-->

May 27, 2016

దక్షిణ కొరియా బహుళ జాతీయ మొబైల్ కంపెనీ శామ్ సంగ్ గెలాక్సీ 'సీ' సిరీస్ నుంచి కొత్త గెలాక్సీ సీ7ను  అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ పోన్ ఎప్పటినుంచి  వినియోగదారులకు అందుబాటులో ఉంచుతుందో మాత్రం ప్రకటించలేదు. ఇటీవలే గెలాక్సీ సీ5ను శామ్ సంగ్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. శామ్ సంగ్ గెలాక్సీ సీ5 కంటే గెలాక్సీ సీ7 వేరియంటే పెద్దదిగా ఉంటుందని పేర్కొంది. ధర, ఫీచర్లను మాత్రమే కంపెనీ ప్రస్తుతం విడుదల చేసింది. శామ్ సంగ్ గెలాక్సీ సీ7 రెండు వేరియంట్లలో లభ్యం కానుందని పేర్కొంది. 32 జీబీ వేరియంట్ ధర రూ. 26,600, 64జీబీ ధర రూ.28,600గా ఉంచుతున్నట్టు తెలిపింది. శామ్ సంగ్ గెలాక్సీ సీ7 ఫీచర్స్....
ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మాలో
హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్
5.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ఎస్ఓసీ
4జీబీ ర్యామ్
16 మెగాపిక్సెల్ కెమెరా
8 మెగాపిక్సెల్ కెమెరా
32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు
128జీబీ వరకు విస్తరణ మెమరీ
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
గోల్డ్, పింక్, గ్రే, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం
ఫింగర్ ప్రింట్ స్కానర్

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

శామ్ సంగ్ గెలాక్సీ సీ7 ధర, ఫీచర్లు ఇవే...

అది ఎప్పుడో 1944వ సంవత్సరం. అప్పట్లో రెండో ప్రపంచయుద్ధం భీకరంగా జరుగుతోంది. ముగ్గురు సిబ్బందితో కూడిన అమెరికా బాంబర్ విమానం ఒకటి శత్రుస్థావరాల మీద దాడికి బయల్దేరింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా అది వెళ్తుండగా శత్రుసైన్యాలు దాన్నిగుర్తించి పేల్చేశాయి. దాంతో ఆ విమానం కాస్తా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఆ ఘటన జరిగి ఇప్పటికి 72 ఏళ్లు గడిచింది. టీబీఎం-1సి అవెంజర్ విమానం ఇన్నేళ్ల తర్వాత సముద్ర అడుగుభాగంలో కనిపించింది. దాంట్లోనే విమాన సిబ్బంది అవశేషాలు కూడా కనిపించాయి. ఇన్నాళ్ల బట్టి ఆ విమానం కోసం శాస్త్రవేత్తలు గాలిస్తూనే ఉన్నారు.
ఇలా వివిధ సందర్భాల్లో కనిపించకుండా పో యిన అమెరికన్ విమానాలను కనిపెట్టేందుకు 'ప్రాజెక్ట్ రికవర్'ను చేపట్టారు. ఆ ప్రాజెక్టు సాధించిన విజయాల్లో ఇదొకటి. అత్యాధునిక సోనార్ టెక్నాలజీని ఉపయోగించి విమానాలు ఎక్కడున్నాయో వీళ్లు తెలుసుకుంటారు. కనిపించకుండా పోయిన సిబ్బంది మృతదేహాలలో మిగిలిన భాగాలను దేశానికి తీసుకొచ్చి, వారికి సగౌరవంగా అంత్యక్రియలు జరిపించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ప్రాజెక్ట్ రికవర్ గ్రూపు సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎరిక్ టెరిల్ తెలిపారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

72 ఏళ్ల తర్వాత బయటపడింది!

కడుపు నొప్పి వస్తుందని ఆసుపత్రికి వచ్చిన ఓ యువతి పొట్టలో కండోమ్‌ను గుర్తించిన డాక్టర్లు కంగుతిన్నారు. కామెరూన్ లోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో యువతి అపెండిక్స్ లో ఉన్న కండోమ్ ను తొలగించిన డాక్టర్లు.. ఆమెకు కడుపునొప్పి నుంచి విముక్తి కలిగించారు.
వివరాల్లోకి వెళ్తే.. కడుపునొప్పితో పాటు వికారంగా ఉందని ఇటీవల ఓ 26 ఏళ్ల యువతి కామెరూన్ లోని ఓ ఆసుపత్రికి వచ్చింది. దీంతో ఆమె స్కాన్ రిపోర్టును పరిశీలించిన వైద్యులు.. అమె అపెండిక్స్ ఉబ్బి ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు అపెండిక్స్ ను తొలగించే క్రమంలో అక్కడే ఉన్న రబ్బర్ లాంటి ఓ పదార్థాన్ని చూసి షాక్ తిన్నారు. దానిని పరీక్షించి చూసిన వైద్యులు చివరికి కండోమ్ గా తేల్చారు. కండోమ్ ను ఆమె నోటి ద్వారా తీసుకోవటం వల్ల అది అపెండిక్స్ వరకూ వచ్చి అడ్డుపడిందని  వైద్యులు తెలిపారు. వారం రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసిన సందర్భంలో ప్రమాదవశాత్తూ కండోమ్ ను మింగినట్లు ఆ యువతి వెల్లడించడంతో డాక్టర్లకు అసలు విషయం తెలిసింది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

పొరపాటున కండోమ్ మింగేసిందట!

క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఫ్లిప్ కార్ట్ నుంచి ఆఫర్ లెటర్లు అందుకుని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు  రెండు ఈ కామర్స్ సంస్థలు ముందుకు వచ్చాయి.  గుజరాత్ బాధిత విద్యార్థులకు  ఐఐఎం పేటీఎమ్, షాప్ క్లూస్ మద్దతు లభించింది. ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ లెటర్స్ అందుకుని భంగపడి, ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఐఐఎం గ్రాడ్యుయేట్లకు  తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు  యోచిస్తున్నట్టు పేటిఎం ప్రకటించింది.  వారికి ఉద్యోగాలిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అమిత్ సిన్హా తెలిపారు. ఈ మేరకు  అహ్మదాబాద్ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు.  విద్యార్థుల ప్రొఫైల్స్ పంపమని అడిగామనీ, వాటిని  పరిశీలించిన మీదట  నైపుణ్యానికి తగ్గట్టుగా పోస్టింగ్స్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.  ఇటీవల జరిగిన ప్లేస్‌మెంట్లలో పలు ఐఐఎంల నుంచి 50 మందిని విధుల్లోకి తీసుకున్నామని  పేర్కొంది. అలాగే  అహ్మదాబాద్ విద్యార్థులకూ తమ సంస్థలో అవకాశం ఇస్తామని  ప్రకటించింది. ప్లేస్ మెంట్  సెల్ నుంచి తమకు  ఈమెయిల్స్ అందాయనీ,  ఇంటర్వ్యూ తర్వాత ఎంపిక  చేస్తామన్నారు. రాబోయే రెండు వారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
మరోవైపు బాధిత  గ్రాడ్యుయేట్లు  తమను వ్యక్తిగతంగా కలిశారని  మరో ఈకామర్స్ సంస్థ షాప్ క్లూస్ తెలిపింది. తమకు ఇప్పటివరకు రెండు ఇమెయిల్స్ అందాయని షాప్  క్లూస్  సహ స్థాపకులు రాధిక అగర్వాల్ తెలిపారు. కాగా, తమ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై అహ్మదాబాద్ ఐఐఎం మేనేజ్ మెంట్ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ లను ఉద్దేశించి ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

వారికి పే టీఎం, షాప్ క్లూస్ మద్దతు

యాండ్రాయిడ్ ఫోన్ల ప్రపంచం విస్తరించింది. ప్రతి మనిషికీ ఫోన్ అత్యవసర వస్తువుగా మారిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించుకోవడంలో జనం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయిపోతున్నారు. ఫోన్ కాల్స్ మాట్లాడటమే కాక వాయిస్ మెసేజిలు పంపడంతో పాటు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఫోన్ బ్యాలెన్స్‌ను కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే  టెక్స్ట్, ఫొటోలు, వీడియోలతో పాటు.. తాజాగా ఫోన్ ఛార్జింగ్ ను సైతం షేర్ చేసుకునే అవకాశాన్ని లండన్ పరిశోధకులు అందుబాటులోకి తేనున్నారు.
అత్యవసర సమయాల్లో ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఇకముందు ఉండవట. ఫోన్ చార్జింగ్ ను షేర్ చేసుకునే వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ఫోన్ లో పూర్తిగా ఛార్జింగ్ అయిపోయినపుడు ఇతరుల ఫోన్ నుంచి ఎటువంటి వైర్, కేబుల్ అవసరం లేకుండా పవర్ షేర్ చేసుకునే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పవర్ షేక్ పేరుతో లండన్ యూనివర్సిటీ పరిశోధకులు  అభివృద్ధి పరుస్తున్న కొత్త వైర్ లెస్ టెక్నాలజీని త్వరలో అందరికీ అందుబాటులోకి తేనున్నారు.  పవర్ ట్రాన్స్ మిట్ కాయిల్స్ ద్వారా ఒక మొబైట్ ఫోన్ నుంచి మరో మొబైల్ ఫోన్ కు కరెంట్ ప్రసరింపజేసే కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఫోన్ పక్కనే మరో ఫోన్ ఉంచి  12 సెకన్లపాటు షేర్ చేసిన పవర్.. ఒక నిమిషం పాటు కాల్ మాట్లాడేందుకు వినియోగిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

ఛార్జింగ్ కూడా షేర్ చేయొచ్చు!

May 22, 2016

విజయనగరం అర్బన్: విజయనగరంలోని ట్విన్ సిస్టర్స్(కవలలు)కు ఎంసెట్ మెడికల్ విభాగంలో టాప్ ర్యాంకులు లభించాయి. కొడాలి అలేఖ్య 145 మార్కులతో 62వ ర్యాంక్, అఖిల 126 మార్కులతో 1,275వ ర్యాంక్ సాధించింది. వీరి తల్లిదండ్రులు తిరుమల ప్రసాద్, కృష్ణశాంతి వృత్తిరీత్యా వైద్యులు. పట్టణంలో వీరు ఓ ప్రైవేటు ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ట్విన్ సిస్టర్స్ అలేఖ్య, అఖిల మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిడిలేని వాతావరణం లభించడం వల్లే ర్యాంక్ సాధించగలిగామన్నారు. తల్లిదండ్రుల బాటలోనే వైద్యసేవలను అందించడమే లక్ష్యమని చెప్పారు. జిప్‌మార్, ఎయిమ్స్ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి జాతీయ స్థాయి మెడికల్ కళాశాలల్లో చదవాలనుకుంటున్నట్లు తెలిపారు.
 
click the below image to get a best deal::

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

ట్విన్ సిస్టర్స్‌.. ఆదుర్స్

  • సొంత డొమైన్‌పై ఉచితంగా వెబ్‌పేజీ
  • కేటగిరి వారీగా రెడీమేడ్‌ మెనూ సిద్ధం
  • రూ.5వేలకే ప్రత్యేక డొమైన్‌, ఏడాది నిర్వహణ
  • చిన్న దుకాణాలే లక్ష్యంగా మైడిజీ సిటీ స్టార్టప్‌
 
ఒక వ్యాపార సంస్థకు వెబ్‌సైట్‌ పెట్టుకుని నిర్వహణ చేయడానికి వేలల్లో డబ్బులు పోయాలి. దాంతో చిన్నపాటి వ్యాపార సంస్థలు అంత ఖర్చు చేసి వెబ్‌సైట్‌పెట్టుకోవడానికి వెనకాడుతారు. దాని వల్ల వారి వివరాలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితమయిపోతుంటాయి. కచ్చితంగా ఈ అంశమే ఆకర్షించిన శ్రీనివాస్‌, వెంకట్‌, శ్రీకాంతలు వేగంగా, అతి తక్కువకే వెబ్‌సైట్‌ అందిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి మై డిజీ సిటీ స్టార్ట్‌పకు శ్రీకారం చుట్టారు. మరి ఇది నగర ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో పరిశీలిద్దామా...
 
రెండు నిమిషాల్లో వెబ్‌సైట్‌
ఒక వెబ్‌సైట్‌ రెడీ చేయాలంటే నెలల తరబడి వేచి ఉండాలని అనుకుంటారు. కేవలం రెండు నిమిషాల్లో వెబ్‌పేజీ సిద్ధం చేసి మైడిజీసిటీ వారు అందిస్తున్నారు. అంత వేగంగా ఇవ్వడానికి వెనక దానికి చాలా కసరత్తు చేశారు. ముందుగానే ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. దాని ద్వారా రెడీమేడ్‌ టెప్లెట్స్‌, ఎవరైనా మార్చుకునేలా వీలుండే మెనూలు సిద్ధంగా ఉంటాయి. కంప్యూటర్‌పై పూర్తిస్థాయి అవగాహన లేని వారు కూడా సులభంగా తమ సమాచారం తామే పెట్టుకునే విధంగా దీన్ని సిద్ధం చేసినట్లు వ్యవస్థాపకులు వివరిస్తున్నారు. ప్రతి చిన్న విషయాలకు డెవలపర్‌ని ఆశ్రయించేలా ఉండకూదనే ఉద్దేశంలోనే దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునన్నట్లు వెల్లడించారు.
 
ఉచితంగా ఎల్లో పేజీస్‌ అందించాలనేది లక్ష్యం
సాధారణంగా ప్రస్తుతం ఎల్లోపేజీస్‌ వివరాలు అందించే కంపెనీల్లో కొత్తగా వచ్చే వ్యాపార సంస్థల వివరాలుజాబితాలో చోటివ్వాలంటే కచ్చితంగా నీర్ణీతరుసుము చెల్లించాల్సి ఉంది. కాని వీరు ప్రారంభించిన మైడిజీ సిటీ ద్వారా ప్రతి సంస్థకు ఉచితంగా వెబ్‌పేజీ ఇస్తారు. దానితోపాటు ఆ వివరాలు కూడా తమ సైట్‌ సెర్చ్‌తోపాటు లోకల్‌ ఎస్‌ఈవో అల్‌గారిథమ్‌ సాయంతో గూగుల్‌లోనూ త్వరగా వచ్చేలా చేస్తారు.
 
వారే దుకాణాలకు వెళ్లి వెబ్‌సైట్‌ ఇస్తారు
సంస్థకు సంబంధించిన మార్కెటింగ్‌ ప్రతినిధులే వెళ్లి ఆ ప్రాంతంలో ఉండే ప్రతి చిన్న దుకానానికి కూడా వెబ్‌పేజీ ఇచ్చేస్తారు. పేస్‌బుక్‌లో సైనప్‌ చేసినంత సులభంగా దీన్ని ఏర్పాటు చేసి అందిస్తారు. దాని కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం విశేషం. త్వరలో నగరంలో ప్రాంతాల వారీగా ఈ వివరాలు అప్‌డేట్‌ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇలా అన్ని ప్రాంతాలు పూర్తి చేసి ఎక్కడ ఏ అవసరం వచ్చిన చిన్న క్లిక్‌ కొడితే మొత్తం ఆ ప్రాంత వివరాలు వచ్చేలా చేయాలనేది వారి లక్ష్యంగా వ్వవస్థాపకులు చెబుతున్నారు.
 
అన్‌లిమిటెడ్‌ డాటా యూసేజ్‌
నాలుగు రకాల ప్యాకేజీలతో సంస్థ ముందుకు వెళ్లబోతున్నట్లు చెప్పారు. బేసిక్‌ ప్యాకేజీకి ఎటువంటి రుసుం తీసుకోకుండా ఉచితంగా చేస్తారు. స్టార్డర్డ్‌లో రూ.5వేలు తీసుకుని ప్రత్యేక డొమైన్‌ ఇవ్వడంతోపాటు అన్‌లిమిటెడ్‌ స్పేస్‌ ఇస్తారని ప్రతినిధులు చెబుతున్నారు. దీనితోపాటు ఏడాది పాటు కంటెంట్‌ పెట్టాల్సి వచ్చిన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా వేరే డవలపర్‌ దగ్గరకు వెళ్లకుండా తామే అన్ని సౌకర్యాలు ఇచ్చేందుకు తయారుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆ తరవాత మరో రెండు రకాల ప్యాకేజీలు కూడా ఉన్నాయి.
 
నెలకొ టెంప్లెంట్‌ మార్చుకోవచ్చు
ప్రతి నెల ఉచితంగా టెంప్లెంట్లు సిద్ధం చేసి అందిస్తారు. మొత్తం వెబ్‌సైట్‌ లుక్‌ని మార్చేసేది ఈ టెంప్లెంట్స్‌.. దాని వల్ల ఉచితంగా ఉన్నవాటిని ఎప్పటికప్పుడు మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. వెబ్‌సైట్‌ కూడా కొత్త లుక్‌తో అందుబాటులోకి వస్తుంది. గోల్డ్‌, ప్లాటినమ్‌ ప్యాకేజీ కావాలనుకునేవారికి వారి వ్యాపార సంస్థ మొత్తాన్ని తమ టీంతో వీడియో తీసి సంక్షిప్తంగా తయారు చేసి వెబ్‌సైట్‌లో పెట్లే కొన్ని సర్వీసులు అందిస్తామని వ్యవస్థాపకుడు శ్రీకాంత్ వివరించారు. 

 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

క్షణాల్లో వెబ్‌సైట్ సిద్దం...!!

సున్నితమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చైనా ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 4880 లక్షల తప్పుడు పోస్ట్ లను సోషల్ మీడియాలో పోస్టు చేసిందని తేలింది. ప్రభుత్వ ఉద్యోగులే రహస్యంగా ఈ పని చేపట్టినట్టు సర్వేల్లో తెలిసింది. చాలా కాలం నుంచే వార్తల్ని, సమాచారాన్ని చైనా తన ఆధీనంలో ఉంచుకుందని వెల్లడైంది. అయితే అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్, గూగుల్ లాంటి వాటిని, ఇతర విదేశీ వెబ్ సైట్లను చైనా తన దేశంలో నిషేధించింది. స్థానిక సోషల్ మీడియా సైట్లు కూడా ప్రస్తుతం తన అథారిటీల ఆధీనంలో నడుస్తున్నాయి. హర్వర్డ్ యూనివర్సిటీ డేటా పరిశోధకుడు గ్రే కింగ్, చైనా "ఫిప్టీ సెంట్ పార్టీ" అనే పరిశోధనను చేపట్టారు. ప్రభుత్వానికి అనుకూలంగా సోషల్ మీడియాలో కామెంట్, పోస్టు చేసిన వారికి ప్రభుత్వం 50 చైనీస్ సెంట్లు ఇస్తుందని ప్రజల్లో రూమర్స్ రావడంతో ఆయన ఈ పరిశోధన చేశారు.
ఇంటర్నెట్ లో జరిగే రాజకీయ చర్చల్లో ఎక్కువగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటున్నాయని ఈ పరిశోధన కనుగొంది. వాదనలకు, వివాదస్పద అంశాలకు మాత్రం ఈ పోస్టులు దూరంగా ఉంటున్నాయని తెలిపింది. ఎప్పడికప్పుడూ సబ్జెక్టును మారుస్తూ.. ప్రజలని తప్పుదోవ పట్టించడమే వారి లక్ష్యమని తెలిపింది. చాలా పోస్టుల్లో కమ్యూనిస్ట్ పార్టీ విప్లవాత్మక చరిత్ర, పాలనకు సంబంధించి గుర్తులే ఉంటున్నాయని సర్వే పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లే ఈ పోస్టులను ఎక్కువగా పోస్టు చేస్తున్నారని, కానీ వారు ఈ పనిని చేసినందుకు అదనపు వేతనం పొందుతున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సర్వే వెల్లడించింది.

సమాజంలో అశాంతి నెలకొనప్పుడు, ఏదైనా అతిపెద్ద రాజకీయ ఈవెంట్ జరిగినప్పుడు మాత్రం ఈ పోస్టులు ఎక్కువగా ఉంటున్నాయని, ప్రభుత్వానికి ఎక్కువగా సహాయపూరితంగా ఈ పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయని పరిశోధన తెలిపింది. అయితే ఈ పరిశోధనపై చైనా సైబర్ స్సైస్ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నెట్ రెగ్యులేటరీ వెంటనే స్పందించలేదు. 
 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

చైనా తప్పుడు పోస్టులు ఎన్ని...

రియాల్టీ షోల పిచ్చి రానురానూ ముదిరిపోతోంది. ఈ మధ్య హైద్రాబాద్‌లో ఓ రియాల్టీ షో స్టంట్ పేరుతో ఒంటికి నిప్పంటించుకుని పాతబస్తీకి చెందిన కుర్రాడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే అమెరికన్లతో పోలిస్తే మన దేశంలో ఈ రియాల్టీ షోల వ్యామోహం చాలా తక్కువనే చెప్పాలి. అయితే అమెరికన్లలో చాలామందికి బెట్టింగ్ పిచ్చి బాగా ఎక్కువ. ఫ్రెండ్‌తో బెట్ కట్టిన కెనడాకు చెందిన బ్రియాన్ జాంబిక్ అనే 55 ఏళ్ల మెజీషియన్ ఏ మగాడు చేయలేని, చేయకూడని పని చేశాడు. ఫ్రెండ్ బెట్ కట్టాడని ఆపరేషన్ చేయించుకుని వక్షోజాలు పెంచుకున్నాడు. అయితే జాంబిక్ ఈ బెట్‌లో గెలుచుకున్న మొత్తం 100 డాలర్లు. జాంబిక్ విషయం తెలుసుకున్న ఓ రియాల్టీ షో నిర్వాహకులు అతనితో ప్రోగ్రాం చేశారు. అతనిని రియాల్టీ షోకు రప్పించేందుకు నిర్వాహకులు 5వేల డాలర్లు సమర్పించుకున్నారు. జాంబిక్‌తో పాటు శస్త్ర చికిత్స చేసిన సర్జన్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. అతని పిచ్చితో ఏదో చేసుకుంటే రియాల్టీ షో పేరుతో పరువు తీసుకోవాలా అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

బెట్టింగ్ డబ్బుల కోసం ఏ మగాడు చేయలేని పని

ఈ రోజుల్లో ఆనందం వచ్చినా, బాధ కలిగినా చాలామంది ముందుగా చెప్పుకునేది ఫేస్‌బుక్‌కే. రకరకాల కార్యక్రమాలకు ఫేస్‌బుక్‌ వేదిక అవుతోంది. అందుకే తన భార్య.. బిడ్డను కనడాన్ని కూడా ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు ఓ వ్యక్తి.
కాలీఫోర్నియాకు చెందిన ఫకమలో కిహే ఎకీ(Fakamalo Kihe Eiki) అనే వ్యక్తి తన భార్యకు నొప్పులు మొదలైన దగ్గర్నుంచి బిడ్డ బయటకు వచ్చే వరకు జరిగిన ప్రాసెస్‌ను ఫేస్‌బుక్‌ ద్వారా తన స్నేహితులకు లైవ్‌లో చూపించాడు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన చాలామంది ఆమెను ఎంకరేజ్‌ చేస్తూ ఆ సమయంలోనే కామెంట్స్‌ కూడా పోస్ట్‌ చేశారు. ఆ ప్రత్యక్ష ప్రసార వీడియోను ఇప్పటి వరకు 23 వేల మంది చూశారు. అన్ని యాంగిల్స్‌ నుంచి ఆ వీడియోను తీసి నెట్‌లో పెట్టాడు. 45 నిమిషాల ఆ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

ప్రసవాన్ని ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం

అభిషేక్‌, ఐశ్వర్యరాయ్‌ జంటకు ఫాలోయింగ్‌ ఎక్కువే. ఈ గ్లామర్‌ కపుల్‌ ఎక్కడ కనిపించినా కెమెరా ఫ్లాష్‌లు వెలుగుతూనే ఉంటాయి. అయితే ఆలుమగల మధ్య చిరాకులు, పరాకులు కామనే. ఈ గిల్లికజ్జాలు నాలుగు గోడల మధ్యసాగితే ఫర్వాలేదు. కాని, నలుగురిలో బయటపడితే మాత్రం గోరంతలు కొండతలుగా చెప్పుకుంటారు.
 
ఐశ్వర్య సెకండ్‌ 
ఇన్నింగ్స్‌కు గ్రాండ్‌ షోగా నిలిచిన సరబ్‌జిత ప్రీమియర్‌ షో సందర్భంగా ఐష్‌, అభిల మధ్య సాగిన ఓ సీను ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ప్రీమియర్‌ షోకు బచ్చన్‌ ఫ్యామిలీతో పాటు ఇండసీ్ట్ర పెద్దలంతా విచ్చేశారు. షో ముగిశాక.. సెలబ్రిటీలంతా వేదికపైకి చేరుకున్నారు. అభి, ఐష్‌ చెట్టాపట్టాలేసుకుని వేదికనెక్కారు. ఇద్దరినీ ఫొటోలకు పోజివ్వాల్సిందిగా ఫొటోగ్రాఫర్లు కోరడం.. ఐష్‌ సరేననడం.. మామూలుగానే జరిగిపోయాయి. అంతలోనే ఏమైందో కాని, అభిషేక్‌ నెర్వ్‌సగా ఫీలయ్యాడు. ఐష్‌ చేయిని నెమ్మదిగా వదిలించుకుని వెనుక నుంచి వేదిక పక్కకు వచ్చేసే ప్రయత్నం చేశాడు. ఫొటో దిగడానికి రావాల్సిందిగా భార్య పిలుస్తున్నా.. వినీ విననట్టు వ్యవహరించాడు. దీంతో ఐశ్వర్యనే భర్త దగ్గరగా వెళ్లి చేయి పట్టుకుని ఏదో చెబుతూ మళ్లీ సీన్‌లోకి తీసుకొచ్చింది. అయినా అయిష్టంగానే ఫొటోలకు పోజిచ్చాడు అభి. నాలుగు ఫ్లాష్‌లు పడ్డాయో లేదో.. ‘యూ క్యారియాన్‌..’ అంటూ ఐష్‌కు షాకిచ్చాడు. ఆయనగారి ప్రవర్తనతో ఆశ్చర్యపోవడం ఐశ్వర్య వంతైంది. అభి అలకపై బాలీవుడ్‌
మీడియాలో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. పదిమందిలో భార్యను చులకన చేశాడంటూ జూనియర్‌ బచ్చన్‌ను కార్నర్‌ చేస్తున్నాయి. ఈ ఇష్యూ సంగతి ఎలా ఉన్నా.. సదరు వీడియో మాత్రం యూట్యూబ్‌లో రికార్డు హిట్లు కొల్లగొడుతోంది. రెండు రోజుల్లోనే ఏకంగా పదిలక్షల పైచిలుకు హిట్లు సాధించింది.

click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

అభి‘షాక్‌’ ...!!!

బాపుగారి బొమ్మని తలపించే అందం ప్రణీత సొంతం. అలాంటి అమ్మాయి లంగా, ఓణి, పరికిణీలతో కనిపిస్తూ బావా.. బావా అంటూ సందడి చేస్తే వెండితెరకి వచ్చే కళే వేరు. అందుకే ప్రణీతని దర్శకులు మరదలు పాత్రల్లో చూపించడానికి ఇష్టపడుతుంటారు. ‘బావ’ సినిమానే తీసుకోండి. అందులో ప్రణీత మరదలు పిల్లే. ‘అత్తారింటికి దారేది’లోనూ అంతే. పవన్‌కల్యాణ్‌కి మరదలే అవుతుంది. శుక్రవారం వచ్చిన ‘బ్రహ్మోత్సవం’లోనూ మహేశ్ మరదలిగా నటించింది. ఆ పాత్రల్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ ప్రణీత సందడి చేస్తున్న విధానం కుర్రకారుకు భలే నచ్చుతోంది. ‘‘మరదలిగానే కావచ్చు గానీ ‘బ్రహ్మోత్సవం’లో నా పాత్ర కొత్త కోణంలో ఉంటుంది. ఇందులో భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆక ట్టుకొనే ప్రయత్నం చేశా’’ అంటున్న ప్రణీతతో ‘సాక్షి’ స్పెషల్ చాట్...
 
♦  నేను నటించిన మంచి చిత్రాల్లో ‘బ్రహ్మోత్సవం’ ఒకటి. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రతి హృదయాన్ని కదిలించే విధంగా ఉంటుంది. అందుకే ఈ కథ వినగానే నేను వెంటనే కనెక్ట్ అయిపోయా. పాత్రకి సంబంధించి కూడా ప్రతి అణువణువూ ఆస్వాదించా. ముఖ్యంగా నా పాత్ర తన మనసులోని భావోద్వేగాలను బయటపెట్టే విధానం స్వతహాగా నాకు భలే నచ్చింది. సినిమా పేరుకు తగ్గట్టుగానే సెట్లో ఉత్సవ వాతావరణం కనిపించేది. అందుకే షూటింగ్ జరుగుతున్నట్టు అనిపించేదే కాదు. మహేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక మంచి అనుభూతి. ఆయన సెట్స్‌లో ఎప్పుడూ సరదాగా కనిపిస్తుంటారు. ఆయనతో షూటింగ్ అంటే బోల్డెంత ఫన్. ముఖ్యంగా మహేశ్‌తో కలిసి నేను చేసిన సన్నివేశాలు నాకు నటిగా మరింత సంతృప్తినిచ్చాయి.

 ఆస్వాదిస్తున్నారు
 కుటుంబం చుట్టూ సాగే కథ ‘బ్రహ్మోత్సవం. స్వతహాగా నాకు కుటుంబంతో అనుబంధం ఎక్కువ. కాబట్టి ప్రతి  సన్నివేశంలోనూ నాకు నేను, నా కుటుంబం కనిపించేది. అందుకేనేమో ఏ దశలోనూ నేనేదో సినిమా చేస్తున్నట్టు, నటిస్తున్నట్టు అనిపించేది కాదు. ఇలాంటి నేపథ్యంతో కూడిన సినిమాల్లో నటించడమంటే చాలా ఇష్టం. భవిష్యత్తులోనూ కుటుంబ నేపథ్యంతో కూడిన సినిమాలు మరిన్ని చేస్తా. ‘బ్రహ్మోత్సవం’లో ప్రేక్షకుల్ని అలరించే అంశాలు భావోద్వేగాలే.

ఇలాంటి చిత్రాలు ఎప్పుడో కానీ రావు. అందుకే ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందులో ముగ్గురు కథానాయిక లున్నప్పటికీ మా అందరి పాత్రలకీ సమ ప్రాధాన్యం దక్కింది. ప్రతి పాత్ర కూడా కథని ఎంతో కొంత ప్రభావితం చేస్తుంటుంది. అందుకే ఇందులో కథానాయికలు ఎంత మంది  అనే విషయాన్ని పట్టించుకోలేదు. సమంత, కాజల్‌లతో కలిసి నటించడం చాలా ఆనందాన్నిచ్చింది.

 click the below image to best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

బ్రహ్మోత్సవం...ప్రతి హృదయాన్ని కదిలిస్తోంది

‘ఐ యామ్ ఇన్ లవ్’.  ‘చాలా సంవత్సరాల నుంచి తను పరిచయం’. ‘నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ తను’.‘తనది కూడా నాలా హెల్పింగ్ నేచర్’.‘వంట సూపర్బ్‌గా చేస్తాడు. నాన్‌వెజ్ కూడా’. ‘రిస్క్ లేదు. పెద్దలొప్పేసుకున్నారు’. ‘ఆ యంగ్ హీరో పేరడగొద్దు తర్వాత చెబుతాను’. అని సమంత ‘సాక్షి’కి చెప్పేసింది. ఆ లవర్ బోయ్ ఎవరో మీరు చెప్పగలరా? ‘24’ సినిమాలో కాలం వెనక్కి వెళుతుంది కదా.. మీకలాంటి అవకాశం వస్తే.. మీ లైఫ్‌లో దేన్ని చెరిపేయాలనుకుంటారు?
2012లో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. ఒక్కసారి వెనక్కి వెళ్లగలిగితే వాటిని ఎరేజ్ చేసేస్తాను.
ఏంటవి.. ప్రొఫెషనలా? పర్సనలా?
రెండు రకాలుగా తీసుకోకూడని డెసిషన్స్ తీసుకున్నాను.
మీలాంటి అందగత్తెలకు ప్రపోజల్స్ బాగానే వస్తాయి. లవ్‌లో పడేయడానికి చాలామంది ట్రై చేస్తుంటారు కూడా.. అప్పుడేమనిపిస్తుంది?
ఎవరైనా వచ్చి, నన్ను లవ్‌లో పడేయడానికి ట్రై చేస్తే ఆ విషయం కూడా మనసుకి ఎక్కించుకోనంత బోర్‌గా తయారైపోయాను. ఓల్డ్ అయిపోయాను. వర్క్‌లో ఇన్‌వాల్వ్ అయిపోయాను. నిజం చెప్పాలంటే ఈ మధ్య నా లైఫ్ నాకే బోరింగ్‌గా ఉంది. ఇప్పుడు పెళ్లి, పిల్లలు.. ఆ స్టేజ్‌కి వచ్చేశాను.
అయితే పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారన్న మాట.
అది ఇంకా తెలియదు. కానీ, పెళ్లి స్టేజ్ మాత్రం వచ్చేసింది.
ఓ యంగ్ హీరోతో లవ్‌లో ఉన్నారని టాక్.. నిజమేనా?
నిజమే. లవ్‌లో ఉన్నాను.
ఏదీ మళ్లీ చెప్పండి!
Yes, I am in love.
పెళ్లి, పిల్లలు.. ఈ లైఫ్ మీద మీ ఒపీనియన్?
కచ్చితంగా నాకు సెటిల్ అవ్వాలని ఉంది. మంచి ఫ్యామిలీ కావాలి. పిల్లలంటే ఇష్టం. హీరోయిన్‌గా చాలా సినిమాలు చేశాను. ఎంతోమంది అభిమానం పొందగలిగాను. ఆటోగ్రాఫులు, ఫొటోగ్రాఫులు అడుగుతుంటే, ‘మనమేం సాధించామని ఇలా అడుగుతున్నారు?’ అనిపిస్తుంది. అయినా నేనేం చేశానని? నా పని నేను చేశాను.. అంతకుమించి ఏమీ చేయలేదు. నన్నెందుకు అందరూ ఇష్టపడుతున్నారో తెలియదు.
సినిమాలు వదిలేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా?
నేను సినిమాలు మానను. నా వయసుకి తగ్గ సినిమాలు చేస్తాను. అలాగే, నా కుటుంబ మర్యాదను కూడా కాపాడే సినిమాలే చేస్తాను. అంటే... మ్యారీడ్ స్టేటస్‌కి తగ్గ సినిమాలు చేస్తాను.
ఇప్పుడు మీ లైఫ్‌లో ఉన్న అబ్బాయి మీరు సినిమాలు చేస్తే ఒప్పుకుంటారా?
కచ్చితంగా ఒప్పుకుంటారు. తనకేం అభ్యంతరం లేదు.
మీ లైఫ్‌లో ఉన్న ఆ రియల్ హీరో ఈ మధ్య పరిచయం అయ్యారా?
కాదు.. నాకు చాలా సంవత్సరాల నుంచి తను పరిచయం.
తనలో ఉన్న క్వాలిటీస్ గురించి?
నేను బాగా అల్లరి. ఏ ఎమోషన్ అయినా నాది ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుంది. ఆనందం వచ్చినా తట్టుకోలేను. టెన్షన్ వచ్చినా తట్టుకోలేను. ఆలోచించి మాట్లాడటం అస్సలు తెలియదు. నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ తను. ఆలోచించి మాట్లాడటం, స్టేబుల్‌గా నిర్ణయాలు తీసుకోవడం, పేషెన్స్ అన్నీ ఉన్నాయి. నాకు కావల్సింది కూడా అదే.
ఇన్నర్‌గా మీరు మంచి అమ్మాయి.. సేవా కార్యక్రమాలు చేస్తారు. మరి.. మీక్కాబోయే భర్త డబ్బులు తగలేస్తావని అనే టైపా?
అస్సలు కాదు. నాలాగే తనది కూడా చాలా హెల్పింగ్ నేచర్. సేవా కార్యక్రమాలు చేయమని ఎంకరేజ్ చేస్తాడు. అలాంటి అబ్బాయి కాకపోతే ఇష్టపడేదాన్ని కాదేమో.
మీ మనసు దోచుకున్న ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలని ఉంది?
ఎవరో అడగొద్దు, జస్ట్ కొన్ని నెలల్లో చెప్పేస్తా.
అంతకుముందు లవ్‌లో పడినప్పుడు ట్విట్టర్‌లో చెప్పారు.. ఈ లవ్‌ని ఎందుకు రహస్యంగా ఉంచేశారు?
ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే బయటికి చెప్పలేదు. ఒకసారి సాఫీగా జరగలేదు. నేను హర్ట్ అయ్యాను. అందుకే ఇప్పుడు ఒకేసారి పెళ్లి గురించి ఎనౌన్స్ చేయాలనుకుంటున్నాను.
సినిమాలకు చిన్న బ్రేక్ తీసుకుంటున్నారట.. ఏం చేస్తారు?
వంట నేర్చుకోవాలనుకుంటున్నా. తింటాను తప్ప వండటం చేతకాదు. నా చుట్టూ ఉన్న అందరికీ వంట వచ్చు.
మరి.. ఆయనకు వచ్చా?
ఓ.. నా బాయ్‌ఫ్రెండ్‌కు బాగా వచ్చు. తను చేసి పెడుతుంటే తినడానికి సిగ్గుగా ఉంటుంది. అందుకే ఛాలెంజ్‌గా తీసుకుని, వంట నేర్చుకుంటాను.
ఆయన నాన్‌వెజ్ కూడా కుక్ చేస్తారా?
చేస్తారు.. నాన్‌వెజ్ చాలా బాగుంటుంది.
దాదాపు ఓపెన్‌గానే మాట్లాడేస్తారు.. ఇలా అయితే ఇబ్బందే కదా?
అవును. నేను బయటకు ఏం మాట్లాడుతున్నానో లోపల కూడా అంతే. మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒకలా.. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉండలేను. ట్విట్టర్‌లో కూడా నాకనిపించింది పోస్ట్ చేసేస్తాను. దానివల్ల విమర్శల పాలయ్యాను. ఇలా ఓపెన్ బుక్‌లా ఉంటాను కాబట్టి, అసహ్యించుకునేవారినీ, అభిమానించే వారినీ సమానంగా పొందగలిగా. అయినా నో ప్రాబ్లమ్. నేను నాలానే ఉంటా.
రియల్ లైఫ్‌లో నటించరన్నమాట?
నైన్ టు సిక్స్ యాక్ట్ చేయగలుగుతాను. షూటింగ్‌కి పేకప్ చెప్పాక కూడా నటిస్తే, చివరికి నేనెవర్నో నేనే మర్చిపోతాను. నేనింతే... ఒప్పుకుంటే ఒప్పుకోండి.. లేకపోతే లేదనుకుంటాను.
ఫైనల్లీ ఓ ప్రశ్న.. మీ లవ్ మ్యారేజ్‌ని పెద్దలు అంగీకరించారా? లేకపోతే కొన్ని సినిమాల లవ్‌స్టోరీలా రిస్కులు చేయాలా?
నో రిస్క్. పెద్దవాళ్లు ఒప్పుకున్నారు.  సో.. లవ్ లైఫ్‌కి శుభం కార్డే అన్నమాట..  యస్ (నవ్వుతూ).
సమంతతో నటించిన పెళ్లి కాని తెలుగు యువ హీరోలు వీరే.  ఎనీ గెసెస్‌స్స్...!

 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

లవ్ రాజు ఎవరో..!

- 2021 నాటికి కనుమరుగు కానుందని అంచనా - వాటి స్థానంలో ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ సాధనాలు - ‘ఎరిక్‌సన్’ సర్వేలో అధిక శాతం ప్రజల అభిప్రాయం

 ఇంకో ఐదేళ్లలో స్మార్ట్‌ఫోన్లు అనేవి లేకుండా పోతాయా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) ఆధారంగా పనిచేసే సాధనాలు రానున్నాయా.. అవుననే అంటోంది స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఎరిక్‌సన్. కొంతకాలం జపాన్‌కు చెందిన సోనీతో కలసి ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్లు తయారు చేసింది. ప్రస్తుతం ‘కన్జూమర్ ల్యాబ్స్’ అనే మరో సంస్థను నడుపుతోంది. వినియోగదారుల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులను గుర్తించడమే ఈ సంస్థ లక్ష్యం. దాదాపు 40 దేశాలకు చెందిన లక్ష మందిపై సర్వే చేసి ఇటీవలే 2016కు సంబంధించిన అంచనాలను విడుదల చేసింది. 2021 నాటికల్లా స్మార్ట్‌ఫోన్లు ఉండకపోవచ్చని సర్వేలో తేల్చింది. సగానికి పైగా ప్రజలు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారని ఎరిక్‌సన్ పేర్కొంటోంది. ఈ సర్వేలోని మరికొన్ని విశేషాలు..

నిర్ణయాల్లోనూ ‘స్మార్ట్’..
 ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల ద్వారా ఇంటర్నెట్ వాడకం విస్తృతమైంది. వ్యక్తులు తీసుకునే నిర్ణయాల్లోనూ ఇంటర్నెట్ ప్రభావం ఎక్కువవుతోందట. ఉదాహరణకు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు అక్కడ ఏ హోటల్ బాగుందో తెలుసుకునేందుకు గతంలో అయితే ఎవరైనా తెలిసిన అడిగేవారు. ఇప్పుడు మాత్రం ఆయా హోటళ్లపై ఇంటర్నెట్‌లో వచ్చిన రివ్యూలను ఎక్కువగా నమ్ముతున్నారు. స్మార్ట్‌ఫోన్ లేని వారు కూడా వివిధ వెబ్‌సైట్ల ద్వారా తుది నిర్ణయాలు తీసుకుంటున్నారు.

యూట్యూబ్‌లో గంటల కొద్దీ..
 ఈ కాలం యువత ముఖ్యంగా 16 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారిలో 20 శాతం మంది రోజుకు కనీసం 3 గంటల పాటు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారని ఎరిక్‌సన్ స్పష్టం చేసింది. ఐదేళ్ల కింద ఇది 7 శాతం మాత్రమే ఉండేది.

ఇటుక, కాంక్రీట్.. అన్నిట్లో సెన్సర్లు..
 ఇంటి నిర్మాణానికి వాడే ఇటుకలు, కాంక్రీట్‌లోనూ భవిష్యత్‌లో సెన్సర్లు ఇమిడ్చే అవకాశం ఉందని దాదాపు 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీంతో నిర్మాణ లోపాలే కాకుండా నీటి లేకేజీ, చెమ్మ, విద్యుత్ సంబంధిత సమస్యలను కూడా ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఐదేళ్లలో ఇళ్లలో గాలి, తేమ శాతం, ఉష్ణోగ్రతలు నియంత్రించే సాంకేతికతలు అందుబాటులోకి వస్తాయని చాలామంది అభిప్రాయపడ్డారు.

వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఎమర్జెన్సీ నంబర్లు..
 అత్యవసర పరిస్థితుల్లో 108 లేదా 100 నంబర్లకు ఫోన్ చేయడం మనకు తెలిసిన విషయమే. అయితే రానున్న మూడేళ్లలో ఈ పరిస్థితి మారే అవకాశముందని, ఎమర్జెన్సీ సమయంలో వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించడం సర్వసాధారణమవుతుందని అధిక శాతం మంది నమ్ముతున్నారు.

ఆరోగ్యంపై నిఘా..
 ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకునేందుకు ఫిట్‌బిట్, స్మార్ట్‌ఫోన్ యాప్ వంటి వాడకం ఇటీవల పెరిగిపోయింది. అయితే భవిష్యత్‌లో ‘ఇంటర్నబుల్స్’ రంగంలోకి రానున్నాయి. చిన్న సైజులో ఉండే ఈ హైటెక్ పరికరాలు శరీరంలోని వివిధ భాగాల్లో ఉంటూ ఆరోగ్య స్థితిపై నిత్యం నిఘా వేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ పరికరాలు ఇప్పటికే పరిశోధన దశలు దాటి వాణిజ్యపరంగా రూపుదిద్దుకుంటున్నాయి. 
 
click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

ఇక స్మార్ట్‌ఫోన్‌కు బై బై....!

సందేహం
నా వయసు 20. ఐదు నెలల క్రితం పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయని స్కాన్ చేయించుకుంటే ఓవరీస్‌లో సిస్ట్ ఉందని తేలింది. రెండు నెలలు ట్యాబ్లెట్స్ వేసుకుంటే సెట్ అయింది. నేను నెలక్రితం మా బావతో అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్‌లో పాల్గొన్నాను. ఒకే నెలలో నాలుగుసార్లు కలిశాం. కానీ మూడుసార్లు మాత్రం పిల్ వేసుకున్నాను. చివరి పిల్ వేసుకున్న వారం తర్వాత లైట్‌గా బ్లీడింగ్ కనిపించింది. కానీ ఇంతవరకు పీరియడ్స్ రాలేదు. నాకు భయంగా ఉంది, సలహా ఇవ్వండి?                                                                    
- ఓ సోదరి, పేరు రాయలేదు

ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అనేది ఎప్పుడో ఒకసారి సంరక్షణ లేకుండా కలిస్తే గర్భం రాకుండా ఉండటానికి వాడేది. అంతేకానీ నెలలో మూడుసార్లు కలిస్తే ప్రతిసారీ వాడటానికి కాదు. అయినా ఈ పిల్ కేవలం 70-80 శాతం మాత్రమే గర్భం రాకుండా అడ్డుకుంటుంది, 100 శాతం కాదు. ఇంకా పీరియడ్ రాలేదు కాబట్టి, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ ఉందేమో నిర్ధారించుకోండి. ఒకవేళ అది ప్రెగ్నెన్సీ అయితే వెంటనే మీ బావతో, ఇంట్లో పెద్దవాళ్లతో చర్చించుకొని పెళ్లి చేసుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీ కాకపోతే స్కానింగ్ చేయించుకొని మళ్లీ ఓవరీలో సిస్ట్ ఏమైనా తయారయ్యిందా అని తెలుసుకోండి. దాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. అయినా పెళ్లికి ముందు ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం మంచిదికాదు.
 
నా వయసు 25, మా వారి వయసు 30. మాకు పెళ్లై సంవత్సరం అయింది. ఇంకా పిల్లలు లేరు. మేము రెగ్యులర్‌గా కలుస్తూనే ఉన్నాం. కానీ కలిసిన వెంటనే నేను యూరిన్‌కు వెళ్లాల్సిన వస్తోంది. దాంతో మా వారి వీర్యం బయటికి వచ్చేస్తోంది. మేం కలిసిన ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. వారి వీర్యం నా లోపల అసలు ఉండటం లేదు. అందుకే పిల్లలు కావడం లేదేమో అని సందేహంగా ఉంది. అది నిజమేనా? కాకపోతే కారణమేమిటో దయ చేసి చెప్పండి. మరో విషయం.. నాకు పీరియడ్స్ రెగ్యులర్‌గా అవుతాయి.  కడుపు నొప్పి వస్తుంది.                  
- కె.లహరి, రాజమండ్రి

కలయిక తర్వాత విడుదలైన వీర్యం యోని భాగంలో చేరుతుంది. వీర్యంలో కళ్లకు కనిపించని సూక్ష్మమైన వీర్యకణాలతో పాటు ఎక్కువ భాగం పల్చటి ద్రవం ఉంటుంది. ఒక్కొక్కరికి 2ml నుంచి 7ml వరకు యోనిలోకి విడుదల అవుతుంది. వీర్యంలో ఉన్న వీర్యకణాలకు మాత్రమే కదిలే గుణం ఉంటుంది. కాబట్టి అవి యోనిలో నుంచి సన్నటి గర్భాశయ ముఖ ద్వారం (సర్విక్స్) ద్వారా గర్భాశయంలోకి, తద్వారా ఫాలోపియన్ ట్యూబ్స్‌లోకి ప్రవేశిస్తాయి. అక్కడ అండంలో ఫలదీకరణ చెందటం వల్ల గర్భం వస్తుంది. యోనిలో ఉన్న వీర్యం గర్భాశయంలోకి వెళ్లదు. అది ఎక్కువగా విడుదల అయినప్పుడు వెంటనే లేదా మెల్లమెల్లగా బయటకు వచ్చేస్తుంది. కొందరిలో జెల్‌లాగా జిగురుగా తయారై ఉదయం బయటకు వచ్చేస్తుంది.

వీర్యంలో ఉండే వీర్యకణాలకు చాలా వేగంగా గర్భాశయంలోకి ప్రవేశించే గుణం ఉంటుంది. కాబట్టి మీరు దీనివల్ల పిల్లలు కావట్లేదని కంగారు పడనవసరం లేదు. కలిసే ముందు మీ నడుము కింద దిండు పెట్టుకుంటే, వీర్యం ఎక్కువసేపు యోనిలో ఉంటుంది. దాంతో ఎక్కువ కణాలు లోపలికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. అలాగే పీరియడ్స్‌సమయంలో కడుపునొప్పి కొందరిలో ఆ సమయంలో విడుదలయ్యే హార్మోన్స్ మోతాదును బట్టి, శరీరతత్వాన్ని బట్టి ఉంటుంది. చాలా తక్కువమందిలో మాత్రమే గర్భాశయంలో గడ్డలు, ఎండోమెట్రియోసిస్ వంటి కొన్ని సమస్యల వల్ల పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి వస్తుంది. మీకు ఏడాదైనా గర్భం రాకపోవడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
నా వయసు 24. నాకు మా బావతో పెళ్లి కుదిరింది.  నాకు స్కిన్ ప్రాబ్లమ్ ఉంది. చలికాలంలో అయితే చర్మం బాగా పగిలిపోతుంది. మా అమ్మకు కూడా ఈ సమస్య ఉంది కానీ, ఆమెకు త్వరగా తగ్గిపోతుంది. నాకు మాత్రం ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది.  నాకు పుట్టబోయే పిల్లలకు కూడా ఈ సమస్య వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. మా బావను చేసుకుంటే పిల్లలు సరిగా పుట్టరని నా ఫ్రెండ్స్ అంటున్నారు. అలా అయితే ఈ స్కిన్ ప్రాబ్లమ్ కచ్చితంగా నా పిల్లలపై ప్రభావం చూపుతుందా?                                                                                      
 - ఓ సోదరి, పేరు రాయలేదు

చలికాలంలో చర్మం పగలడం అనేది వారివారి శరీరతత్వాన్ని బట్టి చాలా మందికి ఉంటుంది. అది మీ అమ్మకి కూడా ఉంది కాబట్టి మీకు పుట్టబోయే బిడ్డకు వస్తుందా, లేదా అనేది చెప్పలేం. చర్మానికి సంబంధించిన జన్యుపరమైన సమస్యలు కొన్ని వంశపారం పర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కేవలం చలికాలంలో చర్మం పగలడం అనేది సాధారణమే. కాకపోతే మీ బావకు అంటే మేనరికపు పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి అతనిలో కూడా ఏమైనా చర్మ సమస్యలు ఉండి, అవి కూడా జన్యుపరమైనవే అయ్యుంటే, అవి మీకు పుట్టబోయే బిడ్డకు సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకానీ కచ్చితంగా వస్తుందని చెప్పడం కష్టం.

మేనరికపు పెళ్లిళ్ల వల్ల చర్మ సమస్యలు ఒక్కటే కాకుండా మీ ఇరువురి కుటుంబాల్లో ఏవైనా జబ్బులు, మానసిక, శారీరక సమస్యలు ఉన్నా, లేకపోతే కొన్నిరకాల జన్యువుల్లో లోపాలు ఉంటే అవి మీకు పుట్టబోయే బిడ్డకు వచ్చే అవకాశాలు ఎక్కువ. మేనరికం కాని పిల్లలకు అవయవ, జన్యులోపాలు 2-3 శాతం ఉంటే, మేనరికం ద్వారా పుట్టే పిల్లలకు ఆ సమస్యలు రెట్టింపు ఉంటాయి. ఒకసారి మీరు, మీ బావ జెనెటిక్ కౌన్సిలింగ్‌కు వెళ్లడం మంచిది. దీని ద్వారా మీ సమస్యలు, కుటుంబంలో ఉండే సమస్యలను ఆధారంగా చేసుకొని, మీకు పుట్టబోయే పిల్లల్లో సమస్యలు ఎంతవరకు రావచ్చో జెనిటిక్ కౌన్సెలర్ ఒక అంచనా వేసి చెబుతారు.
- డా.వేనాటి శోభ

click the below image to get a best deal:: 

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

తప్పు చేశాను... భయమేస్తోంది

ఎంసెట్ మెడికల్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన హేమలత

 విజయవాడ(గుణదల)/కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రతిభకు ఆర్థిక స్థితిగతులు అడ్డంకి కాదని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిని రుజువు చేసింది. బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసే ఓ సాధారణ వ్యక్తి కుమార్తె ఎంసెట్-2016 మెడికల్ విభాగంలో తొలి ర్యాంకు సాధించి స్ఫూర్తిదాయకం గా నిలిచింది. శనివారం విడుదలైన ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో కర్నూలు జోహరాపురానికి చెందిన మాచాని హేమలత మొదటి ర్యాంకు సాధించింది. కర్నూలులోని శ్రీనివాస క్లాత్ స్టోర్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న మాచాని వీరన్న, చంద్రకళ దంపతుల రెండో కుమార్తె హేమలత. తన ముగ్గురు బిడ్డ లు చదువులో ఆణిముత్యాలని చెప్పారు. తన సంతానాన్ని ఉన్నత స్థానంలో నిలపడానికి నిరంతరం శ్రమిస్తున్నానని వీరన్న తెలిపారు.

