చైనాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడి బుద్ధి పెడదోవ పట్టింది. పట్టపగలే పాఠశాలలో అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. చైనాలోని లింగ్షాన్ కౌంటీలోని ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్నఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పాఠశాలలోని విద్యార్థులు ఈ పరిణామంతో ఆందోళనకు గురయ్యారు.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే నిందితుడు హూ అనే టీచర్ గతంలో మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 2011 చికిత్స తీసుకున్నాడు. రెండేళ్ల తరువాత పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని తేలిన అనంతరం ఇటీవలే విధుల్లో చేరాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఓ మహిళా టీచర్ ఉపాద్యాయుడి దుర్మార్గాన్ని పసిగట్టారు. వెంటనే ఇతర ఉపాధ్యాయులను అప్రమత్తం చేశారు. ఆ యువతిని అతడి బారినుంచి రక్షించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనను అక్కడి ప్రభుత్వ విభాగం ధ్రువీకరించింది. గత ఐదేళ్లుగా అతడిని పాఠశాలలో క్లాసులు చెప్పేందుకు అనుమతించలేదని, కేవలం లైబ్రరీలో పనిచేసేలా ఏర్పాటు చేశామంది. గత ఐదేళ్లుగా అతని ప్రవర్తన బాగానే ఉందని కానీ, మార్చి 28న ఓ విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించాడని పేర్కొంది. సదరు యువతికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment