Skip to main content

ప్రభాస్ సరసన అందుకే నటించిందట...!

 
' ఏక్ నిరంజన్' సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు  కంగనా రనౌత్ ఎందుకు ఒప్పుకొందో తెలుసా?  కంగనాతో విడిపోయిన బాలీవుడ్ హీరో, మరో మాజీప్రియుడు అధ్యాయన్ సుమన్ మరో సంచలన వ్యాఖ్యలు చేశాడు.  ఇప్పటికే  కంగనా, హృతిక్ రోషన్‌ల మధ్య వివాదానికి ఆజ్యం పోసిన సుమన్ తాజాగా టాలీవుడ్‌కి షాకిచ్చాడు. కంగనాకు చేతబడి లాంటి క్షుద్రవిద్యలు తెలుసుని ఆరోపించిన అతడు, మరో సంచలన విషయాన్ని వెల్లడించాడు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ఏక్ నిరంజన్ చిత్రంలో కంగనా రనౌత్ చేయటానికి కారణం ఓ బీఎండబ్ల్యు కారు అని వ్యాఖ్యానించాడు.  ఈ విషయాన్ని అధ్యయన్ సుమన్  బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ వివరించాడు. "అప్పట్లో మా నాన్నగారు నాకు ఓ బీఎండబ్ల్యు కారు గిప్ట్ గా ఇచ్చారు. ఇది చూసిన కంగనా చాలా అసూయ ఫీలయ్యింది. వెంటనే ఆమె హైదరాబాద్ వెళ్లి అక్కడ ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రానికి కమిటైంది. కేవలం ఆ కారు కొనుక్కునే డబ్బు కోసమే ప్రభాస్ సరసన నటించేందుకు ఒప్పుకుంది'' అని తెలిపాడు. ఆ డబ్బుతో వెంటనే బీఎండబ్ల్యు కొనుక్కుని నాకు చూపించిందని, అంతటి అసూయ, హై టెంపర్ ఉన్న అమ్మాయి కంగనా అని తేల్చి చెప్పాడు.

మరోవైపు ఒక మహిళను కించపరచడానికి ఇదంతా చేశానని భావిస్తే తానేమీ చేయలేనని, పబ్లిసిటీ కోసం చేయడంలేదని  ట్విట్టర్ లో  వివరణ ఇచ్చాడు.  తనకు మద్దతు తెలిపినవారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ   ట్విట్ చేశాడు.  ఎవరు నమ్మినా నమ్మకపోయినా...
తన గుండెలోని వచ్చిన మాటలన్నాడు. ఇలా ఇంకెవరికీ కాకూదని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

కాగా 2008లో 'రాజ్‌: ద మిస్టరీ కంటిన్యూస్‌' సినిమా సందర్భంగా సుమన్‌, కంగన మధ్య వ్యవహారం నడిచింది.  విడిపోయిన  దాదాపు  ఏడు సంవత్సరాల  తర్వాత కంగనాను ప్రేమించి మోసపోయానని, ఆమెకు చేతబడిలాంటి క్షుద్రవిద్యలు తెలుసంటూ వ్యాఖ్యానించి  అధ్యయన్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

నేటి వార్తావిశేషాలు నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కేటీపీఎస్ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కేసీఆర్ నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన.'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ నేడు గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ నేటి నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఆప్ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావాపై నేటు పాటియాల హౌజ్ కోర్టులో విచారణ

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.