సందేహం
నా వయసు 20. ఐదు నెలల క్రితం పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయని స్కాన్ చేయించుకుంటే ఓవరీస్‌లో సిస్ట్ ఉందని తేలింది. రెండు నెలలు ట్యాబ్లెట్స్ వేసుకుంటే సెట్ అయింది. నేను నెలక్రితం మా బావతో అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్‌లో పాల్గొన్నాను. ఒకే నెలలో నాలుగుసార్లు కలిశాం. కానీ మూడుసార్లు మాత్రం పిల్ వేసుకున్నాను. చివరి పిల్ వేసుకున్న వారం తర్వాత లైట్‌గా బ్లీడింగ్ కనిపించింది. కానీ ఇంతవరకు పీరియడ్స్ రాలేదు. నాకు భయంగా ఉంది, సలహా ఇవ్వండి?
- ఓ సోదరి, పేరు రాయలేదు
ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అనేది ఎప్పుడో ఒకసారి సంరక్షణ లేకుండా కలిస్తే గర్భం రాకుండా ఉండటానికి వాడేది. అంతేకానీ నెలలో మూడుసార్లు కలిస్తే ప్రతిసారీ వాడటానికి కాదు. అయినా ఈ పిల్ కేవలం 70-80 శాతం మాత్రమే గర్భం రాకుండా అడ్డుకుంటుంది, 100 శాతం కాదు. ఇంకా పీరియడ్ రాలేదు కాబట్టి, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ ఉందేమో నిర్ధారించుకోండి. ఒకవేళ అది ప్రెగ్నెన్సీ అయితే వెంటనే మీ బావతో, ఇంట్లో పెద్దవాళ్లతో చర్చించుకొని పెళ్లి చేసుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీ కాకపోతే స్కానింగ్ చేయించుకొని మళ్లీ ఓవరీలో సిస్ట్ ఏమైనా తయారయ్యిందా అని తెలుసుకోండి. దాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. అయినా పెళ్లికి ముందు ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం మంచిదికాదు.
నా వయసు 25, మా వారి వయసు 30. మాకు పెళ్లై సంవత్సరం అయింది. ఇంకా పిల్లలు లేరు. మేము రెగ్యులర్‌గా కలుస్తూనే ఉన్నాం. కానీ కలిసిన వెంటనే నేను యూరిన్‌కు వెళ్లాల్సిన వస్తోంది. దాంతో మా వారి వీర్యం బయటికి వచ్చేస్తోంది. మేం కలిసిన ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. వారి వీర్యం నా లోపల అసలు ఉండటం లేదు. అందుకే పిల్లలు కావడం లేదేమో అని సందేహంగా ఉంది. అది నిజమేనా? కాకపోతే కారణమేమిటో దయ చేసి చెప్పండి. మరో విషయం.. నాకు పీరియడ్స్ రెగ్యులర్‌గా అవుతాయి. కడుపు నొప్పి వస్తుంది.
- కె.లహరి, రాజమండ్రి
కలయిక తర్వాత విడుదలైన వీర్యం యోని భాగంలో చేరుతుంది. వీర్యంలో కళ్లకు కనిపించని సూక్ష్మమైన వీర్యకణాలతో పాటు ఎక్కువ భాగం పల్చటి ద్రవం ఉంటుంది. ఒక్కొక్కరికి 2ml నుంచి 7ml వరకు యోనిలోకి విడుదల అవుతుంది. వీర్యంలో ఉన్న వీర్యకణాలకు మాత్రమే కదిలే గుణం ఉంటుంది. కాబట్టి అవి యోనిలో నుంచి సన్నటి గర్భాశయ ముఖ ద్వారం (సర్విక్స్) ద్వారా గర్భాశయంలోకి, తద్వారా ఫాలోపియన్ ట్యూబ్స్‌లోకి ప్రవేశిస్తాయి. అక్కడ అండంలో ఫలదీకరణ చెందటం వల్ల గర్భం వస్తుంది. యోనిలో ఉన్న వీర్యం గర్భాశయంలోకి వెళ్లదు. అది ఎక్కువగా విడుదల అయినప్పుడు వెంటనే లేదా మెల్లమెల్లగా బయటకు వచ్చేస్తుంది. కొందరిలో జెల్‌లాగా జిగురుగా తయారై ఉదయం బయటకు వచ్చేస్తుంది.
వీర్యంలో ఉండే వీర్యకణాలకు చాలా వేగంగా గర్భాశయంలోకి ప్రవేశించే గుణం ఉంటుంది. కాబట్టి మీరు దీనివల్ల పిల్లలు కావట్లేదని కంగారు పడనవసరం లేదు. కలిసే ముందు మీ నడుము కింద దిండు పెట్టుకుంటే, వీర్యం ఎక్కువసేపు యోనిలో ఉంటుంది. దాంతో ఎక్కువ కణాలు లోపలికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. అలాగే పీరియడ్స్‌సమయంలో కడుపునొప్పి కొందరిలో ఆ సమయంలో విడుదలయ్యే హార్మోన్స్ మోతాదును బట్టి, శరీరతత్వాన్ని బట్టి ఉంటుంది. చాలా తక్కువమందిలో మాత్రమే గర్భాశయంలో గడ్డలు, ఎండోమెట్రియోసిస్ వంటి కొన్ని సమస్యల వల్ల పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి వస్తుంది. మీకు ఏడాదైనా గర్భం రాకపోవడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి.
నా వయసు 24. నాకు మా బావతో పెళ్లి కుదిరింది. నాకు స్కిన్ ప్రాబ్లమ్ ఉంది. చలికాలంలో అయితే చర్మం బాగా పగిలిపోతుంది. మా అమ్మకు కూడా ఈ సమస్య ఉంది కానీ, ఆమెకు త్వరగా తగ్గిపోతుంది. నాకు మాత్రం ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. నాకు పుట్టబోయే పిల్లలకు కూడా ఈ సమస్య వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. మా బావను చేసుకుంటే పిల్లలు సరిగా పుట్టరని నా ఫ్రెండ్స్ అంటున్నారు. అలా అయితే ఈ స్కిన్ ప్రాబ్లమ్ కచ్చితంగా నా పిల్లలపై ప్రభావం చూపుతుందా?
- ఓ సోదరి, పేరు రాయలేదు
చలికాలంలో చర్మం పగలడం అనేది వారివారి శరీరతత్వాన్ని బట్టి చాలా మందికి ఉంటుంది. అది మీ అమ్మకి కూడా ఉంది కాబట్టి మీకు పుట్టబోయే బిడ్డకు వస్తుందా, లేదా అనేది చెప్పలేం. చర్మానికి సంబంధించిన జన్యుపరమైన సమస్యలు కొన్ని వంశపారం పర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కేవలం చలికాలంలో చర్మం పగలడం అనేది సాధారణమే. కాకపోతే మీ బావకు అంటే మేనరికపు పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి అతనిలో కూడా ఏమైనా చర్మ సమస్యలు ఉండి, అవి కూడా జన్యుపరమైనవే అయ్యుంటే, అవి మీకు పుట్టబోయే బిడ్డకు సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకానీ కచ్చితంగా వస్తుందని చెప్పడం కష్టం.
మేనరికపు పెళ్లిళ్ల వల్ల చర్మ సమస్యలు ఒక్కటే కాకుండా మీ ఇరువురి కుటుంబాల్లో ఏవైనా జబ్బులు, మానసిక, శారీరక సమస్యలు ఉన్నా, లేకపోతే కొన్నిరకాల జన్యువుల్లో లోపాలు ఉంటే అవి మీకు పుట్టబోయే బిడ్డకు వచ్చే అవకాశాలు ఎక్కువ. మేనరికం కాని పిల్లలకు అవయవ, జన్యులోపాలు 2-3 శాతం ఉంటే, మేనరికం ద్వారా పుట్టే పిల్లలకు ఆ సమస్యలు రెట్టింపు ఉంటాయి. ఒకసారి మీరు, మీ బావ జెనెటిక్ కౌన్సిలింగ్‌కు వెళ్లడం మంచిది. దీని ద్వారా మీ సమస్యలు, కుటుంబంలో ఉండే సమస్యలను ఆధారంగా చేసుకొని, మీకు పుట్టబోయే పిల్లల్లో సమస్యలు ఎంతవరకు రావచ్చో జెనిటిక్ కౌన్సెలర్ ఒక అంచనా వేసి చెబుతారు. - డా.వేనాటి శోభ

click the below image to get a best deal::
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365
Join::Group::https://www.facebook.com/groups/freshdeals365
Fallow::https://www.twitter.com/freshdeals365
Post a Comment