Skip to main content

ఫేస్‌బుక్ కీచకుడి ఆటకట్టు..


నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి యువతులను వేధిస్తున్న బీటెక్ చదివిన ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురిలి ఫిర్యాదు మేరకు మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన నర్వ సాయి శాంతన్‌ను పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..నర్వ సాయి శాంతన్ తెలిసిన అమ్మాయిలను ఫాలో అవుతూ వారి కదలికలను సీక్రెట్ కెమెరాతో రికార్డు చేసేవాడు.  

 టెలిఫోన్ కాల్స్‌ను కూడా రికార్డు చేసి తన కోరిక తీర్చాలని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. అయినా లొంగకపోవడంతో వారి పేరు మీదనే నకిలీ ఎఫ్‌బీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి సదరు బాధిత అమ్మాయిల ఫొటోలతో పాటు అసభ్యకర వ్యాఖ్యలను పోస్ట్ చేసేవాడు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడి ఫ్లాట్‌పై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. 12 మంది మహిళలపై అతను వేధింపులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడయ్యింది.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

నేటి వార్తావిశేషాలు నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కేటీపీఎస్ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కేసీఆర్ నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన.'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ నేడు గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ నేటి నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఆప్ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావాపై నేటు పాటియాల హౌజ్ కోర్టులో విచారణ

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.