భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య 1971లో యుద్ధం చెలరేగే సమయానికి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏం చేస్తున్నారో తెలుసా? తీరిగ్గా దివాన్ మీద దుప్పటి మారుస్తున్నారట!! ఈ విషయాన్ని సరిగ్గా అదే సమయానికి అక్కడకు వెళ్లిన ఆమె వైద్యుడు డాక్టర్ కేపీ మాథుర్ తాజాగా విడుదల చేసిన పుస్తకంలో రాశారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేసిన ఆయన.. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇందిరాగాంధీకి వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించారు. ఆ కాలం నాటి అనుభవాలతో ఆయన 'ద అన్‌సీన్ ఇందిరాగాంధీ' అనే పుస్తకం రాశారు. ఆరోజు ఉదయం తాను ఆమెను చూసేందుకు వెళ్లేసరికి.. దివాన్ మీద దుప్పటి మారుస్తున్నారని, ముందురోజు రాత్రి యుద్ధానికి సంబంధించిన గొడవలు ఉండటంతో టెన్షన్‌గా గడిపినందున పొద్దున్నే రిలాక్స్ అయ్యేందుకు అలా చేసి ఉంటారని ఆయన రాశారు. 1971 డిసెంబర్ మూడో తేదీన పాకిస్థాన్ యుద్ధం ప్రారంభించే సమయానికి ఇందిర కోల్‌కతాలో ఉన్నారు. వెంటనే ఆమె తిరిగి ఢిల్లీకి వచ్చేశారు. విమాన ప్రయాణంలో కూడా ఆమె పెద్దగా టెన్షన్ ఏమీ పడలేదని, యుద్ధవ్యూహాలు, భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల గురించే ఆలోచించారని మాథుర్ అన్నారు.
అయితే, 1966లో ప్రధానమంత్రిగా పదవీబాధ్యతలు తీసుకునే సమయానికి మాత్రం ఆమె కొంత టెన్షన్‌తో కనిపించారని మాథుర్ తెలిపారు. ప్రధాని అయిన మొదటి రెండేళ్లు మాత్రం ఆమె బాగా టెన్షన్, కొంతవరకు గందరగోళంగా కనిపించేవారని, అప్పటికి ఆమెకు స్నేహితులుగానీ, సలహాదారులుగానీ ఎవరూ లేరని చెప్పారు. ఆమె టెన్షన్ పడటం వల్లే ఉదయం పూట కడుపులో బాగుండేది కాదని, దానికి తాను చికిత్స చేసేవాడినని అన్నారు. ఆమె ఎప్పుడైనా పర్యటనకు వెళ్తే, కనాట్‌ప్లేస్‌లోని సౌతిండియన్ కాఫీ హౌస్ నుంచే టిఫిన్లు తెప్పించుకునేవారట. సోనియాగాంధీని రాజీవ్‌గాంధీ పెళ్లి చేసుకున్న తర్వాత.. తన కోడలు త్వరగా భారతీయ సంస్కృతిని అలర్చుకోవాలని ఇందిర భావించేవారు. ఇతరులతో సోనియా గురించి ఎప్పుడు మాట్లాడినా ఆమెను 'బహూరాణీ' అనే చెప్పేవారు.
సోనియా - ఇందిర చాలా త్వరగా ఒకరికి ఒకరు అలవాటు పడిపోయారని, ఇంటిని నడిపించే బాధ్యతను సోనియా చాలా త్వరగా తీసుకున్నారని మాథుర్ తన పుస్తకంలో రాశారు. ఆదివారాలు ఆమె ఎక్కువగా పుస్తకాలు చదివేవారని, గొప్పవాళ్ల ఆత్మకథలను ఎకకువ చదివారని అన్నారు. కొన్నిసార్లు భోజనం తర్వాత పేకాట ఆడేవారని, 1977 లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటమిని కూడా ఆమె చాలా హుందాగా తీసుకున్నారని తెలిపారు. ఆమె రోజూ పూజలు చేసేవారో లేదో తనకు తెలియదు గానీ.. ప్రత్యేకంగా పూజగదిలో చాలా దేవుళ్ల బొమ్మలు ఉండేవని, నేలమీద చిన్న చాప కూడా ఉండేదని తెలిపారు. చాలాసార్లు తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారని, అలాగే వైష్ణోదేవి గుడికి కూడా వెళ్లారని అన్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment