న్యూఢిల్లీ : పొగరాయుళ్ళకి ఇది కాస్తంత చింత కలిగించే విషయమే. సిగరెట్ ప్యాకెట్లపై ఉత్పత్తి సంస్థలన్నీ ‘‘పొగాకు వినియోగం ఆరోగ్యానికి హానికరం’’ అనే హెచ్చరికను ‘‘ఒక బొమ్మతో సహా’’ స్పష్టంగా కనిపించేలా ముద్రించాలన్న ప్రభుత్వ ఆదేశాలను తోసి రాజంటూ ఐటిసి, గాడ్‌ఫ్రే ఫిలిప్స్, విఎ్‌సటి వంటి కంపెనీలు సిగరెట్ ఉత్పత్తినే నిలిపివేయనున్నట్టు ప్రకటించాయి. ఆ అంశంపై స్పష్టత వచ్చే వరకు తాము సిగరెట్లు ఉత్పత్తి చేయబోమని మొండికేశాయి. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం పొగాకు ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలన్నీ ప్యాకెట్‌పై 85 శాతం స్థలం ఆక్రమించే విధంగా పెద్ద బొమ్మతో కూడిన హెచ్చరిక ముద్రించాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలులోకి వచ్చింది. ఈ అంశం కోర్టు పరిశీలనలో ఉండగా దాన్ని అమలు చేయాలని నోటిఫై చేయడం ఎంత వరకు న్యాయబద్ధమని ఐటిసి ప్రశ్నిస్తోంది. పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక ఒక బొమ్మతో సహా పెద్దగా ముద్రించేందుకు అవసరమైన పరికరాలు, సిలిండర్ల కొనుగోలు కోసం పెద్ద ఎత్తున వనరులు దుర్వినియోగం చేయాలని తాము భావించడంలేదని కంపెనీ పేర్కొంది. ఆ విధానానికి మారడం చాలా శ్రమతో కూడుకున్న అంశమని, ఇందుకు సిద్ధం కావడానికి కొన్ని నెలల వ్యవధి పడుతుందని కూడా పేర్కొంది. ప్రస్తుతానికైతే తాము ఆ హెచ్చరికను పెద్దగా ముద్రించేందుకు సిద్ధంగా లేమంటూ బిఎ్‌సఇకి పంపిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కారణంగా తాము ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే సిగరెట్ తయారీ ఫ్యాక్టరీలను మూసివేసినట్టు తెలియచేసింది. ఐటిసి బెంగళూరు, ముంగేర్, సహరాన్‌పూర్, కోల్కతా, పూణె ఫ్యాక్టరీల్లో ఇండియా కింగ్స్, క్లాసిక్, గోల్డ్‌ఫ్లేక్, నేవీకట్, కాప్‌స్టన్, బ్రిస్టల్, ఫ్లేక్, సిల్క్‌కట్ వంటి ప్రముఖ బ్రాండ్ల సిగరెట్లు తయారుచేస్తుంది. 2014-15లో కంపెనీ వివిధ ఉత్పత్తుల అమ్మకాల విలువ 38,433.31 కోట్ల రూపాయలుండగా అందులో 46.22 శాతం (17,765.99 కోట్లు) సిగరెట్ల అమ్మకాల ద్వారానే వచ్చింది. ఐటిసి, గాడ్‌ఫ్రే ఫిలిప్స్, విఎ్‌సటి వంటి సంస్థలు సభ్యులుగా ఉన్న టుబాకో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తమ సభ్యులందరూ ఈ నిబంధనపై స్పష్టత కోరుతూ సిగరెట్ల ఉత్పత్తిని నిలిపివేసినట్టు ప్రకటించింది. దీని వల్ల దేశంలో సుంకాలు చెల్లించే సిగరెట్ల తయారీలో 98 శాతం వాటా ఉన్న ఈ మూడు కంపెనీలకు రోజుకి 350 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంచనా. ఇదిలా ఉండగా ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి తీసు కువచ్చిన ప్రభుత్వం వెనక్కితగ్గేది లేదని ఒక ప్రకటనలో సిగరెట్ కంపెనీలను హెచ్చరించింది.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment