లాస్ ఏంజిల్స్: రోడ్డుపై వాహనాలు అదుపుతప్పి ఢీకొనడం, ప్రమాదాలు జరగడం నిత్యకృత్యం.. కానీ ఆకాశంలో విమానాలు ఢీకొన్న సంఘటనలు అరుదు. అమెరికా తీరంలో ఆకాశంలో రెండు చిన్నపాటి విమానాలు ఢీకొని సముద్రంలోకి పడిపోయాయి. లాస్ ఏంజిల్స్ నౌకాశ్రయానికి రెండు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు అమెరికా కోస్ట్ గార్డ్, ఇతర అధికారులు చెప్పారు.
ఈ రెండు విమానాల్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, మృతుల వివరాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లైఫ్ గార్డు బోట్ల సాయంతో డైవర్లు గాలింపు చర్యలు చేపట్టారు. విమానం రెక్క భాగాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. విమానాల శకలాలు సముద్రంలోపల 90 అడుగుల లోతున పడిఉంటాయని అధికారులు భావిస్తున్నారు. నౌకాశ్రయం ప్రవేశద్వారాన్ని మూసివేసి సహాయక చర్యలు చేపట్టారు.

Post a Comment