కేవలం డబ్బు కోసమే తాను టీవీ షోలు చేస్తానని తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరైన తమిళ హీరో మాధవన్ చెప్పాడు. 1990లలో 'సీ హాక్స్', 'బనేగీ అప్నీ బాత్' లాంటి షోలతో మాధవన్ అందరినీ ఆకట్టుకున్నాడు. డబ్బులు బాగా వస్తాయంటేనే టీవీ షోలు చేయాలన్నది తన ఆలోచన అని.. అయితే సినిమాలు చేసేటప్పుడు మాత్రం డబ్బు గురించి ఆలోచించేది లేదని చెప్పాడు. వాణిజ్య ప్రకటనలు ఎలా చేస్తామో టీవీ షోలు కూడా అలాగే చేస్తానని స్పష్టం చేశాడు.
గతంలో 'తోల్ మోల్ కే బోల్' 'డీల్ యా నో డీల్' లాంటి రియాల్టీ షోలకు హోస్ట్‌గా కూడా మాధవన్ వ్యవహరించాడు. కానీ వాటన్నింటి కంటే, 'రెహనా హై తేరే దిల్ మే', 'రంగ్ దే బసంతి', 'తను వెడ్స్ మను', 'త్రీ ఇడియట్స్' లాంటి సినిమాలతో ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకులందరినీ ఆకర్షించాడు. తాజాగా సాలా ఖుద్దూస్ సినిమాలో కోచ్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో మాధవన్ సరసన కొత్త నటి రితికా సింగ్ నటించింది. రాజ్‌కుమార్ హిరానీ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Post a Comment