Skip to main content

ఆశలు వదులుకున్నాం:విరాట్


వరల్డ్ టీ 20లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్ లో గెలుస్తామని అసలు అనుకోలేదని టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తాజాగా స్పష్టం చేశాడు. ఆదిలో ముఖ్యమైన వికెట్లను చేజార్చుకున్న తాము.. ఆసీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదిస్తామని భావించ లేదన్నాడు. ఒకానొక దశలో టోర్నీ నుంచి నిష్క్రమించామనే అనుకున్నట్లు విరాట్ పేర్కొన్నాడు.

'ముఖ్యంగా 10.0 ఓవర్లు ముగిసిన తరువాత పరిస్థితి మా చేతుల్లో లేనట్లే ఉంది. దాదాపు ఆశలు వదులు కున్నాం. అయితే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చిన తరువాత మ్యాచ్ మా అధీనంలోకి వచ్చింది. మేము ఏం చేశామన్నది ఆ సమయంలో తెలియదు. బాధ్యతాయుతంగా ఆడాలని మాత్రమే నిర్ణయించుకున్నా. భారత జట్టు కోసం గొప్ప ఇన్నింగ్స్ ఆడటం నిజంగా ఆనందాన్నిచ్చింది. ధోని ఫోర్ తో ఇన్నింగ్స్ ను ముగించిన విధానం చాలా బాగుంది. దానిపై ఏమి మాట్లాడాలో నిజంగా తెలియడం లేదు. మరోసారి ధోని ఫోర్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. అదొక అద్భుతమైన క్షణం'అని కోహ్లి తెలిపాడు.  విజయానికి చివరి మూడు ఓవర్లలో 39 పరుగులు కావాల్సిన సమయంలో తాను ఆడిన ఇన్నింగ్స్ ఇంతకు ముందెప్పుడూ ఆడలేదన్నాడు. ఆ సమయంలో కనీసం  ఓవర్ కు 15 పరుగులు రాబట్టాలనే కృతనిశ్చయంతో మాత్రమే బ్యాటింగ్ చేసినట్టు పేర్కొన్నాడు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.

నోరు శుభ్రంగా లేకున్నా నోటి కేన్సర్...!

♦ పొగాకు, గుట్కా,     ఆల్కహాల్‌లతో పాటు ఇదీ ఒక కారణమే ♦ ప్రపంచ నోటి కేన్సర్లలో 31.25 శాతం భారత్‌లోనే ♦ ప్రాథమిక దశలో గుర్తించేందుకు ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి పరిశోధనలు  సాక్షి, హైదరాబాద్: రాత్రి పూట ఫుల్‌గా నాన్ వెజ్ తిని, దాంతోపాటు ఆల్కహాల్ లేదా శీతల పానీయాలు సేవించి కనీసం నోటిని శుభ్రం చేసుకోకుండా అలాగే నిద్రపోతే నోటి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పొగతాగడం, పొగాకు పదార్థాలు, గుట్కా నమలడం, ఆల్కహాల్ సేవించడం వ ల్ల నోటి కేన్సర్ ప్రమాదం ఎక్కువని, దాంతోపాటు నోటిని శుభ్రంగా ఉంచుకోకున్నా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచంలో 3.2 లక్షల మంది నోటి కేన్సర్ రోగులు ఉంటారని, అందులో లక్ష మంది (31.25%) మన దేశంలోనే ఉంటారని తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కేన్సర్లు కోటిన్నర మందికి వచ్చే అవకాశం ఉందని, అందులో భారత్‌లో 10.58 లక్షల (7.05%) మందికి సోకే అవకాశం ఉందని పేర్కొంది. గుట్కా నమలడం వల్ల ఎంత శ్రమ చేసినా శరీరం అలిసిపోదు. అందుకే బరువులు మోసేవారు, లారీ, ఆటో డ్రైవర్లు, ఇతరత్రా శ్ర...