వెస్టిండీస్-ఇంగ్లండ్ అమీతుమీ
ఈడెన్ గార్డెన్స్‌లో అంతిమ పోరు నేడే
రెండో టైటిల్ కోసం ఇరు జట్ల ఢీ
ఎవరూ ఊహించలేదు ఇంగ్లండ్ ఫైనల్‌కు వస్తుందని..! ఎవరూ అనుకోలేదు.. కరీబియన్లు ఈ రకంగా ఆడతారని...! ఎవరూ కలగనలేదు.. భారత గడ్డపై టోర్నీలో ఉపఖండ జట్టు లేకుండానే టైటిల్ ఫైట్ జరుగుతుందని...! కానీ, అంచనాలకు అందకుండా.. ఊహలకు అతీతంగా ఈ రెండు జట్లూ ఇప్పుడు కప్పు ముంగిట నిలిచాయి..! కొండంత లక్ష్యాన్ని అయినా ఇట్టే కరిగించేసే మ్యాచ్ విన్నర్ల అండతో కరీబియన్లు.. ఆల్‌రౌండ్ బలంతో ఆంగ్లేయులు ఈ కప్పు మాదంటే మాదేనని అంటున్నారు..! హిట్టర్లకు కొదవలేని రెండు జట్లూ.. ప్రతిష్టాత్మక ఈడెన్ బ్యాటింగ్ పిచ్‌పై పరుగుల ‘అంతిమ’ సమరం చేసేందుకు సిద్ధమయ్యాయి..! మహామహులున్న జట్లను తోసి రాజని విశ్వపోరులో రెండోసారి ప్రపంచకప్ ముద్దాడి డబుల్ ధమాకా మోగించేందుకు మాజీ చాంపియన్లు సై అంటున్నాయి..! మరి ఆ ‘అద్వితీయ’ అవకాశాన్ని ఒడిసిపట్టేదెవరో..!
కోల్‌కతా: ప్రపంచకప్ సమరం క్లైమాక్స్‌కు చేరింది. మెగా టోర్నీలో కింగ్ ఎవరో, పొట్టి కప్పు వేటలో అద్వితీయ జట్టేదో తేలేది నేడే. టీ-20 వరల్డ్‌క్‌పను రెండోసారి హస్తగతం చేసుకొని రికార్డు సృష్టించేదెవరో మరికొద్ది గంటల్లో తెలిసిపోనుంది. అద్భుత పోరాటంతో ఫైనల్‌కు చేరుకున్న వెస్టిండీస్, ఇంగ్లండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి జరిగే టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మెగా టోర్నీకి ముందు ఈ రెండు జట్లపై అంచనాలే లేవు. కానీ, అంచనాలకు మించి రాణించి తుదిపోరుకు చేరుకున్నాయి. మరీ ముఖ్యంగా 2012 విజేత విండీస్ అసలు టోర్నీకి వస్తుందో లేదోనన్న అనుమానాలు నెలకొన్నాయి. కాంట్రాక్టు వివాదం కారణంగా తాము టోర్నీకి వెళ్లబోమని సీనియర్ ఆటగాళ్లు బోర్డుతో గొడవ పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఎంతో గందరగోళం మధ్య స్టార్ ప్లేయర్లు పొలార్డ్, నరైన్, డారెన్ బ్రావో లేకుండానే విండీస్ ఈ మెగా టోర్నీని ప్రారంభించింది. కానీ, ఆటగాళ్లు మాత్రం సమష్టిగా రాణించి జట్టును ఆఖరి మెట్టుపై నిలిపారు. గ్రూప్ దశలో అఫ్ఘాన్ చేతిలో ఓటమే టోర్నీలో విండీ్‌సకు తగిలిన ఎదురుదెబ్బ. అయితే సెమీ్‌సలో ఆతిథ్య టీమిండియాకు చెక్ పెట్టిన కరీబియన్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌క్‌పలో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన ఇంగ్లిష్ జట్టు ఫైనల్‌కు వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. పైగా, టోర్నీకి కొద్ది రోజుల ముందు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ 0-2తో టీ-20 సిరీ్‌సను, 2-3తో వన్డే సిరీ్‌సను కోల్పోయింది. కానీ, ఇప్పుడు అందరి అంచనాలను తలకిందులు చేసి కప్పు ముంగిట నిలిచింది. ఇయాన్ మోర్గాన్ కూల్ కెప్టెన్సీలో ఇంగ్లిష్ జట్టు పటిష్ట శక్తిగా అవతరించింది. కొంతకాలంగా పేలవ ప్రదర్శన అనంతరం ఇప్పుడు ఇంగ్లండ్ జట్టులో కొత్త శకం ఆరంభమైంది. గ్రూప్‌లో నాలుగింట మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన ఇంగ్లండ్.. టోర్నీలో అపజయమెరుగని న్యూజిలాండ్‌ను సెమీ్‌సలో మట్టికరిపించి అదరహో అనిపించింది. దీంతో ఇప్పుడు టైటిల్ నెగ్గడం రెండు జట్లకూ చారిత్రక అవసరంగా మారింది.
