Skip to main content

వర్మ నెక్ట్స్ సినిమా 'గవర్నమెంట్'....?


వీరప్పన్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ నార్త్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాడు. కొంత కాలంగా సౌత్ లో సినిమాలు చేస్తున్న వర్మ, వీరప్పన్ సినిమా తరువాత బాలీవుడ్ వెళ్లిపోయాడు. వీరప్పన్ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో భారీగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కూడా ఎనౌన్స్ చేశాడు.

'గవర్నమెంట్' పేరుతో వర్మ తెరకెక్కించనున్న ఈ సినిమాలో మరోసారి తనకు బాగా పట్టున్న అండర్ వరల్డ్ నేపథ్యాన్ని తీసుకోనున్నాడు. అయితే తన గత సినిమాల మాదిరిగా రాసుకున్న కథతో కాకుండా ముంబై మాఫియాలో నిజంగా జరిగిన పరిణామాలను ఈ సినిమాకు కథగా ఎంచుకున్నాడు. వీరప్పన్ సినిమాను తీసినంత రియలిస్టిక్ గా ముంబై మాఫియా నేపథ్యాన్ని వెండితెర మీద ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు.

ముఖ్యంగా గవర్నమెంట్ సినిమాలో దావూద్ ఇబ్రహీం, చోటారాజన్ ల స్నేహం, తరువాత వారి మధ్య మనస్పర్థలు రావటం. దావూద్ కు తీవ్రవాదులు, ఐయస్ ఐతో ఉన్న సంబంధాలు, అండర్ వరల్డ్ మాఫియాకు ముంబై రాజకీయాలకు, పోలీస్ వ్యవస్థకు ఉన్న రిలేషన్స్ గురించి చూపించనున్నాడట. తను ప్రతి సినిమాను వివాదాస్పదం చేసే వర్మ ఇలాంటి వివాదాస్పద కథను ఎంచుకొని ఇంకెన్ని వివాదాలకు తెర తీస్తాడో చూడాలి.

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

నేటి వార్తావిశేషాలు నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కేటీపీఎస్ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కేసీఆర్ నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన.'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ నేడు గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ నేటి నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఆప్ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావాపై నేటు పాటియాల హౌజ్ కోర్టులో విచారణ

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.