లండన్: యవ్వనప్రాయం ఎన్నో ఆకర్షణలు, మోహాలతో నిండి ఉంటుంది. యుక్తవయస్సులో కలిగే అలాంటి ఆకర్షణలకు, మోహాలకు తాను కూడా అతీతం కాదని అంటోంది హాలీవుడ్ బ్యూటీ లిల్లీ జేమ్స్. టీనేజ్‌ప్రాయంలో తాను ర్యాన్ ఫిలిప్ అంటే పడిచచ్చిపోయేదానన్ని, తన పడక గది నిండా ఆయన ఫొటోలే ఉండేవని చెప్తోంది.
ప్రైడ్ అండ్ ప్రిజుడిస్, జాంబీస్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన ఈ భామ ప్రస్తుతం మ్యాత్ స్మిథ్‌తో డేటింగ్ చేస్తోంది. 'క్రూయెల్ ఇంటెన్షన్' సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ర్యాన్ అంటే తన యవ్వనప్రాయంలో విపరీతమైన ప్రేమ ఉండేదని లిల్లీ తెలిపింది. 'నా బెడ్రూమ్ నిండా ఆయన ఫొటోలే ఉండేవి. నేను ఆయనను ఎంతగా ప్రేమించానంటే అతని చిన్నచిన్న ఫొటోలన్నీ కలిపి ఓ పెద్ద పోస్టర్ చేసుకొని నా గదిలో అతికించుకున్నా' అని ఈ భామ 'ఫిమెల్ ఫస్ట్'తో తెలిపింది.
Post a Comment