 నాన్న కల నెరవేర్చిన హేమలత
 మాచాని వీరన్న, చంద్రకళ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. పెద్ద కుమార్తె సౌజన్య ప్రస్తుతం మహానందిలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతోంది. రెండో కుమార్తె హేమలత ఎంసెట్ మెడిసిన్‌లో స్టేట్ ఫస్టు ర్యాంకు సాధించింది. వీరిద్దరూ కర్నూలులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఇక మూడో కుమార్తె విజయశ్రీ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. తన ముగ్గురు కుమార్తెల్లో ఒక్కరినైనా డాక్టర్‌గా చూడాలనుకున్నారు మాచాని వీరన్న. ఎన్నో వ్యయప్రయాలసకోర్చి పిల్లలను చదివించారు. రెండో తనయ మాచాని హేమలత ఎంసెట్‌లో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించి తండ్రి కలను సాకారం చేసింది.

 2015లో 248వ ర్యాంకు
 2015 ఎంసెట్ మెడికల్‌లో మాచాని హేమలత మొదటి ప్రయత్నంలోనే 248వ ర్యాంకు సాధించింది. అయితే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. నిర్దేశిత వయసుకు 28 రోజులు తక్కువగా ఉండడంతో ఆమె అప్పట్లో వైద్య విద్యలో ప్రవేశం పొందలేకపోయింది.  

 న్యూరో సర్జన్ అవుతా
 ‘చాలా ఆనందంగా ఉంది. రోజుకు పన్నెండు గంటలు కష్టపడేదాన్ని. నిరంతరం పుస్తకాలతోనే దోస్తీ చేసేదాన్ని. తల్లిదండ్రుల కల నెరవేర్చడానికి నిరంతరం కష్టడుతూనే ఉంటా. న్యూరోసర్జన్ కావాలన్నది చిరకాల కోరిక. నా విజయం వెనుక మా తల్లిదండ్రులు, అధ్యాపకుల కృషి చాలా ఉంది. ఇంటర్మీడియెట్‌లో 985 మార్కులు వచ్చాయి’ అని హేమలత చెప్పింది.

 ర్యాంకర్ల మనోగతం
 న్యూరాలజిస్ట్‌నవుతా...
 మాది రంగారెడ్డి జిల్లా కొత్తగూడ, నాన్న నరేంద్రరెడ్డి న్యాయవాది. అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచి డాక్టర్‌ను కావాలనే ఆకాంక్షతో ఇంటర్‌లో బైపీసీలో చేరాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల శిక్షణతో రెండో ర్యాంకు సాధించాను. న్యూరాలజిస్ట్ కావాలనేది నా ఆశయం.
     - ఎర్ల సాత్విక్‌రెడ్డి, రెండో ర్యాంకర్

 తల్లిదండ్రుల ప్రోత్సాహం...
 సైదాబాద్‌కు చెందిన మా నాన్న సత్యనారాయణరెడ్డి సివిల్ ఇంజనీర్. నా అభీష్టం మేరకు ఇంటర్ బైపీసీలో చేర్పించారు. ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంతటి విజయం సాధించా. న్యూరాలజిస్ట్ లేదా కార్డియాలజిస్ట్‌గా ప్రజలకు సేవ చేయాలనేది నా ఆకాంక్ష.    
 - ఎ.యజ్ఞప్రియ, మూడో ర్యాంకర్

 నగర కుర్రాడి సత్తా
 ఏపీ ఎంసెట్ మెడికల్‌లో నగరానికి చెందిన ఇక్రంఖాన్ సత్తా చాటాడు. 160 మార్కులు152 మార్కులు సాధించి ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. నారాయణగూడ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదివిన ఇక్రం ఎంపీసీలో 987 మార్కులు సాధించాడు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయడమే తన లక్ష్యమని ఇక్రంఖాన్  తెలిపాడు.

 కార్డియాలజిస్ట్‌నవుతా
 బోయినపల్లికి చెందిన ఎస్.సాహితి సావిత్రి ఎస్‌ఆర్‌నగర్ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివింది. మెడిసిన్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. 160కు 152 మార్కులు తెచ్చుకుంది. ఇంటర్‌లో 982 మార్కులు సాధించింది. ఆమె తండ్రి రమణ ఐఎస్‌బీ లో, తల్లి దీప్తి సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కార్డియాలజిస్టునయ్యి సేవలందించాల న్నది తన ఆకాంక్షని సాహితి తెలిపింది.
 click the below image to ge a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

గుమాస్తా కుమార్తె టాపర్...!!!

May 21, 2016

రామ్ గోపాల్ వర్మ పిల్లి అనగానే ఆయన పెంచుకుంటున్న పిల్లి అనుకుంటే పొరపాటే. ఈ పిల్లి హావభావాలు చూస్తే వర్మ దీనితో సినిమా చేసినాచేస్తాడు. ఎందుకంటే దానికో కారణం ఉంది. చాలామందికి హారర్ చిత్రాలు చూడటమంటే ఎంతో ఇష్టం. కొంతమంది భయపడుతూనే సగం కళ్లతో దెయ్యాల సినిమాలు చూస్తుంటారు. ఆ సమయంలో వారి ముఖంలో కనిపించే హావభావాలు చూడాలి.... ఆ కళే వేరు. అంత భయపడుతూ చూడటం ఎందుకని అడిగితే ఇష్టమని సమాధానం చెబుతారు. అయితే ఇదంతా ఇప్పుడెందుకంటే దానికి కారణం లేకపోలేదు. మనుషులు దెయ్యాల సినిమాలు చూసి భయపడటం సహజం. ఒక పిల్లి హారర్ సినిమా చూసి భయపడితే ఎలా ఉంటుంది. ఇలాంటి ఆలోచనే చేశారు కొంతమంది. వెంటనే పిల్లిని ఒంటరిగా కూర్చోబెట్టి టీవీలో దెయ్యాల సినిమా వేసి చూపించారు. ఆ పిల్లి పెర్ఫామెన్స్ చూస్తే ఔరా అనాల్సిందే. ఆ వీడియోను మీరూ చూడండి.

 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

రామ్ గోపాల్ వర్మ పిల్లి చుడండి...?

కొంతమంది యువత డిగ్రీ చేసిన వెంటనే మాస్టర్స్‌ చేయాలనుకోరు. కాలేజీ నుంచి బయటకు రాగానే తమ కాళ్లమీద తాము నిలబడాలనుకుంటారు. ఇలాంటి వారికి కేవలం గ్రాడ్యుయేషన్‌ చేస్తే జాబ్‌ రాదు. వీళ్లు ఏదైనా షార్ట్‌టర్మ్‌ కోర్సులపై దృష్టిసారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే కాలేజిలో డిగ్రీ చేసి బయటకు రాగానే ఉద్యోగం సంపాదించుకోవడానికి షార్ట్‌ టర్మ్‌ కోర్సులు బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిప్లొమా లేదా సర్టిఫికేట్‌ కోర్సులు చేస్తే ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ కోర్సుల వివరాలు...
 
డిజిటల్‌ మార్కెటింగ్‌

అర్హత:
ప్లస్‌ టు/అండర్‌గ్రాడ్యుయేషన్‌
కాలపరిమితి: 4-8 నెలలు
ఉద్యోగ అవకాశాలు: ఎస్‌ఇవొ ఎగ్జిక్యూటివ్‌, సోషల్‌ మీడియా ఎక్స్‌పర్ట్‌, ఇంటర్‌నెట్‌ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, సోషల్‌మీడియా మార్కెటింగ్‌, సర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌
ఇన్‌స్టిట్యూట్స్‌: ది ఇన్‌ష్టిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అకౌంట్స్‌ (ఐసిఎ), కోల్‌కత వెబ్‌ అకాడమీ, ఎన్‌ఐఐటి, ఇండస్‌ నెట్‌ అకాడమీ
ప్రారంభ జీతం: నెలకు రూ.20,000 నుంచి రూ.35,000
 
నెట్‌వర్క్‌ ఇంజనీర్‌
అర్హత: ప్లస్‌ టు, హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ గురించి ప్రాథమిక జ్ఞానం అవసరం
కాలపరిమితి: 2-15 నెలలు
ఉద్యోగ అవకాశాలు: డేటాబేస్‌ అడ్మినిసే్ట్రటర్‌, నెట్‌వర్కింగ్‌ అడ్మినిసే్ట్రటర్‌, ఎల్‌ఎన్‌ (లాన్‌) ఇంజనీర్‌, సెక్యూరిటీ అడ్మినిసే్ట్రటర్‌, వెబ్‌ సర్వర్‌ అడ్మినిసే్ట్రటర్‌
ఇన్‌స్టిట్యూట్స్‌: ఓరియన్‌ ఎడ్యుటెక్‌, యాప్‌టెక్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎథికల్‌ హాకింగ్‌
ప్రారంభ జీతం: నెలకు రూ.15,000 నుంచి రూ.35,000

డేటా మైనింగ్‌
అర్హత: ప్లస్‌ టు
కాలపరిమితి: 2-10 నెలలు
ఉద్యోగ అవకాశాలు: బిజినెస్‌ ఎనలిస్టు, డేటా సైంటిస్టు, డేటా ఎనలిస్టు
ఇన్‌స్టిట్యూట్స్‌: జిగ్‌సా అకాడమీ, అప్‌గ్రేడ్‌, ఎడ్యురేక, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌.
ప్రారంభ జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.80,000

అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌
సర్టిఫైడ్‌ ఇండస్ట్రియల్ అకౌంటెంట్‌ కోర్సులో శాప్‌ మాడ్యూల్స్‌, టాలీ వంటి సాఫ్ట్‌వేర్‌ అడ్వాన్స్‌డ్‌ ఎంఎస్‌ ఎక్సెల్‌ వంటివి ఉంటాయి.
అర్హత: ప్లస్‌ టు
కాలపరిమితి: 8-18 నెలలు
ఉద్యోగ అవకాశాలు: ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌, కమర్షియల్‌ మేనేజర్‌
ఇన్‌స్టిట్యూట్స్‌: ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అకౌంట్స్‌, ఎన్‌ఐఐటి, యాప్‌టెక్‌
ప్రారంభజీతం: నెలకు రూ.8,000 నుంచి రూ.30,000

వెబ్‌ డిజైనింగ్‌
అర్హత: ప్లస్‌ టు
కాలపరిమితి: 4-24 నెలలు
ఉద్యోగ అవకాశాలు: గ్రాఫిక్‌- వెబ్‌ డిజైనర్‌, వెబ్‌-యానిమేషన్‌, వెబ్‌ డెవలెపర్‌, పిహెచ్‌పి, సిఎస్‌ఎస్ డెవలెపర్‌, మల్టీమీడియా డిజైనర్‌.
ఇన్‌స్టిట్యూట్స్‌: డిక్యూ స్కూల్‌ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్స్‌, ఎరెనా యానిమేషన్‌, మాయా అకాడమీ ఆఫ్‌ ఆడ్వాన్స్‌డు సినిమాటిక్స్‌ (ఎంఎఎసి), మాగ్‌డిసాఫ్ట్‌.
ప్రారంభజీతం: నెలకు రూ.10,000 నుంచి రూ. 15,000

సైబర్‌ సెక్యూరిటీ
అర్హత: ప్లస్‌ టు, సాఫ్ట్‌వేర్‌, డేటాబేస్‌, నెట్‌వర్కింగ్‌లలో ప్రాథమిక అవగాహన అవసరం.
కాలపరిమితి: 2-15 నెలలు
ఉద్యోగ అవకాశాలు: పెనిట్రేషన్‌ టెస్టర్‌, సెక్యూరిటీ ఎనలిస్ట్‌, ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, క్రిప్టోగ్రాఫర్‌, సెక్యూరిటీ స్పెషలిస్ట్‌, వల్‌నరబిలిటీ ఎసెసర్‌...
ఇన్‌స్టిట్యూట్స్‌: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌, మైక్రోప్రో, మెర్క్యురీ కోనిగ్‌ సొల్యూషన్స్‌, మెర్క్యురీ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌.
ప్రారంభ జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 

 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

ఐటిలో అవకాశాలెన్నో..

విరుధునగర్: కూతురు ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. స్టేట్ లెవెల్ ర్యాంక్ కూడా వచ్చింది. తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ వారికి ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. స్టేట్ లెవెల్ ర్యాంకు సాధించిన సెల్వీని ఇంటర్వ్యూ చేస్తానంటూ ఓ వ్యక్తి టీవీ రిపోర్టర్‌ పేరుతో ఇంటికి వచ్చాడు. సాధారణంగా ర్యాంకర్స్‌ను ఇంటర్వ్యూ చేయడానికి టీవీ చానెల్స్ వాళ్లు వస్తుంటారు కదా... ఇతను కూడా అలా వచ్చిన వాడే అని తల్లితండ్రులు భ్రమ పడ్డారు. ఆ వ్యక్తి సెల్వీని ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ అయిపోగానే సెల్వీ తల్లిదండ్రులను పిలిచి వారికి ఓ విషయం చెప్పాడు. సెల్వీ ర్యాంకు సాధించినందుకు కలెక్టరేట్ నుంచి 50వేలు ఇస్తారని నమ్మబలికాడు. సెల్వీని తన వాహనంపై ఎక్కించుకుని వెళ్లాడు. ఆమె తల్లిదండ్రులు బస్సులో కలెక్టరేట్‌కు వెళ్లారు.
 
కానీ వారికి అక్కడే అనుకోని సంఘటన ఎదురైంది. ఆ పేరుతో ఇక్కడకు ఎవరూ రాలేదంటూ కలెక్టరేట్ సిబ్బంది చెప్పారు. దీంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. సదరు టీవీ చానెల్‌కు వెళ్లి విచారించారు. విజయ్ ఆనంద్ అనే పేరుతో ఎవరూ లేరని చానెల్ యాజమాన్యం తెలిపింది. దీంతో అసలు విషయం అర్థమైంది. తమ కూతురు కిడ్నాప్ అయిందన్న విషయం తెలిసి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెల్వీ ఫోన్‌కు కాల్ చేయగా అందుబాటులో లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులోని విరుధునగర్‌లో జరిగింది.
 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

టీవీ రిపోర్టర్‌నంటూ ఇంటికి వచ్చాడు... ఇంటర్వ్యూ చేస్తానంటూ.?

కొన్ని కోట్ల సంవత్సరాల కింద అంగారకుడిని రెండు భారీ ఉల్కలు ఢీకొనడం వల్ల దానిపై రెండు సునామీలు సంభవించాయని తాజా పరిశోధనలో తేలింది. దాదాపు 340 కోట్ల సంవత్సరాల కింద భారీ ఉల్కలు ఢీకొనడం వల్ల తొలిసారి సునామీ అల ఏర్పడిందని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుడు అల్బర్టో ఫెయిరెన్ తెలిపారు. ద్రవరూపంలోని నీరు వల్లే ఈ అల ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే మరో భారీ ఉల్కా విస్ఫోటం వల్ల రెండో సునామీ చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు ఆధారాలను కనుగొన్నారు.
 ఈ రెండు సునామీలకు మధ్య ఉన్న లక్షల సంవత్సరాల కాలం పాటు అంగారకుడు అతి శీతల స్థితిలోకి వెళ్లిపోయాడని గుర్తించారు. ఆ సమయంలోనే అక్కడి నీరు ఘనీభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా అక్కడి సముద్రతీరం ప్రాంతంలోని నీరు చాలా వెనక్కి వెళ్లడం ద్వారా రెండో సముద్రతీరం ఏర్పడిందని భావిస్తున్నారు. రెండో సునామీ సంభవించిన సమయంలో సముద్రంలోని మంచు ఎగిరి చాలా దూరంలో పడిపోయిందని, ఇది తిరిగి సముద్రంలోకి రాలేదని ఫెయిరెన్ పేర్కొన్నారు. అంగారకుడు ఏర్పడిన తొలినాళ్లలో చాలా చల్లటి సముద్రాలు ఉండేవని స్పష్టం చేశారు.
click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

340 కోట్ల ఏళ్ల కింద తొలి సునామీ

ఓ ప్రముఖ కంపెనీ మాజీ సీఈవో చేసిన పని ఇప్పుటు హాట్ టాపిక్ గా మారింది. ఫియట్ కంపెనీ మాజీ సీఈవో లాపో ఎల్కన్ తన పక్కనే నిల్చున్న హీరోయిన్ ఉమా థర్మన్ ను దగ్గరకు లాక్కుని గాఢంగా ముద్దుపెట్టుకున్నారు. చారిటీ కార్యక్రమంలో ఇలాంటి దిగజారుడు పనులు వ్యాపార దిగ్గజం చేయడంపై అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ఎయిడ్స్ రీసెర్చ్ వారు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఉమా థర్మన్ సంయుక్తంగా ఈవెంట్ నిర్వహించారు. ఎయిడ్స్ బాధితులకు సహాయార్థం విరాళాలు సేకరించేందుకు ఏర్పాటుచేసిన ఈవెంట్ లో ఫ్యాషన్ షో టిక్కెట్లు కూడా విజేతలకు అందజేశారు.
విక్టోరియా ఫ్యాషన్ షోకు సంబంధించి ఆయన 1.32 కోట్ల రూపాయలు (1.96 లక్షల అమెరికా డాలర్లు) గెలుపొందారు. దీంతో తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఓ వింత మార్గాన్ని ఎంచుకున్నారు. ఈవెంట్ నిర్వహిస్తోన్న నటి థర్మన్ ను దగ్గరికి ఆమెతో లాక్కుని బలవంతంగా లిప్ లాప్ చేశారు. ఊహించని ఘటనతో ఆమె షాక్ కు గురైనా వెంటనే కోలుకుంది. ముద్దుపై స్పందించలేదు కానీ, తీవ్ర అసహనానికి గురైనట్లు మాత్రం తెలుస్తోంది. స్మోక్ చేస్తున్న ఎల్కన్ అవకాశవాది అని అందుకే అవకాశాన్ని వాడుకున్నాడని లెస్సీ స్లోనే అనే ఆర్గనైజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్మన్ కూడా ముద్దు విషయంపై హ్యాపీగా లేదని చెప్పింది. ఆమె అనుమతి లేనిదే ఇలాంటి దిగజారుడు చర్యకు ఇటలీ వ్యాపారవేత్త సాహసించాడంటూ మండిపడింది.
 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

ప్రముఖ కంపెనీ సీఈవో ఇలా చేశాడేంటి..!

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

All In One Store © 2015 - Designed by K. Mahesh Babu