శ్రీమంతుడు సినిమాతో తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్న మహేష్ బాబు, ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. తను హీరోగా తెరకెక్కే సినిమాలకు మాత్రమే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా తన బావ సుధీర్ బాబు హీరోగా ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్.
మహేష్ బాబుకు 'దూకుడు' లాంటి బ్లాక్ బస్టర్ తో పాటు 'ఆగడు' లాంటి డిజాస్టర్ సినిమాను ఇచ్చిన శ్రీనువైట్ల ఆ తరువాత బ్రూస్ లీ ఫెయిల్యూర్ తో మరింత డీలాపడిపోయాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఆలోచనతో ఓ పక్కా కమర్షియల్ కథతో మహేష్ ను సంప్రదించాడు. అయితే తన బావను కమర్షియల్ గా నిలబెట్టడం కోసం ఆ సినిమాను సుధీర్ బాబు హీరోగా తెరకెక్కించాలని సూచించాడు మహేష్. శ్రీను వైట్ల కూడా ఆ ప్రాజెక్ట్ కు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.
Post a Comment