♦ పొగాకు, గుట్కా, ఆల్కహాల్‌లతో పాటు ఇదీ ఒక కారణమే ♦ ప్రపంచ నోటి కేన్సర్లలో 31.25 శాతం భారత్‌లోనే ♦ ప్రాథమిక దశలో గుర్తించేందుకు ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి పరిశోధనలు సాక్షి, హైదరాబాద్: రాత్రి పూట ఫుల్‌గా నాన్ వెజ్ తిని, దాంతోపాటు ఆల్కహాల్ లేదా శీతల పానీయాలు సేవించి కనీసం నోటిని శుభ్రం చేసుకోకుండా అలాగే నిద్రపోతే నోటి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పొగతాగడం, పొగాకు పదార్థాలు, గుట్కా నమలడం, ఆల్కహాల్ సేవించడం వ ల్ల నోటి కేన్సర్ ప్రమాదం ఎక్కువని, దాంతోపాటు నోటిని శుభ్రంగా ఉంచుకోకున్నా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచంలో 3.2 లక్షల మంది నోటి కేన్సర్ రోగులు ఉంటారని, అందులో లక్ష మంది (31.25%) మన దేశంలోనే ఉంటారని తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కేన్సర్లు కోటిన్నర మందికి వచ్చే అవకాశం ఉందని, అందులో భారత్‌లో 10.58 లక్షల (7.05%) మందికి సోకే అవకాశం ఉందని పేర్కొంది. గుట్కా నమలడం వల్ల ఎంత శ్రమ చేసినా శరీరం అలిసిపోదు. అందుకే బరువులు మోసేవారు, లారీ, ఆటో డ్రైవర్లు, ఇతరత్రా శ్ర...
Comments
Post a Comment