-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 14, 2016

పోలీస్ షర్ట్.. గళ్ల లుంగీ.. పవర్ స్టార్ అదుర్స్..!!!


హైదరాబాద్‌: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించి సంక్రాంతి స్పెషల్ గా ఓ టీజర్ ను గురువారం సాయంత్రం చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తుంటే మాస్ ప్రేక్షకులకు నిజంగా పండగే అన్నట్లుగా ఉంది. ఎప్పుడూ విభిన్నమైన స్టైల్స్ ను టాలీవుడ్ హీరోలకు పరిచయం చేస్తూ తనదైన మార్క్ చూపించే పవర్ స్టార్ ఈ టీజర్ లో కూడా విచిత్ర పోలీసు వేషదారణలో కనిపించి అబ్బురపరిచారు.

ఈ చిత్రానికి సంబంధించి ముందునుంచి కూడా ఆయన సంచలన ఫొటోలతో, చిన్నసైజు వీడియోలతో కనిపిస్తూ అదరగొట్టేస్తున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ చిత్రంలో మాదిరిగానే సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా పోలీసు అధికారిగా నటిస్తున్న పవన్ కల్యాణ్.. ఆ చిత్రంలో డైలాగులు ఎంత మాస్ గా ఉన్నా పోలీసు డ్రెస్సింగ్ విషయంలో కాస్త జాగ్రత్త పాటించారు.

కానీ, కొత్తగా విడుదల చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ ప్రచారక వీడియోలో మాత్రం ఆయన పోలీసు వేషం చూస్తుంటే థియేటర్లోకి ఈ సినిమా ఎంత తొందరగా వస్తుందా అనిపించక మానదు. పైన పోలీసు షర్ట్.. దాని మీదుగా పోలీస్ బెల్ట్, కుడిచేత్తో భుజంపై తుపాకీ, ఎడం చేతిలో గుర్రం.. కానీ, పోలీసు ప్యాంట్ కాకుండా ఓ గళ్ల లుంగీ ధరించి సగం పోలీసు అధికారిలాగా దర్శనమిచ్చారు పవన్ కల్యాణ్. అనంతరం ఈ వీడియోపై సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ చిత్ర యూనిట్ పేర్కొన్నారు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu