Skip to main content

ఔనా! దీపిక ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా?

 
'దీపికా.. మీ ఎంగెజ్‌మెంట్ సందర్భంగా నా ఆశీస్సులు. మీరిద్దరూ కలిసి జీవిస్తూ.. సుఖసంతోషాలను పొందాలని, మంచి భవిష్యత్‌ మీకు కలుగాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా' అంటూ బాలీవుడ్ ఆలనాటి నటి, డ్రిమ్‌గర్ల్‌ హేమామాలిని గురువారం ట్విట్టర్‌లో పెట్టిన మెసేజ్‌ పెద్ద దుమారమే రేపింది. బాలీవుడ్ జంట దీపికా పదుకొనె, రణ్‌వీర్‌ సింగ్‌ గతకొంతకాలంగా గాఢంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. నిత్యం వార్తల్లో దర్శనమిస్తూ తమ ప్రేమను ప్రగాఢంగా చాటుకుంటున్న ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా? ఈ విషయం తెలియడంతో హేమామాలిని వారికి శుభాకాంక్షలు తెలిపిందా? అన్న ఊహాగానాలతో ట్విట్టర్‌ ఊగిపోయింది. ఈ ప్రేమజంట ఫ్యాన్స్ అయితే వరుసగా హేమామాలిని ట్యాగ్‌ చేస్తూ.. నిజంగా మా దీపిక-రణ్‌వీర్‌ సింగ్‌ల ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? వారి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ? అంటూ ఆరాతీయడం మొదలుపెట్టారు.  

ట్విట్టర్‌లో హేమ శుభాకాంక్షలు చాలాసేపు హల్‌చల్ చేసిన తర్వాత డ్రీమ్‌ గర్ల్‌ తీరికగా స్పందించింది. 'అయ్యో! నేను శుభాకాంక్షలు తెలిపింది దీపికా పదుకొనేకు కాదు. ఈమె వేరే దీపిక' తిరిగ్గా సమాధానం ఇచ్చింది. దీంతో అభిమానులు నిట్టూర్చారు. మా దీపిక-రణ్‌వీర్ సింగ్‌ల ఎంగేజ్‌మెంట్‌ కూడా త్వరగా అయిపోతే బాగుండు అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.




When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

నేటి వార్తావిశేషాలు నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కేటీపీఎస్ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కేసీఆర్ నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన.'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ నేడు గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ నేటి నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఆప్ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావాపై నేటు పాటియాల హౌజ్ కోర్టులో విచారణ

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.