Skip to main content

ఆ గ్రామాల్లో అంతా పిచ్చివాళ్లే!


ఇండోనేసియాలోని సిడోహార్జో, కరంగ్‌పటిహాన్, క్రెబెట్, పొనొరోగో గ్రామాలను సందర్శించాలంటే ఎవరికైనా భయమేస్తుంది. బాధేస్తుంది. గుండె బరువెక్కి మనసు మొద్దుబారుతుంది. ప్రపంచంలోకెల్లా పిచ్చివాళ్లు ఎక్కువగా ఉంది ఈ గ్రామాల్లోనే. దుర్భర దారిద్య్ర పరిస్థితుల్లో బతుకుతున్న పిచ్చివాళ్లను చూస్తుంటే ఎవరికైనా మనసు వికలమవుతుంది. పదేళ్ల పిల్లల నుంచి యాభై ఏళ్ల పెద్దవాళ్లు పిచ్చితో బాధ పడుతున్నారు.

దగ్గరి రక్త సంబంధీకులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, పౌష్ఠికాహారలోపం, ఐయోడన్ లోపంతో ఈ గ్రామాల్లో ఎక్కువ మంది పిచ్చివాళ్లు అవుతున్నారని వైద్యులు తెలియజేస్తున్నారు. అసలు ఇండోనేషియాలోనే ఎక్కువ మంది పిచ్చివాళ్లు ఉన్నారు. మొత్తం దేశంలో 25 కోట్ల మంది జనాభా ఉండగా, వారిలో 1.40 కోట్ల మంది మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని మానవ హక్కుల సంఘం ఓ నివేదికలో వెల్లడించింది. వారి దుర్భర పరిస్థితులపై ‘లివింగ్ ఇన్ హెల్’ పేరిట మానవ హక్కుల సంఘం 74 పేజీల నివేదికను సోమవారం విడుదల చేసింది.

 దేశంలో చాలినన్ని పిచ్చాస్పత్రులు కూడా లేవు. దేశం మొత్తం మీద కేవలం 48 ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి.  సిడోహార్జో, కరంగ్‌పటిహాన్ లాంటి గ్రామాల ప్రజలు పిచ్చివాళ్లను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించిన సందర్భాలు కూడా లేవు. ఎందుకంటే వీరికి మూఢనమ్మకాలు ఎక్కువ. చేతబడి చేస్తామన్న వారివద్దకే వెళతారు. అందుకని ఎవరికి పిచ్చి తగ్గిన సందర్భాలు కూడా కనిపించవు. పిచ్చితోపాటు చాలామందిలో కళ్లు కనిపించవు. చెవులు వినిపించవు. ఇక వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పిచ్చి చేష్టలు ఎక్కువైతే గొలుసులతో గోడలకు, మంచాలకు కట్టేస్తున్నారు. మరీ పిచ్చి ముదురి హింసాత్మకంగా వ్యవహరించే వారిని ఇనుప బోనుల్లో బంధిస్తున్నారు.

పిచ్చి వారిని ఎవరిని కూడా గొలుసులతో కట్టివేయరాదంటూ ఇండోనేసియా 1977లో చట్టం తీసుకొచ్చింది. అయినా ఎవరు చట్టాన్ని పాటించడం లేదు. దేశంలో దాదాపు 19వేల మంది పిచ్చివాళ్లను గొలుసులతో కట్టేసి ఉంచినట్లు మానవ హక్కుల నివేదిక వెల్లడించింది. ప్రభుత్వమే కాకుండా ఎన్జీవో సంస్థలు కూడా ఈ గ్రామాల ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి కృషి చేయాల్సిందిగా ఆ నివేదిక పిలుపునిచ్చింది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.

నోరు శుభ్రంగా లేకున్నా నోటి కేన్సర్...!

♦ పొగాకు, గుట్కా,     ఆల్కహాల్‌లతో పాటు ఇదీ ఒక కారణమే ♦ ప్రపంచ నోటి కేన్సర్లలో 31.25 శాతం భారత్‌లోనే ♦ ప్రాథమిక దశలో గుర్తించేందుకు ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి పరిశోధనలు  సాక్షి, హైదరాబాద్: రాత్రి పూట ఫుల్‌గా నాన్ వెజ్ తిని, దాంతోపాటు ఆల్కహాల్ లేదా శీతల పానీయాలు సేవించి కనీసం నోటిని శుభ్రం చేసుకోకుండా అలాగే నిద్రపోతే నోటి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పొగతాగడం, పొగాకు పదార్థాలు, గుట్కా నమలడం, ఆల్కహాల్ సేవించడం వ ల్ల నోటి కేన్సర్ ప్రమాదం ఎక్కువని, దాంతోపాటు నోటిని శుభ్రంగా ఉంచుకోకున్నా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచంలో 3.2 లక్షల మంది నోటి కేన్సర్ రోగులు ఉంటారని, అందులో లక్ష మంది (31.25%) మన దేశంలోనే ఉంటారని తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కేన్సర్లు కోటిన్నర మందికి వచ్చే అవకాశం ఉందని, అందులో భారత్‌లో 10.58 లక్షల (7.05%) మందికి సోకే అవకాశం ఉందని పేర్కొంది. గుట్కా నమలడం వల్ల ఎంత శ్రమ చేసినా శరీరం అలిసిపోదు. అందుకే బరువులు మోసేవారు, లారీ, ఆటో డ్రైవర్లు, ఇతరత్రా శ్ర...