Skip to main content

పెళ్లి వేళ...మృత్యుహేల


► అల్వాల్ బ్రిడ్జిపై కారు-బైక్ ఢీ
► ప్రమాదంలో ముగ్గురి మృతి
► మృతుల్లో తాత, మనవరాలు
► మరో ఇద్దరి పరిస్థితి విషమం
► పెళ్లింట విషాదం నింపిన ప్రమాదం

 బొల్లారం: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న ఆ ఇంట్లో పెను విషాదం. మరో రెండు రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇల్లు కన్నీటి సంద్రంగా మారింది. అల్వాల్ బ్రిడ్జిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో పెళ్లి కొడుకు తాత, మామ కూతురు మృతి చెందగా... మేనమామ, మేనత్త సహా ఏడుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. హృదయ విదారకమైన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలివీ... చంపాపేట విష్ణుపురి కాలనీకి చెందిన కృష్ణమాచారి (70) మనవడి (కూతురి కొడుకు) పెళ్లి ఈ నెల 30న జరుగనుంది. సోమవారం పెళ్లి కొడుకును చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణమాచారి కుటుంబంతో సహా హకీంపేటకు వెళ్లారు. కార్యక్రమం ముగిశాక తిరిగి చంపాపేటకు బయలుదేరారు.

కృష్ణమాచారి, ఆయన భార్య కౌసల్య (60), చిన్న కుమారుడు శ్రీనివాస్ చారి, కోడలు స్వప్న (32), వారి కుమార్తెలు మిల్కీ అలియాస్ వర్షిత (5), వైపీ (4), పెద్ద కొడుకు జగన్ పిల్లలు కమలి (7), సుదాన్ష్ (5), మరో బంధువు సాయికిరణ్ (22) కారులో (ఏపీ 29 బీబీ 4454)లో ఇంటికి వెళ్తున్నారు. బొల్లారం దాటాకఅల్వాల్ రైల్వే వంతెనపై వీరి కారును ఎదురుగా వేగంగా వస్తున్న పల్సర్ బైక్ (టీఎస్08 ఈఎన్ 1529) ఢీ కొట్టింది. దీంతో అదుపు తప్పిన కారు రైల్వే వంతెనపై నుంచి కింద పడిపోయింది. బైక్‌తో ఢీకొట్టిన శక్తిసింగ్ కూడా కింద పడిపోయాడు.

కారు ముందు సీట్లో కూర్చున్న కృష్ణమాచారి (70), ఆయన పెద్ద కుమారుడు జగన్ కూతురు కమలి (7) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన శక్తిసింగ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కారును నడిపిన శ్రీనివాస్ చారి, ఆయన భార్య స్వప్నల పరిస్థితి విషమంగా ఉంది. వారు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 కారు వెనుకే పెద్ద కుమారుడు
కృష్ణమాచారి పెద్ద కుమారుడు జగన్, తన భార్యతో కలసి కారు వెనకాలే బైక్‌పై వస్తున్నారు. అల్వాల్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే కారు ప్రమాదానికి గురైనట్లు జగన్ గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకుని కారులోని తన కుటుంబ సభ్యులను బయటకు తీశారు. స్థానికుల సహకారంతో వారిని వెంటనే తిరుమలగిరిలోని స్టెర్లింగ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిన కృష్ణమాచారి, కమలితో పాటు కారును ఢీకొట్టి తీవ్ర గాయాలపాలైన శక్తి సింగ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ శక్తిసింగ్ మృతి చెందాడు. దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే హకీంపేటలోని పెళ్లి బృందం పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఓ వైపు తన కుమార్తె కమలి, తండ్రి కృష్ణమాచారి కన్నుమూయడం... తమ్ముడు, మరదలు... మిగిలిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఉండటంతో జగన్ వేదన వర్ణనాతీతం. బంధుమిత్రుల రోదనలతో ఆస్పత్రి వద్ద మంగళవారం విషాదఛాయలు అలముకున్నాయి.

 ఓవర్ లోడ్... అతివేగమే కారణమా?
బైక్ అతి వేగంగా రావడం... కారులో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండడం వల్లనే ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బొల్లారం నుంచి అల్వాల్ వైపు వెళ్తున్న కారు... రైల్వే బ్రిడ్జి ఎక్కుతున్న సమయంలో బైక్‌ను ఢీకొట్టి కుడివైపున ఉన్న రైతుబజార్ వైపు రోడ్డు కింద పడిపోవడం గమనార్హం. అల్వాల్ నంచి బొల్లారం వైపు వెళ్తున్న పల్సర్ బైక్ బ్రిడ్జి దిగుతున్న క్రమంలో మలుపులో అదుపు తప్పి కారుపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. బైకును తప్పిం చుకునే క్రమంలో కారును నడిపిస్తున్న శ్రీనివాస్ కుడివైపునకు తిప్పి ఉండవచ్చని తెలుస్తోంది.

 శక్తిసింగ్ సోదరుడి ఫిర్యాదు
రాంగ్ రూట్‌లో వచ్చి తన సోదరుడి బైక్‌ను ఢీకొట్టడంతోనే అతను మృతి చెందాడని మృతునిసోదరుడు రాణా ప్రతాప్ సింగ్ బొల్లారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 డిక్కిలో పడుకొని....
ప్రమాదానికి గురైన కారులో ఐదుగురు పెద్ద వారితో పాటు నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరిలో మృతి చెందిన కమలి ముందు సీట్లో కూర్చుంది. వెనుక సీట్లో కూర్చున్న చిన్నారులు సుదాన్ష్, వైపీకి సైతం గాయాలయ్యాయి. డిక్కీలో పడుకున్న వర్షిత స్వల్ప గాయాలతో బయటపడింది.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.

నోరు శుభ్రంగా లేకున్నా నోటి కేన్సర్...!

♦ పొగాకు, గుట్కా,     ఆల్కహాల్‌లతో పాటు ఇదీ ఒక కారణమే ♦ ప్రపంచ నోటి కేన్సర్లలో 31.25 శాతం భారత్‌లోనే ♦ ప్రాథమిక దశలో గుర్తించేందుకు ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి పరిశోధనలు  సాక్షి, హైదరాబాద్: రాత్రి పూట ఫుల్‌గా నాన్ వెజ్ తిని, దాంతోపాటు ఆల్కహాల్ లేదా శీతల పానీయాలు సేవించి కనీసం నోటిని శుభ్రం చేసుకోకుండా అలాగే నిద్రపోతే నోటి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పొగతాగడం, పొగాకు పదార్థాలు, గుట్కా నమలడం, ఆల్కహాల్ సేవించడం వ ల్ల నోటి కేన్సర్ ప్రమాదం ఎక్కువని, దాంతోపాటు నోటిని శుభ్రంగా ఉంచుకోకున్నా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచంలో 3.2 లక్షల మంది నోటి కేన్సర్ రోగులు ఉంటారని, అందులో లక్ష మంది (31.25%) మన దేశంలోనే ఉంటారని తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కేన్సర్లు కోటిన్నర మందికి వచ్చే అవకాశం ఉందని, అందులో భారత్‌లో 10.58 లక్షల (7.05%) మందికి సోకే అవకాశం ఉందని పేర్కొంది. గుట్కా నమలడం వల్ల ఎంత శ్రమ చేసినా శరీరం అలిసిపోదు. అందుకే బరువులు మోసేవారు, లారీ, ఆటో డ్రైవర్లు, ఇతరత్రా శ్ర...