-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 02, 2016

మళ్లీ భయపెట్టడానికి రెడీ!


మళ్లీ భయపెట్టడానికి రెడీ!
అందాలతార నయనతార ఈ మధ్య ఎక్కువ భయపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టున్నారు. ఆ మధ్య ‘మయూరి’ సినిమాలో బాగా భయపెట్టిన ఆమె మళ్లీ మరోసారి హారర్ చిత్రం చేస్తున్నారు. దాస్ రామస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని తెలుగులో మానస్ రుషి ఎంటర్‌ప్రైజస్ పతాకంపై కె. రోహిత్ అందిస్తున్నారు. ‘‘ లేడీ ఓరియంటెడ్ హారర్ డ్రామా ఎంటర్‌టైనర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది.

త్వరలోనే  టైటిల్, మిగితా వివరాలు ప్రకటిస్తాం ’’ అని సమర్పకుడు జూలకంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సజ్జూభాయ్ - రామ్‌ప్రసాద్ వి.వి.ఎన్.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu