- సొంత డొమైన్‌పై ఉచితంగా వెబ్‌పేజీ
- కేటగిరి వారీగా రెడీమేడ్ మెనూ సిద్ధం
- రూ.5వేలకే ప్రత్యేక డొమైన్, ఏడాది నిర్వహణ
- చిన్న దుకాణాలే లక్ష్యంగా మైడిజీ సిటీ స్టార్టప్
ఒక
వ్యాపార సంస్థకు వెబ్‌సైట్ పెట్టుకుని నిర్వహణ చేయడానికి వేలల్లో డబ్బులు
పోయాలి. దాంతో చిన్నపాటి వ్యాపార సంస్థలు అంత ఖర్చు చేసి
వెబ్‌సైట్‌పెట్టుకోవడానికి వెనకాడుతారు. దాని వల్ల వారి వివరాలు కేవలం ఆ
ప్రాంతానికే పరిమితమయిపోతుంటాయి. కచ్చితంగా ఈ అంశమే ఆకర్షించిన
శ్రీనివాస్, వెంకట్, శ్రీకాంతలు వేగంగా, అతి తక్కువకే వెబ్‌సైట్
అందిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి మై డిజీ సిటీ స్టార్ట్‌పకు శ్రీకారం
చుట్టారు. మరి ఇది నగర ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో పరిశీలిద్దామా...
రెండు నిమిషాల్లో వెబ్‌సైట్
ఒక
వెబ్‌సైట్ రెడీ చేయాలంటే నెలల తరబడి వేచి ఉండాలని అనుకుంటారు. కేవలం
రెండు నిమిషాల్లో వెబ్‌పేజీ సిద్ధం చేసి మైడిజీసిటీ వారు అందిస్తున్నారు.
అంత వేగంగా ఇవ్వడానికి వెనక దానికి చాలా కసరత్తు చేశారు. ముందుగానే ఒక
ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. దాని ద్వారా రెడీమేడ్ టెప్లెట్స్, ఎవరైనా
మార్చుకునేలా వీలుండే మెనూలు సిద్ధంగా ఉంటాయి. కంప్యూటర్‌పై పూర్తిస్థాయి
అవగాహన లేని వారు కూడా సులభంగా తమ సమాచారం తామే పెట్టుకునే విధంగా దీన్ని
సిద్ధం చేసినట్లు వ్యవస్థాపకులు వివరిస్తున్నారు. ప్రతి చిన్న విషయాలకు
డెవలపర్‌ని ఆశ్రయించేలా ఉండకూదనే ఉద్దేశంలోనే దీనిపై ప్రత్యేక శ్రద్ధ
తీసుకునన్నట్లు వెల్లడించారు.
ఉచితంగా ఎల్లో పేజీస్ అందించాలనేది లక్ష్యం
సాధారణంగా
ప్రస్తుతం ఎల్లోపేజీస్ వివరాలు అందించే కంపెనీల్లో కొత్తగా వచ్చే వ్యాపార
సంస్థల వివరాలుజాబితాలో చోటివ్వాలంటే కచ్చితంగా నీర్ణీతరుసుము
చెల్లించాల్సి ఉంది. కాని వీరు ప్రారంభించిన మైడిజీ సిటీ ద్వారా ప్రతి
సంస్థకు ఉచితంగా వెబ్‌పేజీ ఇస్తారు. దానితోపాటు ఆ వివరాలు కూడా తమ సైట్
సెర్చ్‌తోపాటు లోకల్ ఎస్‌ఈవో అల్‌గారిథమ్ సాయంతో గూగుల్‌లోనూ త్వరగా
వచ్చేలా చేస్తారు.
వారే దుకాణాలకు వెళ్లి వెబ్‌సైట్ ఇస్తారు
సంస్థకు
సంబంధించిన మార్కెటింగ్ ప్రతినిధులే వెళ్లి ఆ ప్రాంతంలో ఉండే ప్రతి చిన్న
దుకానానికి కూడా వెబ్‌పేజీ ఇచ్చేస్తారు. పేస్‌బుక్‌లో సైనప్ చేసినంత
సులభంగా దీన్ని ఏర్పాటు చేసి అందిస్తారు. దాని కోసం ఒక్క రూపాయి కూడా
తీసుకోకపోవడం విశేషం. త్వరలో నగరంలో ప్రాంతాల వారీగా ఈ వివరాలు అప్‌డేట్
చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇలా అన్ని ప్రాంతాలు పూర్తి చేసి
ఎక్కడ ఏ అవసరం వచ్చిన చిన్న క్లిక్ కొడితే మొత్తం ఆ ప్రాంత వివరాలు
వచ్చేలా చేయాలనేది వారి లక్ష్యంగా వ్వవస్థాపకులు చెబుతున్నారు.
అన్‌లిమిటెడ్ డాటా యూసేజ్
నాలుగు
రకాల ప్యాకేజీలతో సంస్థ ముందుకు వెళ్లబోతున్నట్లు చెప్పారు. బేసిక్
ప్యాకేజీకి ఎటువంటి రుసుం తీసుకోకుండా ఉచితంగా చేస్తారు. స్టార్డర్డ్‌లో
రూ.5వేలు తీసుకుని ప్రత్యేక డొమైన్ ఇవ్వడంతోపాటు అన్‌లిమిటెడ్ స్పేస్
ఇస్తారని ప్రతినిధులు చెబుతున్నారు. దీనితోపాటు ఏడాది పాటు కంటెంట్
పెట్టాల్సి వచ్చిన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా
వేరే డవలపర్ దగ్గరకు వెళ్లకుండా తామే అన్ని సౌకర్యాలు ఇచ్చేందుకు తయారుగా
ఉన్నట్లు చెబుతున్నారు. ఆ తరవాత మరో రెండు రకాల ప్యాకేజీలు కూడా ఉన్నాయి.
నెలకొ టెంప్లెంట్ మార్చుకోవచ్చు
ప్రతి
నెల ఉచితంగా టెంప్లెంట్లు సిద్ధం చేసి అందిస్తారు. మొత్తం వెబ్‌సైట్
లుక్‌ని మార్చేసేది ఈ టెంప్లెంట్స్.. దాని వల్ల ఉచితంగా ఉన్నవాటిని
ఎప్పటికప్పుడు మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. వెబ్‌సైట్ కూడా కొత్త
లుక్‌తో అందుబాటులోకి వస్తుంది. గోల్డ్, ప్లాటినమ్ ప్యాకేజీ
కావాలనుకునేవారికి వారి వ్యాపార సంస్థ మొత్తాన్ని తమ టీంతో వీడియో తీసి
సంక్షిప్తంగా తయారు చేసి వెబ్‌సైట్‌లో పెట్లే కొన్ని సర్వీసులు అందిస్తామని
వ్యవస్థాపకుడు శ్రీకాంత్ వివరించారు.
click the below image to get a best deal::
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365
Join::Group::https://www.facebook.com/groups/freshdeals365
Fallow::https://www.twitter.com/freshdeals365
Post a Comment