌ అకాడమీ ప్రారంభ జీతం: నెలకు రూ.20,000 నుంచి రూ.35,000   నెట్‌వర్క్‌ ఇంజనీర్‌ అర్...

టీవీ రిపోర్టర్‌నంటూ ఇంటికి వచ్చాడు... ఇంటర్వ్యూ చేస్తానంటూ.?

  విరుధునగర్: కూతురు ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. స్టేట్ లెవెల్ ర్యాంక్ కూడా వచ్చింది. తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ వారికి ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. స్టేట్ లెవెల్ ర్యాంకు సాధించిన సెల్వీని ఇంటర్వ్యూ చేస్తానంటూ ఓ వ్యక్తి టీవీ రిపోర్టర్‌ పేరుతో ఇంటికి వచ్చాడు. సాధారణంగా ర్యాంకర్స్‌ను ఇంటర్వ్యూ చేయడానికి టీవీ చానెల్స్ వాళ్లు వస్తుంటారు కదా... ఇతను కూడా అలా వచ్చిన వాడే అని తల్లితండ్రులు భ్రమ పడ్డారు. ఆ వ్యక్తి సెల్వీని ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ అయిపోగానే సెల్వీ తల్లిదండ్రులను పిలిచి వారికి ఓ విషయం చెప్పాడు. సెల్వీ ర్యాంకు సాధించినందుకు కలెక్టరేట్ నుంచి 50వేలు ఇస్తారని నమ్మబలికాడు. సెల్వీని తన వాహనంపై ఎక్కించుకుని వెళ్లాడు. ఆమె తల్లిదండ్రులు బస్సులో కలెక్టరేట్‌కు వెళ్లారు.   కానీ వారికి అక్కడే అనుకోని సంఘటన ఎదురైంది. ఆ పేరుతో ఇక్కడకు ఎవరూ రాలేదంటూ కలెక్టరేట్ సిబ్బంది చెప్పారు. దీంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. సదరు టీవీ చానెల్‌కు వెళ్లి విచారించారు. విజయ్ ఆనంద్ అనే పేరుతో ఎవరూ లేరని చానెల్...

340 కోట్ల ఏళ్ల కింద తొలి సునామీ

కొన్ని కోట్ల సంవత్సరాల కింద అంగారకుడిని రెండు భారీ ఉల్కలు ఢీకొనడం వల్ల దానిపై రెండు సునామీలు సంభవించాయని తాజా పరిశోధనలో తేలింది. దాదాపు 340 కోట్ల సంవత్సరాల కింద భారీ ఉల్కలు ఢీకొనడం వల్ల తొలిసారి సునామీ అల ఏర్పడిందని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుడు అల్బర్టో ఫెయిరెన్ తెలిపారు. ద్రవరూపంలోని నీరు వల్లే ఈ అల ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే మరో భారీ ఉల్కా విస్ఫోటం వల్ల రెండో సునామీ చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు ఆధారాలను కనుగొన్నారు.  ఈ రెండు సునామీలకు మధ్య ఉన్న లక్షల సంవత్సరాల కాలం పాటు అంగారకుడు అతి శీతల స్థితిలోకి వెళ్లిపోయాడని గుర్తించారు. ఆ సమయంలోనే అక్కడి నీరు ఘనీభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా అక్కడి సముద్రతీరం ప్రాంతంలోని నీరు చాలా వెనక్కి వెళ్లడం ద్వారా రెండో సముద్రతీరం ఏర్పడిందని భావిస్తున్నారు. రెండో సునామీ సంభవించిన సమయంలో సముద్రంలోని మంచు ఎగిరి చాలా దూరంలో పడిపోయిందని, ఇది తిరిగి సముద్రంలోకి రాలేదని ఫెయిరెన్ పేర్కొన్నారు. అంగారకుడు ఏర్పడిన తొలినాళ్లలో చాలా చల్లటి సముద్రాలు ఉండేవని స్పష్టం చేశారు. click the below image to g...

ప్రముఖ కంపెనీ సీఈవో ఇలా చేశాడేంటి..!

ఓ ప్రముఖ కంపెనీ మాజీ సీఈవో చేసిన పని ఇప్పుటు హాట్ టాపిక్ గా మారింది. ఫియట్ కంపెనీ మాజీ సీఈవో లాపో ఎల్కన్ తన పక్కనే నిల్చున్న హీరోయిన్ ఉమా థర్మన్ ను దగ్గరకు లాక్కుని గాఢంగా ముద్దుపెట్టుకున్నారు. చారిటీ కార్యక్రమంలో ఇలాంటి దిగజారుడు పనులు వ్యాపార దిగ్గజం చేయడంపై అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ఎయిడ్స్ రీసెర్చ్ వారు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఉమా థర్మన్ సంయుక్తంగా ఈవెంట్ నిర్వహించారు. ఎయిడ్స్ బాధితులకు సహాయార్థం విరాళాలు సేకరించేందుకు ఏర్పాటుచేసిన ఈవెంట్ లో ఫ్యాషన్ షో టిక్కెట్లు కూడా విజేతలకు అందజేశారు. విక్టోరియా ఫ్యాషన్ షోకు సంబంధించి ఆయన 1.32 కోట్ల రూపాయలు (1.96 లక్షల అమెరికా డాలర్లు) గెలుపొందారు. దీంతో తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఓ వింత మార్గాన్ని ఎంచుకున్నారు. ఈవెంట్ నిర్వహిస్తోన్న నటి థర్మన్ ను దగ్గరికి ఆమెతో లాక్కుని బలవంతంగా లిప్ లాప్ చేశారు. ఊహించని ఘటనతో ఆమె షాక్ కు గురైనా వెంటనే కోలుకుంది. ముద్దుపై స్పందించలేదు కానీ, తీవ్ర అసహనానికి గురైనట్లు మాత్రం తెలుస్తోంది. స్మోక్ చేస్తున్న ఎల్కన్ అవక...

రైలుకింద పడి అక్కా చెల్లెళ్ల మృతి..?

తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య.. మరో సోదరి పరిస్థితి విషమం  విజయవాడ (భవానీపురం): తండ్రి మరణాన్ని తట్టుకోలేని ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో సోదరి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ రూరల్ మండలం రాయనపాడు రైల్వే ట్రాక్‌పై శుక్రవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాలు.. మృతురాళ్ల తండ్రి అబ్దుల్ రఫీ లారీ డ్రైవర్. రాయనపాడులోని ఒక బిస్కెట్ కంపెనీ గోడౌన్ నుంచి సరుకు చేరవేస్తుంటాడు. ఆయన భార్య షాకిరా సుల్తానా అనారోగ్యంతో ఉండటంతో గురువారం విజయవాడ ఆస్పత్రిలో ఉన్న ఆమెను చూసి ఇంటికి వస్తున్నానని పోరంకిలోని తన బావమరిదికి ఫోన్ చేసి చెప్పాడు. కాగా, గురువారం ఉదయం పోరంకి ఎస్‌బీఐ ఏటీఎం దగ్గర రఫీ చనిపోయి ఉన్నట్లు అతని బావమరిదికి సమాచారం వచ్చింది. ఈ విషయం హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్న రఫీ కుమార్తెలు రుకియా సుల్తానా, షాహిన్, పర్వీన్‌లకు  తెలిసింది. విజయవాడ వచ్చిన వారు తండ్రి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో రాయనపాడు వచ్చారు. ఏమనుకున్నార...