రికార్డులు విండీస్ వైపే..: ప్రస్తుత ప్రదర్శన దృష్ట్యా రెండు జట్లూ సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. కానీ, రికార్డులు మాత్రం విండీ్‌సవైపే ఉన్నాయి. 2010 టోర్నీ చాంపియన్ ఇంగ్లండ్‌తో ఆడిన 13 టీ-20ల్లో విండీస్ 9 మ్యాచ్‌ల్లో నెగ్గింది. అదే విధంగా ప్రపంచక్‌పలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ కరీబియన్లదే విజయం. పైగా, ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనూ కరీబియన్ల చేతిలో ఇంగ్లండ్ ఓడిపోయింది. ఇదే వేదికపై 1987 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో మైక్ గ్యాటింగ్ నేతృత్వంలోని ఇంగ్లండ్.. ఏడు పరుగులతో ఆసే్ట్రలియా చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు 29 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక మైదానంలో ఇంగ్లిష్ జట్టు మరో వరల్డ్‌కప్ ఫైనల్ ఆడనుంది. దీంతో ఈ సారి ఎలాగైనా కప్పును ఒడిసిపట్టుకోవాలని ఇంగ్లండ్ ఆటగాళ్లు కసిగా ఉన్నారు.
విండీస్‌లో అంతా విన్నర్లే..
ధనాధన్ ఫార్మాట్‌లో భారీ హిట్టింగ్‌ను చూసుకుంటే క్రిస్ గేల్‌ను మించిన విధ్వంసకర ఆటగాడు ఉండబోడు. ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్‌లోనే అజేయ సెంచరీ చేసిన గేల్ టోర్నీకే ఘనమైన ఆరంభాన్నిచ్చాడు. తన తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో అతను విఫలమైనా ఒక్క ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ, విండీస్ ఒక్కరి ప్రదర్శనపై ఆధారడడం లేదు. తమ జట్టులో ఉన్న 15 మందీ మ్యాచ్ విన్నర్లేనని డారెన్ సామి పదే పదే ఎందుకు చెబుతున్నాడో భారతతో సెమీస్ మ్యాచ్‌లో అందరికీ తెలిసింది. గేల్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరినా కరీబియన్లు భారీ లక్ష్యాన్ని ఛేదించారు. లెండిల్ సిమ్మన్స్ రూపంలో జట్టులోకి అసలైన హీరో వచ్చాడు. సిమ్మన్స్‌తో పాటు జాన్సన్ చార్లెస్, రస్సెల్ బాధ్యతను తీసుకొని జట్టును గెలిపించారు. విండీస్ తరపున చార్లెస్ టాప్ స్కోరర్ (116 రన్స్)గా కొనసాగుతున్నాడు. గేల్ ఫ్లాప్ అయిన మూడు మ్యాచ్‌ల్లోనూ విండీస్ గెలిచింది. క్రిస్, సిమ్మన్స్, చార్లెస్, మార్లోన్ శామ్యూల్స్‌తో విండీస్ టాపార్డర్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావో, కెప్టెన్ డారెన్ సామితో మిడిలార్డర్ దుర్బేధ్యంగా ఉంది. బ్రాతవైట్ కూడా ఽభారీ హిట్టింగ్ కూడా ఆడగల సమర్థుడు కావడం విండీస్ కు బలం.
సామిసేన సోసో..
టోర్నీలో విండీస్ బౌలర్లు ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణిస్తున్నందున వారికి ఆ అవసరం రాలేదు. విండీస్ తరపున రస్సెల్ అత్యధికంగా 8 వికెట్లు తీశాడు. డ్వేన్ బ్రావో ఆరు వికెట్లు పడగొట్టారు. స్పిన్ ద్వయం బెన్, బద్రీ ఆకట్టుకుంటోంది. లెగ్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. బెన్ నాలుగు వికెట్లే తీసినా, బద్రీతో కలిసి మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. భారతపై మిడిల్ ఓవర్లలో పరుగులు నియంత్రించిన బౌలర్లు విజయంలో కీలక పాత్ర పోషించారు.
బ్యాటింగ్..
ఇంగ్లండ్ బలమదే
బ్యాటింగ్ బలంతోనే ఇంగ్లండ్ టోర్నీలో ఇంత దూరం వచ్చింది. తొలి మ్యాచ్‌లో విండీస్ చేతిలో ఓడిపోయిన ఇంగ్లండ్ ఆ తర్వాత సౌతాఫ్రికాపై 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టోర్నీలో నిలిచింది. ముఖ్యంగా జో రూట్ 44 బంతుల్లో 83 పరుగులతో అద్భుతంగా రాణించి సఫారీపై జట్టును గెలిపించాడు. టోర్నీలో 145 స్ట్రయిక్ రేట్‌తో 195 పరుగులు చేసిన రూట్.. టోర్నీలో కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఓపెనర్లు జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాడు. బ్యాక్ ఫుట్‌పై అద్భుమైన సో్ట్రక్స్, సున్నితమైన డ్రైవ్స్‌తో బౌండ్రీలు రాబట్టే రాయ్ సెమీ్‌సలో న్యూజిలాండ్‌ను ఓడించడంలో హీరోగా మారాడు. రాయ్, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలిగే హార్డ్ హిట్టర్ జోస్ బట్లర్ బ్యాటింగ్ కన్నులవిందుగా ఉంటుంది. బట్లర్ శ్రీలంకపై 37 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు.
బౌలింగ్
మోర్గాన్ గ్యాంగ్‌దే పైచేయి
ఈ విభాగంలో ఇంగ్లండ్‌దే కాస్త పైచేయి. ముఖ్యంగా సెమీస్‌లో భారీస్కోరు చేసేలా కనిపించిన కివీ్‌సను తక్కువ స్కోరుకే కట్టడి చేయడం ఇంగ్లిష్ బౌలర్లలో ఆత్మవిశ్వాసం నింపేదే. తొలి రెండు మ్యాచ్‌ల్లో విండీస్, సౌతాఫ్రికాపై తేలిపోయిన ఇంగ్లండ్ బౌలింగ్ తర్వాత బాగానే పుంజుకుంది. ముఖ్యంగా చావోరేవో మ్యాచ్‌లో శ్రీలంకపై నెగ్గడంలో పేసర్లు జోర్డాన్, విల్లేదే ప్రధాన పాత్ర. వారిద్దరికి తోడు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ బాగానే రాణిస్తున్నారు. ఇక కివీ్‌సను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన స్పిన్నర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నారు. అయితే బ్యాటింగ్ ఫ్రీ పిచ్‌పై విండీస్ పవర్ హిట్లర్లను ఏమేరకు నియంత్రిస్తారో చూడాలి.
పిచ్/వాతావరణం
ఈడెన్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం. అయితే ఇది స్పిన్‌కూ అనుకూలిస్తుంది. ప్రస్తుతం పిచ్‌పై కాస్త పచ్చిక ఉంది. దీంతో పేసర్లకూ సహకారం లభించొచ్చు. రాత్రి పూట తేమ ప్రభావం చూపొచ్చు. ఛేజింగ్ చేసే జట్టుకు మరిన్ని అనుకూలతలుంటాయి. ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన జల్లులు కురవవొచ్చు. రాత్రివేళ ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశముంది.
జట్లు (అంచనా)
ఇంగ్లండ్: జాసన్ రాయ్, హేల్స్, రూట్, మోర్గాన్ (కెప్టెన్), బట్లర్ (కీపర్), స్టోక్స్, మొయిన్ అలీ, జోర్డాన్, రషీద్, విల్లే, ప్లంకెట్.
వెస్టిండీస్: గేల్, జాన్సన్ చార్లెస్, సిమ్మన్స్, మార్లోన్ శామ్యూల్స్, రామ్‌దిన్ (కీపర్), డ్వేన్ బ్రావో, రస్సెల్, సామి (కెప్టెన్), బ్రాతవైట్, బెన్, బద్రీ.
స్టేడియం కిటకిటే!
భారత జట్టు లేకున్నా ఫైనల్ మ్యాచ్‌కు స్టేడియం కిటకిటలాడబోతోందని బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. ‘ఒక్క టిక్కెట్టూ మిగల్లేదు. స్టేడియం పూర్తిగా నిండబోతోంది. ఇక ఫైనల్లో తలపడబోయే రెండు జట్లూ బలంగానే ఉన్నా, వెస్టిండీస్ వైపే కొంచెం మొగ్గు కనిపిస్తోంది. ఇక సెమీ్‌సలో భారత జట్టు అత్యద్భుతంగా ఆడిన జట్టు చేతిలో ఓటమిపాలైంది’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
4 టీ-20ల్లో అఫ్రీది, షకీబల్ తర్వాత వెయ్యి పరుగులు, యాభై వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచేందుకు డ్వేన్ బ్రావోకు అవసరమైన వికెట్లు.
20 ఐసీసీ టోర్నీల్లో విండీ్‌స-ఇంగ్లండ్ రెండుసార్లు ఫైనల్స్‌లో తలపడ్డాయి. తొట్ట తొలి వన్డే ప్రపంచకప్, 2004 చాంపియన్స్ ట్రోఫీ తుదిపోరులో విండీస్ విజేతగా నిలిచింది. టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడడం ఇదే మొదటిసారి.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment