-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

December 31, 2015

హార్రర్ చిత్రంలో మిల్కీబ్యూటీ

హార్రర్ చిత్రంలో మిల్కీబ్యూటీ
దెయ్యం ఈ పదం ఇప్పుడు కోలీవుడ్‌లో కాసుల వర్షం కురిపిస్తోందని చెప్పవచ్చు. ఇక్కడ  హార్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందని ప్రత్యేకంగా చెప్పవచ్చు. విభిన్న హార్రర్ కథా చిత్రాల కథలను రెడీ చేసుకుంటున్న దర్శకులు అందులో ప్రముఖ నటీమణుల్ని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. క్రేజీ నటి నయనతార నటించిన మాయ చిత్రం అనూహ్య విజయం సాధించింది.

  ప్రస్తుతం టాప్ తారామణులు త్రిష, హన్సికల నుంచి రాయ్‌లక్ష్మి,లక్ష్మిమీనన్ వరకు హార్రర్ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా బాహుబలి చిత్రంలో సౌందర్యరాశిగా ప్రేక్షకులను మతులు పోగొట్టిన నటి తమన్నాను ఇప్పుడు దెయ్యంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయితే అలాంటి పాత్రలో ఆమె నటించి భయపెట్టిస్తారా? అన్నదే ప్రశ్న. అసలు విషయానికి వస్తే ఇంతకు ముందు ఆసామి, ఇన్నారుక్కు ఇన్నారెండ్రు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఆండాళ్ రమేశ్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు.

 ఈయన ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. అయితే ఇది హార్రర్ కథా చిత్రం అయినా ఇప్పటి వరకూ తన కథ తరహా హార్రర్  చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో చూసి ఉండరంటున్నారు. తాను 2012లో దర్శకత్వం వహించిన ఆసామి తమిళ ప్రభుత్వ అవార్డులకు ఎంపికైన 12 చిత్రాల్లో ఒకటిగా చోటు సంపాదించుకుందని తెలిపారు. దొంగస్వాముల మోసాలకు ప్రజలు గురి కావద్దు అన్న సందేశంతో రూపొందించిన చిత్రం అదన్నారు. ఇక ఇప్పడు తెరకెక్కించనున్న చిత్రంలో దెయ్యమే కథానాయకుడని తెలిపారు. కాథానాయికకూ ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు.

 ఆ పాత్రకు నటి తమన్నా అయితే బాగుంటుందని భావించామన్నారు.తనూ ఇంతకు ముందే హార్రర్ కథా చిత్రంలో నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారని,అందువల్ల తమన్నాతో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఒకవేళ ఆమె కాల్‌షీట్స్ సర్దుబాటు కాకుంటే నటి రాయ్‌లక్ష్మినిగానీ ఓవియను గానీ నాయకిగా ఎంపిక చేస్తామని దర్శకుడు ఆండాళ్ రమేశ్ అన్నారు. ఇందులో నాజర్, కోవైసరళ, సంతాన భారతి ముఖ్యపాత్రలు పోషించనున్నారని, చిత్ర షూటింగ్ సంక్రాంతి తరువాత ప్రారంభం అవుతుందని తెలిపారు. తమన్నా ప్రస్తుతం తమిళంలో శీను రామసామి దర్శకత్వంలో విజయ్‌సేతుపతికి జంటగా ధర్మదురై చిత్రంలో సక్కని పల్లెటూరి యువతిగా నటిస్తున్నారన్నది గమనార్హం.
 

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu