-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 06, 2016

టుడే న్యూస్ డైరీ...!!!


ముద్రగడ దంపతుల ఆమరణ నిరశన: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో మాజీ మంత్ర ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణి పద్మావతి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. ఓవైపు ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ దీక్ష విరమించేదిలేదని వారు చెబుతున్నారు.

నౌకాదళ పాటవం: నేడు విశాఖపట్టణంలో నౌకాదళ పాటవ సమీక్ష జరగనుంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.

ఆర్థిక మంత్రులతో అరుణ్ జైట్లీ: ఈ నెల 29న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై సమాలోచనల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు.

ఐపీఎల్ వేలం: ఐపీఎల్- 9కి గానూ నేడు ఆటగాళ్ల వేలం కొనసాగనుంది. మొత్తం 351 మంది ఆటగాళ్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నారు.

అండర్ 19 క్వార్టర్: బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో నేడు భారత్- నమీబియా జట్ల మధ్య తొలి క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది.

ఆరోగ్యమేళా: ఉత్తరాఖండ్ లో జరుగుతున్న ఆరోగ్యమేళా నేడు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu