-->
Showing posts with label MOVIE NEWS. Show all posts
Showing posts with label MOVIE NEWS. Show all posts

May 22, 2016

అభిషేక్‌, ఐశ్వర్యరాయ్‌ జంటకు ఫాలోయింగ్‌ ఎక్కువే. ఈ గ్లామర్‌ కపుల్‌ ఎక్కడ కనిపించినా కెమెరా ఫ్లాష్‌లు వెలుగుతూనే ఉంటాయి. అయితే ఆలుమగల మధ్య చిరాకులు, పరాకులు కామనే. ఈ గిల్లికజ్జాలు నాలుగు గోడల మధ్యసాగితే ఫర్వాలేదు. కాని, నలుగురిలో బయటపడితే మాత్రం గోరంతలు కొండతలుగా చెప్పుకుంటారు.
 
ఐశ్వర్య సెకండ్‌ 
ఇన్నింగ్స్‌కు గ్రాండ్‌ షోగా నిలిచిన సరబ్‌జిత ప్రీమియర్‌ షో సందర్భంగా ఐష్‌, అభిల మధ్య సాగిన ఓ సీను ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ప్రీమియర్‌ షోకు బచ్చన్‌ ఫ్యామిలీతో పాటు ఇండసీ్ట్ర పెద్దలంతా విచ్చేశారు. షో ముగిశాక.. సెలబ్రిటీలంతా వేదికపైకి చేరుకున్నారు. అభి, ఐష్‌ చెట్టాపట్టాలేసుకుని వేదికనెక్కారు. ఇద్దరినీ ఫొటోలకు పోజివ్వాల్సిందిగా ఫొటోగ్రాఫర్లు కోరడం.. ఐష్‌ సరేననడం.. మామూలుగానే జరిగిపోయాయి. అంతలోనే ఏమైందో కాని, అభిషేక్‌ నెర్వ్‌సగా ఫీలయ్యాడు. ఐష్‌ చేయిని నెమ్మదిగా వదిలించుకుని వెనుక నుంచి వేదిక పక్కకు వచ్చేసే ప్రయత్నం చేశాడు. ఫొటో దిగడానికి రావాల్సిందిగా భార్య పిలుస్తున్నా.. వినీ విననట్టు వ్యవహరించాడు. దీంతో ఐశ్వర్యనే భర్త దగ్గరగా వెళ్లి చేయి పట్టుకుని ఏదో చెబుతూ మళ్లీ సీన్‌లోకి తీసుకొచ్చింది. అయినా అయిష్టంగానే ఫొటోలకు పోజిచ్చాడు అభి. నాలుగు ఫ్లాష్‌లు పడ్డాయో లేదో.. ‘యూ క్యారియాన్‌..’ అంటూ ఐష్‌కు షాకిచ్చాడు. ఆయనగారి ప్రవర్తనతో ఆశ్చర్యపోవడం ఐశ్వర్య వంతైంది. అభి అలకపై బాలీవుడ్‌
మీడియాలో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. పదిమందిలో భార్యను చులకన చేశాడంటూ జూనియర్‌ బచ్చన్‌ను కార్నర్‌ చేస్తున్నాయి. ఈ ఇష్యూ సంగతి ఎలా ఉన్నా.. సదరు వీడియో మాత్రం యూట్యూబ్‌లో రికార్డు హిట్లు కొల్లగొడుతోంది. రెండు రోజుల్లోనే ఏకంగా పదిలక్షల పైచిలుకు హిట్లు సాధించింది.

click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

అభి‘షాక్‌’ ...!!!

బాపుగారి బొమ్మని తలపించే అందం ప్రణీత సొంతం. అలాంటి అమ్మాయి లంగా, ఓణి, పరికిణీలతో కనిపిస్తూ బావా.. బావా అంటూ సందడి చేస్తే వెండితెరకి వచ్చే కళే వేరు. అందుకే ప్రణీతని దర్శకులు మరదలు పాత్రల్లో చూపించడానికి ఇష్టపడుతుంటారు. ‘బావ’ సినిమానే తీసుకోండి. అందులో ప్రణీత మరదలు పిల్లే. ‘అత్తారింటికి దారేది’లోనూ అంతే. పవన్‌కల్యాణ్‌కి మరదలే అవుతుంది. శుక్రవారం వచ్చిన ‘బ్రహ్మోత్సవం’లోనూ మహేశ్ మరదలిగా నటించింది. ఆ పాత్రల్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ ప్రణీత సందడి చేస్తున్న విధానం కుర్రకారుకు భలే నచ్చుతోంది. ‘‘మరదలిగానే కావచ్చు గానీ ‘బ్రహ్మోత్సవం’లో నా పాత్ర కొత్త కోణంలో ఉంటుంది. ఇందులో భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆక ట్టుకొనే ప్రయత్నం చేశా’’ అంటున్న ప్రణీతతో ‘సాక్షి’ స్పెషల్ చాట్...
 
♦  నేను నటించిన మంచి చిత్రాల్లో ‘బ్రహ్మోత్సవం’ ఒకటి. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రతి హృదయాన్ని కదిలించే విధంగా ఉంటుంది. అందుకే ఈ కథ వినగానే నేను వెంటనే కనెక్ట్ అయిపోయా. పాత్రకి సంబంధించి కూడా ప్రతి అణువణువూ ఆస్వాదించా. ముఖ్యంగా నా పాత్ర తన మనసులోని భావోద్వేగాలను బయటపెట్టే విధానం స్వతహాగా నాకు భలే నచ్చింది. సినిమా పేరుకు తగ్గట్టుగానే సెట్లో ఉత్సవ వాతావరణం కనిపించేది. అందుకే షూటింగ్ జరుగుతున్నట్టు అనిపించేదే కాదు. మహేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక మంచి అనుభూతి. ఆయన సెట్స్‌లో ఎప్పుడూ సరదాగా కనిపిస్తుంటారు. ఆయనతో షూటింగ్ అంటే బోల్డెంత ఫన్. ముఖ్యంగా మహేశ్‌తో కలిసి నేను చేసిన సన్నివేశాలు నాకు నటిగా మరింత సంతృప్తినిచ్చాయి.

 ఆస్వాదిస్తున్నారు
 కుటుంబం చుట్టూ సాగే కథ ‘బ్రహ్మోత్సవం. స్వతహాగా నాకు కుటుంబంతో అనుబంధం ఎక్కువ. కాబట్టి ప్రతి  సన్నివేశంలోనూ నాకు నేను, నా కుటుంబం కనిపించేది. అందుకేనేమో ఏ దశలోనూ నేనేదో సినిమా చేస్తున్నట్టు, నటిస్తున్నట్టు అనిపించేది కాదు. ఇలాంటి నేపథ్యంతో కూడిన సినిమాల్లో నటించడమంటే చాలా ఇష్టం. భవిష్యత్తులోనూ కుటుంబ నేపథ్యంతో కూడిన సినిమాలు మరిన్ని చేస్తా. ‘బ్రహ్మోత్సవం’లో ప్రేక్షకుల్ని అలరించే అంశాలు భావోద్వేగాలే.

ఇలాంటి చిత్రాలు ఎప్పుడో కానీ రావు. అందుకే ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందులో ముగ్గురు కథానాయిక లున్నప్పటికీ మా అందరి పాత్రలకీ సమ ప్రాధాన్యం దక్కింది. ప్రతి పాత్ర కూడా కథని ఎంతో కొంత ప్రభావితం చేస్తుంటుంది. అందుకే ఇందులో కథానాయికలు ఎంత మంది  అనే విషయాన్ని పట్టించుకోలేదు. సమంత, కాజల్‌లతో కలిసి నటించడం చాలా ఆనందాన్నిచ్చింది.

 click the below image to best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

బ్రహ్మోత్సవం...ప్రతి హృదయాన్ని కదిలిస్తోంది

‘ఐ యామ్ ఇన్ లవ్’.  ‘చాలా సంవత్సరాల నుంచి తను పరిచయం’. ‘నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ తను’.‘తనది కూడా నాలా హెల్పింగ్ నేచర్’.‘వంట సూపర్బ్‌గా చేస్తాడు. నాన్‌వెజ్ కూడా’. ‘రిస్క్ లేదు. పెద్దలొప్పేసుకున్నారు’. ‘ఆ యంగ్ హీరో పేరడగొద్దు తర్వాత చెబుతాను’. అని సమంత ‘సాక్షి’కి చెప్పేసింది. ఆ లవర్ బోయ్ ఎవరో మీరు చెప్పగలరా? ‘24’ సినిమాలో కాలం వెనక్కి వెళుతుంది కదా.. మీకలాంటి అవకాశం వస్తే.. మీ లైఫ్‌లో దేన్ని చెరిపేయాలనుకుంటారు?
2012లో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. ఒక్కసారి వెనక్కి వెళ్లగలిగితే వాటిని ఎరేజ్ చేసేస్తాను.
ఏంటవి.. ప్రొఫెషనలా? పర్సనలా?
రెండు రకాలుగా తీసుకోకూడని డెసిషన్స్ తీసుకున్నాను.
మీలాంటి అందగత్తెలకు ప్రపోజల్స్ బాగానే వస్తాయి. లవ్‌లో పడేయడానికి చాలామంది ట్రై చేస్తుంటారు కూడా.. అప్పుడేమనిపిస్తుంది?
ఎవరైనా వచ్చి, నన్ను లవ్‌లో పడేయడానికి ట్రై చేస్తే ఆ విషయం కూడా మనసుకి ఎక్కించుకోనంత బోర్‌గా తయారైపోయాను. ఓల్డ్ అయిపోయాను. వర్క్‌లో ఇన్‌వాల్వ్ అయిపోయాను. నిజం చెప్పాలంటే ఈ మధ్య నా లైఫ్ నాకే బోరింగ్‌గా ఉంది. ఇప్పుడు పెళ్లి, పిల్లలు.. ఆ స్టేజ్‌కి వచ్చేశాను.
అయితే పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారన్న మాట.
అది ఇంకా తెలియదు. కానీ, పెళ్లి స్టేజ్ మాత్రం వచ్చేసింది.
ఓ యంగ్ హీరోతో లవ్‌లో ఉన్నారని టాక్.. నిజమేనా?
నిజమే. లవ్‌లో ఉన్నాను.
ఏదీ మళ్లీ చెప్పండి!
Yes, I am in love.
పెళ్లి, పిల్లలు.. ఈ లైఫ్ మీద మీ ఒపీనియన్?
కచ్చితంగా నాకు సెటిల్ అవ్వాలని ఉంది. మంచి ఫ్యామిలీ కావాలి. పిల్లలంటే ఇష్టం. హీరోయిన్‌గా చాలా సినిమాలు చేశాను. ఎంతోమంది అభిమానం పొందగలిగాను. ఆటోగ్రాఫులు, ఫొటోగ్రాఫులు అడుగుతుంటే, ‘మనమేం సాధించామని ఇలా అడుగుతున్నారు?’ అనిపిస్తుంది. అయినా నేనేం చేశానని? నా పని నేను చేశాను.. అంతకుమించి ఏమీ చేయలేదు. నన్నెందుకు అందరూ ఇష్టపడుతున్నారో తెలియదు.
సినిమాలు వదిలేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా?
నేను సినిమాలు మానను. నా వయసుకి తగ్గ సినిమాలు చేస్తాను. అలాగే, నా కుటుంబ మర్యాదను కూడా కాపాడే సినిమాలే చేస్తాను. అంటే... మ్యారీడ్ స్టేటస్‌కి తగ్గ సినిమాలు చేస్తాను.
ఇప్పుడు మీ లైఫ్‌లో ఉన్న అబ్బాయి మీరు సినిమాలు చేస్తే ఒప్పుకుంటారా?
కచ్చితంగా ఒప్పుకుంటారు. తనకేం అభ్యంతరం లేదు.
మీ లైఫ్‌లో ఉన్న ఆ రియల్ హీరో ఈ మధ్య పరిచయం అయ్యారా?
కాదు.. నాకు చాలా సంవత్సరాల నుంచి తను పరిచయం.
తనలో ఉన్న క్వాలిటీస్ గురించి?
నేను బాగా అల్లరి. ఏ ఎమోషన్ అయినా నాది ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుంది. ఆనందం వచ్చినా తట్టుకోలేను. టెన్షన్ వచ్చినా తట్టుకోలేను. ఆలోచించి మాట్లాడటం అస్సలు తెలియదు. నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ తను. ఆలోచించి మాట్లాడటం, స్టేబుల్‌గా నిర్ణయాలు తీసుకోవడం, పేషెన్స్ అన్నీ ఉన్నాయి. నాకు కావల్సింది కూడా అదే.
ఇన్నర్‌గా మీరు మంచి అమ్మాయి.. సేవా కార్యక్రమాలు చేస్తారు. మరి.. మీక్కాబోయే భర్త డబ్బులు తగలేస్తావని అనే టైపా?
అస్సలు కాదు. నాలాగే తనది కూడా చాలా హెల్పింగ్ నేచర్. సేవా కార్యక్రమాలు చేయమని ఎంకరేజ్ చేస్తాడు. అలాంటి అబ్బాయి కాకపోతే ఇష్టపడేదాన్ని కాదేమో.
మీ మనసు దోచుకున్న ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలని ఉంది?
ఎవరో అడగొద్దు, జస్ట్ కొన్ని నెలల్లో చెప్పేస్తా.
అంతకుముందు లవ్‌లో పడినప్పుడు ట్విట్టర్‌లో చెప్పారు.. ఈ లవ్‌ని ఎందుకు రహస్యంగా ఉంచేశారు?
ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే బయటికి చెప్పలేదు. ఒకసారి సాఫీగా జరగలేదు. నేను హర్ట్ అయ్యాను. అందుకే ఇప్పుడు ఒకేసారి పెళ్లి గురించి ఎనౌన్స్ చేయాలనుకుంటున్నాను.
సినిమాలకు చిన్న బ్రేక్ తీసుకుంటున్నారట.. ఏం చేస్తారు?
వంట నేర్చుకోవాలనుకుంటున్నా. తింటాను తప్ప వండటం చేతకాదు. నా చుట్టూ ఉన్న అందరికీ వంట వచ్చు.
మరి.. ఆయనకు వచ్చా?
ఓ.. నా బాయ్‌ఫ్రెండ్‌కు బాగా వచ్చు. తను చేసి పెడుతుంటే తినడానికి సిగ్గుగా ఉంటుంది. అందుకే ఛాలెంజ్‌గా తీసుకుని, వంట నేర్చుకుంటాను.
ఆయన నాన్‌వెజ్ కూడా కుక్ చేస్తారా?
చేస్తారు.. నాన్‌వెజ్ చాలా బాగుంటుంది.
దాదాపు ఓపెన్‌గానే మాట్లాడేస్తారు.. ఇలా అయితే ఇబ్బందే కదా?
అవును. నేను బయటకు ఏం మాట్లాడుతున్నానో లోపల కూడా అంతే. మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒకలా.. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉండలేను. ట్విట్టర్‌లో కూడా నాకనిపించింది పోస్ట్ చేసేస్తాను. దానివల్ల విమర్శల పాలయ్యాను. ఇలా ఓపెన్ బుక్‌లా ఉంటాను కాబట్టి, అసహ్యించుకునేవారినీ, అభిమానించే వారినీ సమానంగా పొందగలిగా. అయినా నో ప్రాబ్లమ్. నేను నాలానే ఉంటా.
రియల్ లైఫ్‌లో నటించరన్నమాట?
నైన్ టు సిక్స్ యాక్ట్ చేయగలుగుతాను. షూటింగ్‌కి పేకప్ చెప్పాక కూడా నటిస్తే, చివరికి నేనెవర్నో నేనే మర్చిపోతాను. నేనింతే... ఒప్పుకుంటే ఒప్పుకోండి.. లేకపోతే లేదనుకుంటాను.
ఫైనల్లీ ఓ ప్రశ్న.. మీ లవ్ మ్యారేజ్‌ని పెద్దలు అంగీకరించారా? లేకపోతే కొన్ని సినిమాల లవ్‌స్టోరీలా రిస్కులు చేయాలా?
నో రిస్క్. పెద్దవాళ్లు ఒప్పుకున్నారు.  సో.. లవ్ లైఫ్‌కి శుభం కార్డే అన్నమాట..  యస్ (నవ్వుతూ).
సమంతతో నటించిన పెళ్లి కాని తెలుగు యువ హీరోలు వీరే.  ఎనీ గెసెస్‌స్స్...!

 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

లవ్ రాజు ఎవరో..!

May 20, 2016

అమీర్‌పేట బిగ్‌బజార్‌లోని బిగ్‌సినిమాస్‌లో శుక్రవారం అభిమానులు ఆందోళన చేశారు. ఈ రోజు  విడుదలైన బ్రహ్మాత్సవం సినిమా సాయంత్రం షోలో అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. సినిమా మొదటిభాగం తర్వాత ఏసీలు పనిచేయకపోవడంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. ఎంతసేపటికీ ఏసీలు పనిచేయకపోవడంతో సినిమాను నిలుపుదల చేశారు. అభిమానుల నిరసన మేరకు వారి సినిమా టికెట్ ధరను బిగ్‌సినిమాస్ యాజమాన్యం వెనక్కి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌లలో సినిమా మధ్యలో సాంకేతిక లోపాలు రాకుండా తగు జాగ్రత్తలు, ప్రత్యామ్నయ చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరారు.

 click the below image to get a best deal::
https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

‘బ్రహ్మోత్సవం’ థియేటర్‌లో ఫ్యాన్స్ ఆందోళన

ఫ్యాన్స్‌లో బ్రహ్మోత్సవం మానియా తెల్లవారుజాము నుంచే మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రాల నుంచి మహేష్ అభిమానులు బ్రహ్మోత్సవం సంబరాలకు సంబంధించిన ఫొటోలు, పోస్టర్లను ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్‌లో బ్రహ్మోత్సవం ఫెస్టివల్ అనే హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అమెరికాలోని 87 సెంటర్లలో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8 గంటల సమయానికి కోటి రూపాయల వసూళ్లు దాటినట్లు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. మొత్తమ్మీద సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోందని అభిమానులు చెబుతున్నారు.
కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని మరికొందరు చెబుతున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్న టాక్ ముందునుంచే రావడంతో.. అదే అంచనాతో ఆడియన్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి కూడా మంచి టాక్ వినిపిస్తున్నట్లు మరో అభిమాని చెప్పారు. ఉదయం 8 గంటలకే కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శన మొదలుకావడంతో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ అంతా సందడిగా కనిపించింది. సుదర్శన్, సంధ్య థియేటర్ల వద్ద అభిమానుల హడావుడి ఎక్కువగా కనిపించింది.

 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

బ్రహ్మోత్సవం గురించి ఏమంటున్నారు?

May 19, 2016

జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ తో నందమూరి అందగాడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకొచ్చేశాడు. ఒకరోజు ముందుగానే తన అభిమానులకు పుట్టినరోజు ట్రీట్ ఇచ్చేశాడు. తన తాజా చిత్రం ఫస్ట్ లుక్ ను 'జనతా గ్యారేజ్' ఫస్ట్ లుక్ అంటూ ఎన్టీఆర్ గురువారం తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ నెల 20న (శుక్రవారం) ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు జనతా గ్యారేజ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. గడ్డంతో బైక్ పై మాస్ లుక్ తో కనిపించిన ఎన్టీఆర్ పోస్టర్ అదుర్స్ అనిపించేలా ఉంది. మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరో పోస్టర్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
నాన్నకు ప్రేమతో చిత్రం సక్సెస్ తో మంచి జోరులో ఉన్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో మరో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.   అంతేకాదు ఈ నెల 28న సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జనతా గ్యారేజ్ ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ముగించి ఆగస్టులో సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు యూనిట్.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదలను భారీగా ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ గత చిత్రాలు ఓవర్సీస్ లో మంచి వసూళ్లు సాధించటంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి జనతా గ్యారేజ్ ఆడియోలో అమెరికాలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్...?

నటి అనుష్కకు అదే ఆఖరి చిత్రమా? ఇప్పుడు మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంచలన అంశం ఇదే. తమిళం, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటి అనుష్క. చారిత్రక కథా చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకున్న ఈ యోగా సుందరి ప్రస్తుతం తమిళంలో సింగం-3, ద్విభాషా చిత్రం బాహుబలి-2 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు అజిత్ నూతన చిత్రానికి, లారెన్స్‌కు జంటగా చంద్రముఖి-2 చిత్రానికి అనుష్క కాల్‌షీట్స్ అడుగుతున్నట్లు సమాచారం.

 బాగమతి అనే మరో భారీ చారిత్రక కథా చిత్రంలోనూ అనుష్క నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇక సుప్రీం స్టార్ చిరంజీవి 150వ చిత్రంలోనూ హీరోయిన్‌గా ఈ బొమ్మాళి పేరు వినిపిస్తోంది.అసలు విషయం ఏమిటంటే 34 ఏళ్ల వయసు మీద పడ్డ ఈ ప్రౌడకు ఆమె కుటంబసభ్యులు పెళ్లి చేయాలని రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారట. అనుష్క వరుసగా చిత్రాలు ఒప్పుకుంటూ పెళ్లికి పచ్చజెండా ఊపడం లేదని ఆమె సన్నిహిత వర్గాల మాట.

  ఇటీవల మళ్లీ అనుష్క కుటుంబసభ్యులను నుంచి పెళ్లి ఒత్తిడి పెరిగిందని సమాచారం. అయితే ఈ సారి అనుష్క పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల తను కుటుంబసభ్యులతో కలిసి ఇంటిలో విశేష పూజలు కూడా నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చిరంజీవితో నటించే చిత్రమే అనుష్క చివరి చిత్రం అనే టాక్ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఇందులో నిజానిజాలు అనుష్కగానీ ఆమె కుటుంబసభ్యులు గానీ నోరు విప్పితేనే తెలుస్తుంది.
  click hte below image to bet a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

అనుష్కకు అదే చివరి చిత్రమా?

‘‘నీహా నువ్వు ఏ పని చేపట్టినా,ఆనందం లభిస్తుందని ఆశిస్తున్నా’’ అని నీహారికకు ముందుగా శుభాకాంక్షలు చెప్పారు అల్లు అర్జున్. పనిలో పనిగా ఇటీవల వచ్చిన వివాదం గురించి తన వివరణ కూడా ఇచ్చారు. ఆ మధ్య విజయవాడలో ‘సరైనోడు’ థ్యాంక్స్ మీట్‌లో ఫ్యాన్స్ ‘పవర్ స్టార్.. పవర్ స్టార్’ అని అరవడం, ‘నేను చెప్పను బ్రదర్’ అని బన్నీ అనడం తెలిసిందే. ఈ మధ్య ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, ఈ విషయం గురించి ప్రస్తావిస్తే, ‘ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం’ అన్నారు బన్నీ.

  పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన బన్నీ ఈ విషయం గురించి ఆడియో వేడుకలో వివరణ ఇస్తూ, ‘‘మీరు ప్రతీసారి పవర్‌స్టార్ అని అరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోవడానికి కారణం పవర్‌స్టార్ కాదు. మీరే. కొంత మంది అభిమానులు పబ్లిక్ ఫంక్షన్ పెట్టినప్పుడు పవర్‌స్టార్ అని అరుస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు’’ అని బన్నీ అన్నారు. ‘‘ఇలాంటి ఫంక్షన్‌కు వచ్చినప్పుడు సినిమాకు సంబంధించినవాళ్ళు పర్సనల్‌గా ఏదో చెప్పుకోవాలనుకుంటారు.

  కానీ మీరు ‘పవర్‌స్టార్’, ‘పవర్‌స్టార్’ అని అరిచి వాళ్లను డిస్టర్బ్ చేయడంతో వాళ్లు యాంత్రికంగా మాట్లాడి వెళ్ళిపోతారు. అంతవరకూ ఎందుకు? ఓ పెద్ద డెరైక్టర్ సినిమా తీసి మాట్లాడుతుంటే, అక్కడ పవన్‌కల్యాణ్ అని అరిచారు. అయినా వేరే హీరో ఫంక్షన్స్‌లో మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఎందుకని నా ఫీలింగ్. ఇదే విషయాన్ని నాకు బాగా తెలిసిన వ్యక్తి ‘మా వాళ్ల ఫంక్షన్‌లో మీ వాళ్ల గోలేంటి’ అని అడిగారు.

  చాలా బాధ అనిపించింది. మన పాటల వేడుకల్లో అల్లరి చేయండి.. తప్పు లేదు. కానీ, వేరే హీరోల వేడుకల్లో కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు. తానింత స్థాయికి రావడానికి కారణం చిరంజీవిగారే అని పవన్‌కల్యాణ్‌గారే చాలాసార్లు చెప్పారు. కానీ, చిరంజీవిగారు మాట్లాడుతున్నప్పుడు ‘పవర్‌స్టార్’ అని అరిస్తే ఆయనకెంత ఇబ్బందిగా ఉంటుందో? అప్పటినుంచి నేను పవన్‌కల్యాణ్‌గారి గురించి మీరెంత అడిగినా మాట్లాడకూడదని డిసైడయ్యాను.

 మీరు నా వల్ల బాధపడుంటారని తెలుసు. కానీ, మీ వల్ల  మా ఫ్యామిలీ చాలాసార్లు హర్ట్ అయింది. నేను ఒక వివాదాన్ని తప్పించుకోవడానికి మీడియా ముందు మాట్లాడ లేదు. కానీ అదే పెద్ద వివాదమైంది. నాకు పవన్‌కల్యాణ్ అంటే ఇష్టమే. చిరంజీవిగారి తర్వాత నన్ను ప్రోత్సహించింది ఆయనే.  చాలా రోజులుగా సోషల్ మీడియాలో గ్రూపులుగా విడిపోయి మాటల యుద్ధంలోకి దిగారు. ప్లీజ్.. దీన్ని ఆపండి. మీరందరూ సోషల్ మీడియాలో గ్రూప్‌లు కావచ్చు. కానీ మేమందరం ఓ ఫ్యామిలీ. దయచేసి ఇక నుంచి ఇలాంటివి చేయద్దు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు బన్నీ.
 click the below image to bet a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

మా వాళ్ల ఫంక్షన్‌లో మీ వాళ్ల గోలేంటి..?బన్నీ

May 18, 2016

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలను హీరోయిన్ ల కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. నాగ్ లాంటి స్టార్లు ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటుంటే కమర్షియల్ సినిమాలు చేస్తున్న హీరోలు మాత్రం తమ వయసుకు తగ్గ జోడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నయనతార, అనుష్క లాంటి ఒకరిద్దరు మాత్రం సీనియర్ హీరోలకు సూట్ అవుతుండటంతో వారి మధ్య తీవ్రమైన పోటి నెలకొంది. అనుష్క బాహుబలి సినిమాలతో బిజీగా ఉండటంతో ఇన్నాళ్లు సీనియర్ హీరోల సినిమాలు నయనతార చేతికి వెళుతున్నట్టుగా కనిపించాయి.
బాహుబలి షూటింగ్ చివరి దశకు రావటంతో సౌత్ ఇండస్ట్రీలో సీన్ మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాలో ముందు నుంచి నయనతార హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని అనుష్క పేరును పరిశీలిస్తున్నారట. బాబు బంగారం షూటింగ్ విషయంలో నయన్ సరిగ్గా డేట్స్ ఇవ్వక పోవటం కూడా ఈ మార్పుకు కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బాహుబలితో పాటు సింగం 3, తలా 57 సినిమాల్లో నటిస్తున్న అనుష్క, చిరు సినిమాకు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూడాలి.
 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

అనుష్కకు వెల్‌కమ్.. నయనకు నో..!

'ఓ మై గాడ్‌' నటుడు, బీజేపీ ఎంపీ పరేశ్ రావల్‌ నుంచి ఆయన అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. బాలీవుడ్ విలక్షణ నటుడైన రావల్ సోమవారం రాత్రి ముంబై విమానాశ్రయానికి వచ్చారు. ఆయన ఫోన్‌లో మాట్లాడుతుండగా ఓ అభిమాని చేరువగా వచ్చి రావల్‌ తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఇందుకు రావల్‌ సమ్మతి తీసుకోలేదు. తన అనుమతి లేకుండానే తనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడంతో అతన్ని రావల్‌ బలంగా అవతలికి తోసేసి వెళ్లిపోయారు. దీంతో ఆ అభిమానికి దిమ్మదిరిగిపోయింది.
ఈ ఘటన గురించి ప్రత్యక్ష సాక్షి ఒకరు వివరిస్తూ.. 'ఎయిర్‌పోర్టు బయటకు వచ్చిన తర్వాత చాలాసేపు పరేశ్‌ ఒక్కరే నిలబడి ఉన్నారు. ఆయన సీరియస్‌గా కనిపించాడు. తన డ్రైవర్‌ కోసం వెతుకుతున్నట్టు కనిపించింది. తరచూ ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారు. ఇంతలో ఓ వ్యక్తి ఆయన చేరువగా వచ్చి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో చికాకు పడ్డ ఆయన ఆ వ్యక్తిని తోసేసి వెళ్లిపోయారు' అని చెప్పాడు.

నిజానికి ఎయిర్‌పోర్ట్‌ వంటి బహిరంగ ప్రదేశాల్లో తమ అభిమాన సినీ జనాలు కనిపించినప్పుడు వారితో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడటం కొత్త కాదు. కొంతమంది సినీ నటులు తమ అభిమానులతో సెల్ఫీలు దిగి సంతోషపరుస్తుండగా.. మరికొందరు చికాకు పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన అభిమానిని ఆయన బాడీగార్డ్‌ ఒక గుద్దు గుద్దిన సంగతి తెలిసిందే.

 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

ఓ మై గాడ్‌! సెల్ఫీ అడిగిన ఫ్యాన్ని తోసేశాడు!

టాలీవుడ్ యంగ్ జనరేషన్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మంచి ఫాంలో ఉన్న నటుడు నాని. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త తడబడినా ప్రస్తుతం ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, తన అభిమానులతో పాటు భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య అభిమానులను కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో తన చేతి మీద జై బాలయ్య అనే టాటూతో కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు.
కృష్ణగాడి వీర ప్రేమగాథ విషయంలో జై బాలయ్య ప్లాన్ బాగా వర్కవుట్ కావటంతో మరోసారి బాలయ్య అభిమానులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు నాని. అందుకే తన నెక్ట్స్ సినిమా జెంటిల్ మేన్ ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న రిలీజ్ చేస్తున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. రెండోసారి బాలయ్య ఫ్యాన్స్ ను టార్గెట్ చేసిన నాని ఈసారి కూడా మెప్పిస్తాడేమో చూడాలి.

 click the below image to get a best deal::

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

మరోసారి బాలయ్య జపం చేస్తున్నాడు

వర్ధమాన సినీ నటుడు తనీష్ తండ్రి వర్ధన్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం వేకువజామున కన్నుమూశారు. మణికొండలోని వెస్ట్రన్ ప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వర్ధన్ 6వ అంతస్తు నుంచి మంగళవారం అర్థరాత్రి ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నేటి వేకువజామున ఆయన మృతిచెందారు. ప్రమాదవశాత్తూ వర్ధన్ మృతిచెందడంతో తనీష్, ఆయన కుటుంబసభ్యులు తీవ్ర దుఖంలో ఉన్నారు. దేవుళ్లు, మన్మధుడు సినిమాలలో బాలనటుడిగా నటించిన తనీష్ నచ్చావులే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచమమైన విషయం తెలిసిందే. వర్ధన్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రమాదవశాత్తూ జారి పడలేదని ఆత్మహత్యాయత్నం చేశారని భిన్న కథనాలు వినిసిస్తున్నాయి.
 click the below image to get a deal::
https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

టాలీవుడ్ హీరో తండ్రి కన్నుమూత

May 16, 2016

బాలీవుడ్‌లోనే అత్యంత ముదురు బాహ్మచారి సల్మాన్‌ ఖాన్‌. ఆయన పెళ్లి గురించి నిత్యం కథనాలు రావడం పరిపాటే. అదిగో సల్మాన్ పెళ్లి, ఇదిగో సల్మాన్ పెళ్లి అంటూ ఎన్ని కథనాలు వచ్చినా ఈ కండలవీరుడు మాత్రం తన వివాహం గురించి ఏమీ క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ, ఇటీవల మాత్రం 'బజరంగీ భాయ్‌జాన్‌' పెళ్లి ఖాయమని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకొని.. తన బ్యాచిలర్‌ జీవితానికి సల్మాన్‌ గుడ్‌ బై చెప్తాడని ఆ వర్గాలు అంటున్నాయి.
సల్మాన్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొన్నందుకు అతని అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉందని ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ కథనాలకు బలం చేకూరుస్తూ.. సల్మాన్‌-లులియా వంటుర్‌ ఇటీవల కలిసి మీడియాకు పోజులిచ్చారు. ప్రీతిజింటా పెళ్లివిందులో ఈ జంట కలిసి వచ్చి హల్‌చల్ చేసింది. దీంతో ఈ ఇద్దరి పెళ్లి ఖాయమని ఘంటాపథంగా చెప్పేశారు బాలీవుడ్‌ గాసిప్‌ రాయుళ్లు.

ఈ నేపథ్యంలో చాలాకాలంగా సల్మాన్‌తో డేటింగ్ చేస్తున్న లులియా వంటూర్‌ గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోడల్ అయిన లులియా గతంలో రొమేనియన్‌ సూపర్ స్టార్‌ మారిసయ్ మోగాను పెళ్లాడింది. నాలుగేళ్ల తర్వాత వీళ్ల పెళ్లి పెటాకులైంది. ఈ దంపతులు విడిపోవడానికి కారణాలు ఏమిటన్నది మాత్రం తెలియదని ఓ బాలీవుడ్ న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది. ఈ కథనంపై సల్మాన్ గానీ, లులియాగానీ స్పందించలేదు. కానీ ఈ ఏడాది చివర్లో మాత్రం వీరిద్దరి పెళ్లి ఖాయమని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.  

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

ఆయన ప్రియురాలికి ఇప్పటికే పెళ్లయిందా!

మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీ కత్తిలాంటోడు  హీరోయిన్ కోసం జరుగుతున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది.   సినిమా ఇంకా ప్రారంభంకాకుండానే భారీ  పబ్లిసిటీకి నోచుకున్న ఈ కత్తిలాంటోడు జోడీ కోసం కూడా అంతే బ్రహ్మాండంగా  ఊహాగానాలు సాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో  టాలీవుడ్ టాప్ హీరోయిన్,  స్టాలిన్ భామ అనుష్కశెట్టి దాదాపు  ఖరారైనట్టు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన  విశేషాలను  చిత్ర  యూనిట్ సిబ్బంది ఒకరు  మీడియాకు చెప్పారు.  ఇంకా అధికారికంగా సైన్ చెయ్యనప్పటికీ,  టాలీవుడ్ అరుంధతిని ఎంపిక చేసినట్టు తెలిపారు.  చిరంజీవి150 సినిమాకు జోడీగా  హీరోయిన్ అనుష్కను సంప్రదించామని, దీనికి ఆమె నోటిమాట  ద్వారా   ఓకే చెప్పినట్టు చెప్పారు. ఇప్పటికే  రెండు తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్న బొమ్మాళి , డేట్స్ ఎడ్జస్ట్ మెంటు కోసం  ప్రయతిస్తున్నట్టు వార్తాసంస్థకు చెప్పారు.

కాగా అనుష్క  2006లో చిరంజీవి "స్టాలిన్" లో  మెరుపులు మెరిపించింది. చిరంజీవి  ద్విపాత్రాభినయం చేస్తున్నఈ కత్తిలాంటోడు  సినిమాకు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్  తొలిసారి నిర్మాతగా అవతరించడం మరో విశేషం.  వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రతిష్టాత్మక  ప్రాజెక్ట్  ప్రీ ప్రొడక్షన్ పని ఇప్పటికే మొదలుగాకా,  రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభంకానుంది. తమిళంలో  సూపర్ హిట్ మూవీ 'కత్తి' ని  మెగాస్టార్ 150  సినిమాగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
  click the below image to fallow updates::
facebook fan page

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

కత్తిలాంటోడు సరసన బొమ్మాళి

హీరోయిన్లంటే నేల మీద కాలుపెట్టి ఎరగరు. పట్టు పరుపుల మీద తప్ప శయనించరు. మెట్లు దిగితే కారు ఎక్కాల్సిందే. కానీ, అలాంటి పొజిషన్‌లో ఉండి.. నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఓ బాలీవుడ్ హీరోయన్‌కు ఎదురైంది. తెలుగు గడ్డపై పుట్టి.. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలుగుతున్న అదితి రావు నోయిడాలో నిర్వహిస్తున్న ఫ్యాషన్‌ షోకు నడిచి వెళ్లాల్సి వచ్చింది. రాంగ్ రూట్‌లో వస్తున్నందుకు ఆమె కారును పోలీసులు సీజ్ చేయడంతో ఇలా జరిగింది. నోయిడాలో అత్యంత ఖరీదైన సెక్టార్ 18లో కొత్తగా తెరిచిన మాల్‌లో నిర్వహించే ఫ్యాషన్ షోకు ఆమె వెళ్లాల్సి ఉంది. అదే సెక్టార్‌లోని ఓ ఫైవ్‌ స్టార్ హోటల్లో ఆమె ఉంది. అక్కడి నుంచి తన జాగ్వార్ కారులో ఆమె బయల్దేరగా, ఆమె సహాయకులు వెర్నా కారులో ఆమె వెంటే వెళ్లారు. అయితే.. త్వరగా వెళ్లాలన్న తొందరలో ఆమె డ్రైవర్ షార్ట్‌కట్ రూట్ తీసుకుని, రాంగ్ రూటులో నడపసాగాడు. అంతలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ధర్మేంద్ర యాదవ్ వీరి కారును ఆపారు.
Visit::page::https://www.facebook.com/freshdeals365
  ఆపేసరికి అందులో ఎవరున్నారో తనకు తెలియదని, అయినా అలా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆపానని ఆయన చెప్పారు. కాసేపటికే వెనకాల వెర్నాలో వచ్చిన సహచరులు.. అది బాలీవుడ్ సెలబ్రిటీ కారని, అందువల్ల వదిలేయాలని కోరారు. కానీ, పేపర్ వర్క్ పూర్తి కాకుండా కారును పంపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈలోపు వెనకాల వచ్చినవాళ్లు నానా హడావుడి చేసి, మాల్ యాజమాన్యానికి ఫోన్లు చేశారు. అటు నుంచి వెంటనే కారును పంపాలంటూ ఇన్‌స్పెక్టర్‌పై ఒత్తిడి వచ్చింది. అయినా ఇన్‌స్పెక్టర్ మాత్రం కామ్‌గా తన పనిచేసుకుంటున్నారు. ఈలోపు అదితి రావు కిందకు దిగి, నడుచుకుంటూ మాల్‌కు వెళ్లిపోయిందట!

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more  Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

హీరోయిన్‌కు చేదు అనుభవం...?

May 14, 2016

తనకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంటే చాలా ఇష్టమని, ఏ మాత్రం ఖాళీ దొరికినా ఫొటోలు తీస్తుంటానని ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. రాయదుర్గం లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఫోటో ఎక్స్‌పో-2016ను ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా తన మనోగతాన్ని విలేకరులతో పంచుకున్నారు.  నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చే కెమెరాలను కొన్నేళ్ళుగా కొనుగోలు చేస్తూ భద్రపర్చుకుంటున్నానన్నారు. తాను తీసిన ఫొటోలన్నింటినీ ఒక చోట పెట్టడానికి ప్రత్యేకంగా ఒక ప్రదర్శన కన్నా వెబ్‌సైట్ లాంచ్ చేసి అందులో పెట్టాలని ఉందని, త్వరలో ఈ విషయమై సీరియస్‌గా ఆలోచిస్తున్నానన్నారు.
Visit::page::https://www.facebook.com/freshdeals365
  ఎక్కడికి వెళ్ళినా రోడ్లు, ఖాళీ స్థలాలు, పార్కులు, అందమైన ప్రాంతాలు, మోడల్స్, డ్యాన్సర్స్ ఫొటోలను హబీగా తీస్తుంటానన్నారు. తన తండ్రి సత్యమూర్తి మంచి ఫొటోగ్రాఫర్ అని, తరువాత తయన రైటర్‌గా మారారన్నారు. తనకు కారం అంటే పడదని, అందుకే మా అమ్మ నా ఒక్కడి కోసం వేరుగా వంటచేసేదన్నారు. ఫొటోగ్రఫీలో కొత్త కొత్త అంశాల గురించి ఏవైనా సందేహాలు ఉంటే అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా విల్లార్ట్ ఎం.డీ వెంకటరమణకు ఫోన్ చేసి విసిగించి సందేహాలను తీర్చుకుంటానని దేవిశ్రీప్రసాద్ తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో పిల్లలు మ్యూజికల్ ఇన్‌స్ట్రమెంట్స్ వాయిస్తుంటే ఫొటోలు తీయాలనే కోరిక ఉందని, కొన్ని చోట్ల తీశానన్నారు.  మనదేశంలోని పిల్లలు డప్పు కొట్టే ఫొటోలను తీసి నా స్టూడియోలో ఒక గోడను ఖాళీగా ఉంచానని, దానిపై ఈ ఫొటోలన్నింటినీ ఒకేచోట అమర్చాలని చాలా రోజులుగా ఈ కోరిక ఉందని, దీనిపై దృష్టి పెట్టానన్నారు. సంగీతానికి ఫొటోగ్రఫికి చాలా అవినాభావ సంబంధం ఉందని దేవిశ్రీప్రసాద్ తెలిపారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more  Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

నేను తీసిన ఫొటోలతో త్వరలో వెబ్‌సైట్

బెంగళూరు(బనశంకరి): ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో  కన్నడ నటి మైత్రేయిగౌడకు రెండేళ్లు, ఆమె స్నేహితులు ముగ్గురికి ఏడాది జైలు   శిక్ష విధిస్తూ  నగర మెజిస్ట్రేట్ కోర్టు  శుక్రవారం తీర్పువెల్లడించింది. ఆ వెంటనే బెంగళూరు ఐదో ఏసీఎంఎం కోర్టు ఈ నలుగురికీ బెయిల్ మంజూరైంది. 2011లో నటి మైత్రేయిగౌడ   స్నేహితురాళ్లు సుప్రియ, రూపా, రేఖతో కలిసి నగరంలో ఓ వైపు కారు డ్రైవింగ్ చేస్తూ మరో వైపు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోంది. బసవేశ్వర ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్  శివకుమార్ కారును అడ్డుకోగా మైత్రేయిగౌడ ఆమె స్నేహితులు దాడికి పాల్పడ్డారు.
Visit::page::https://www.facebook.com/freshdeals365
  ఘటనపై బసవేశ్వరనగర ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు శుక్రవారం బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు రాగా వీరి నలుగురి నేరం రుజువు కాడంతో జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.  అయితే ఆ వెంటనే నగర 5 వ ఏసీఎంఎం కోర్డు నలుగురికి బెయిల్ మంజూరు చేసింది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more  Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

కన్నడ నటి మైత్రేయిగౌడకు జైలు

May 13, 2016

నకిలీ, డా. సలీమ్ చిత్రాలతో తెలుగునాట కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'బిచ్చగాడు'. అప్పట్లో వెంకటేశ్ తో 'శీను' సినిమా చేసిన శశి ఈ సినిమాకి దర్శకుడు. 'పిచైక్కారన్' పేరుతో తమిళనాట విజయం సాధించిన ఈ సినిమా నేడు తెలుగు తెరమీదికి వచ్చింది. ఈ 'బిచ్చగాడు' తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో చూద్దాం.
 
కథ: అరుల్ (విజయ్ ఆంటోని) వందల కోట్లకు ఒక్కగానొక్క వారసుడు. చిన్నప్పుడే భర్తని పోగొట్టుకున్న అరుల్ తల్లి (దీప రామానుజం) అన్నీ తానె అయ్యి అరుల్ ని పెంచి పెద్ద చేస్తుంది. దాంతోపాటు కుటీర పరిశ్రమగా వున్న వ్యాపారాన్ని కోట్ల టర్నోవర్ కి మార్చి వృద్ధిలోకి తీసుకొస్తుంది. విదేశాల్లో చదువు పూర్తి చేసొచ్చిన తన కొడుక్కి వ్యాపార బాధ్యతలు అప్పగించే క్రమంలో ప్రమాదవశాత్తూ గాయపడి కోమాలోకి వెళిపోతుంది. ఎంతమంది వైధ్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోతుంది. ఆ క్రమంలోనే ఓ స్వామీజీ అరుల్ కి ఎదురుపడి 48 రోజుల పాటు ఓ వ్రతం చేస్తే మీ అమ్మ ఆరోగ్యం కుదుటపడుతుందని చెబుతాడు. ఆ వ్రతమేమిటి..? దాన్ని అరుల్ ఆచరించాడా లేదా.. చివరికి ఏమైంది తెలియాలంటే బిచ్చగాడికి ఖాతాలో టికెట్ కి సరిపడా సొమ్ము జమ చేయాల్సిందే.
నటీనటులు: నేటితరం యువకుడిగా, తల్లి కోసం ఆరాటపడే కొడుకుగా అన్ని భావోద్వేగాలు పండించి విజయ్ ఆంటోని తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ గా నటించిన సత్న టైటస్ కి ఇదే తొలి సినిమా అంటే నమ్మడం కష్టమే. అంతలా తన నటనతో మాయ చేసింది. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేసినా ప్రధాన కథ అంతా హీరో పాత్ర చుట్టురా తిరగడంతో థియేటర్ బయటకి వచ్చేసరికి ఆ పాత్రలేవీ గుర్తుండవు.
 
సాంకేతిక: ఇలాంటి ఓ ఎమోషనల్ కథకి సంగీతం ఎంతో ముఖ్యం. ఆ విషయంలోనూ విజయ్ ఆంటోనీకి మంచి మార్కులే పడతాయి. ఆయన అందించిన బాణీలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ గా నిలిచాయి. ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. భాషా శ్రీ రాసిన మాటలు నవ్వులు పూయిస్తూనే కంటతడి పెట్టిస్తే, పాటలు రచన పరంగా బాగున్నప్పటికీ పలకడంలో విరుపుల మూలంగా అంత రుచించవు. నిర్మాతగాను విజయ్ అంటోనీ ఖర్చుకు వెనకాడలేదు.
 
దర్శకత్వం - విశ్లేషణ : ఎమోషన్ కి లాజిక్ తో పనిలేదు. ఈ సినిమా చూసేముందు జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన విషయమిది. ఎందుకంటే ఒక నలభై ఎనిమిది రోజులు పరపతిని, సంపదని వదిలి ఖాళీ చేతులతో రోజు ప్రారభించి ఓ బిచ్చగాడిగా వుంటే తల్లి ఆరోగ్యం నయమవుతుందన్నది ఈ సినిమా అసలు కథ. ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడు శశి బిలియనీర్ ని బిచ్చగాడిగా మార్చిన క్రమం ఆకట్టుకుంటుంది. దీనికి తోడు హీరో పెదనాన్న హీరో ఆస్తిని కాజేలాయని చూడటం, ఓ ఆశ్రమం ముసుగులో మందుల మాఫియా లాంటి ఉపకథలు ఈ సినిమాలో వున్నాయి. అవి కథలో ఇరికించినట్టు అనిపించకపోవడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. పైపెచ్చు హీరో పెదనాన్న పాత్ర సీరియస్ గా సాగినప్పటికీ ఆ పాత్ర ద్వారా పండిన కామెడి ప్రేక్షకులకు బోనస్. "నీ ప్రాణాన్ని కొన్నాళ్ళు నాకు బిచ్చంగా వేసే అమ్మ" అన్న మాటతో టైటిల్ జస్టిఫికేషన్ చేశారు. ఈ మాటతో తల్లి మామూలు స్పృహ లోకి రావడం సినిమా ముగింపు. ఈ ఎమోషన్ కి కనెక్ట్ అయితే బిచ్చగాడు అందరికీ నచ్చుతాడు.
 
ఈ బిలియనీర్ 'బిచ్చగాడి'కి టికెట్ రూపేణా ఓ వంద రూపాయలు దానం చేయొచ్చు
 
రేటింగ్ : 2.75/5

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more  Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

బిచ్చగాడు - ది బిలియనీర్...?

తనపై వచ్చిన రూమర్లకు బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఆరోగ్య కారణాలతోనే విదేశాలకు వెళ్లినట్టు ఆమె వెల్లడించింది. ప్రియుడు ఉదయ్ చోప్రా పెళ్లికి నిరాకరించడంతో అలిగి విదేశాలకు వెళ్లిపోయినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె మేనేజర్ తెలిపాడు. ఏడాది కాలంగా తీరిక లేకుండా సినిమాలు చేయడంతో విశ్రాంతి తీసుకోవాలని ఆమె భావించినట్టు చెప్పారు. వరుసగా మూడు సినిమాల్లో నటించిందని తెలిపారు.
Visit::page::https://www.facebook.com/freshdeals365 
 ఆమెకు ఆరోగ్యం కూడా సరిగా లేదని, గాయాలతోనే 'అజర్' ప్రమోషన్ లో పాల్గొంటున్నారని వెల్లడించారు. దీంతో 'హౌస్ ఫుల్ 3' సినిమా నిర్మాత సాజిద్ నదియావాలా అనుమతి తీసుకుని నూయార్క్ కు వెళ్లిపోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగానే ఆమె 'హౌస్ ఫుల్ 3' ప్రమోషన్ కు దూరమైందన్నారు. నెల రోజులు పాటు నర్గీస్ ఫక్రీ విశ్రాంతి తీసుకుంటుందని చెప్పారు.

బాలీవుడ్ నుంచి ఆమె ఆకస్మికంగా మాయమవడంతో రూమర్లు వచ్చాయి. 'అజర్' సినిమాలో అజహరుద్దీన్ రెండో భార్య సంగీత బిజలానీ పాత్రలో నర్గీస్ ఫక్రీ నటించింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

అవన్నీ రూమర్లు: హీరోయిన్ ...!!!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతోంది. విడుదలైన 22 గంటల్లోనే కబాలి టీజర్ 50 లక్షలకు పైగా హిట్లు సంపాదించి రికార్డు సృష్టించగా.. తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. ఈ టీజర్ ను ఇప్పటి వరకు కోటి 71 లక్షల మంది వీక్షించారు. తద్వారా అత్యధిక హిట్లు వచ్చిన ఇండియన్ ఫిల్మ్ టీజర్ గా రికార్డు సాధించింది. రజనీ దెబ్బకు అమీర్ ఖాన్ దూమ్ 3, సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాల టీజర్ల రికార్డులు బ్రేక్ అయ్యాయి. మే 1న విడుదలైన కబాలి టీజర్ సంచనాలు సృష్టిస్తోంది. 
Visit::page::https://www.facebook.com/freshdeals365 
 65 ఏళ్ల లేటు వయసులో రజనీ డాన్‌ పాత్రలో నటించిన కబాలి సినిమా టీజర్ అభిమానులకు పండుగ చేస్తోంది. 'పాత తెలుగు చిత్రాల్లో ముఖం మీద గాటు పెట్టుకుని, లుంగీ కట్టుకుని.. కబాలి అనగానే రెండు చేతులు కట్టుకుని చెప్పండి బాబూ అని వంగి నమస్కారం చేస్తాడనుకున్నావా? ఈ కబాలి వేరు...' అని కబాలి పాత్రలో రజనీకాంత్ ప్రత్యర్థికి కౌంటర్ ఇచ్చే ఈ టీజర్ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను ఓ ఊపు ఊపేసింది. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ భార్యగా రాధికా ఆప్టే నటిస్తుండగా.. ఇతర పాత్రలలో కలైరసన్, దినేష్, రిత్విక తదితరులు నటించారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

మరో రికార్డు బ్రేక్ చేసిన కబాల...!!

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

All In One Store © 2015 - Designed by K. Mahesh Babu