నిజం నిదానంగా చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టివస్తుందట. సరిగ్గా ఇలాంటిదే ఈ కథ! కామోగెలో పీటర్సన్ అనే ఒక అమ్మాయి రేప్‌కి గురైందని సౌతాఫ్రికాకి చెందిన ఖుతి మెకానానిసె అనే ఒకమ్మాయి ట్వీట్ చేసింది. ఒకటి కాదు. రెండు కాదు... ఏకంగా డెబ్భయి ట్వీట్లు చేసింది. ఆ కథ నిజమో కాదో తెలుసుకోకుండా పత్రికలు ప్రచురించాయి, ట్విట్టర్ వీరులు స్పందించారు. సోషల్ మీడియా సలసల మరిగింది. ఆఖరికి ప్రభుత్వ విభాగాలు సైతం స్పందించాయి.
కొందరైతే బాధతో దేశం వదిలేస్తామని మన ఆమీర్ ఖాన్‌లా ప్రకటించేశారు. అంతలో ఖుతి నెమ్మదిగా అసలు విషయాన్ని బయటపెట్టింది. లేని కామోగెలోపై జరగని రేప్ గురించి తాను కట్టు కథ అల్లానని ఒప్పుకుంది. పైగా మహిళలపై అత్యాచారాలను ఎత్తి చూపేందుకే తానిలా చేశానని చెప్పి దులిపేసుకుంది. అంతా బాగుంది. కానీ ఇలాంటి చీప్ ట్రిక్కులు అసలైన ఇష్యూలను నాన్నా పులి కథలా మార్చేసే ప్రమాదం కూడా ఉందని ఖుతిలాంటి వాళ్లు గుర్తుంచుకోవాలి.
Post a Comment