కొలంబస్: ఒహియోకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తాను ఇప్పుడు గర్భవతినని, తన బిడ్డకు తండ్రి ఏసు క్రీస్తని లతిఫా స్మిత్ నబెన్‌గనా అనే బాలిక చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అలాగని ఆమె మానసిక వికలాంగురాలు కాదు. ఎందుకంటే ఆమె చెబుతున్నట్టే ఆమెది వర్జిన్ ప్రెగ్నెన్సీ అని వైద్యులు కూడా ధృవీకరించారు. వర్జిన్ ప్రెగ్నెన్సీ అంటే ఎటువంటి శృంగార కార్యకలాపాల్లోనూ పాల్గొనకుండా గర్భం ధరించడం.
‘గతేడాది నా దగ్గరకు ఓ దైవ దూత వచ్చాడు. తానొక నెఫిలిమ్ (బైబిల్ ప్రకారం దేవుని సంతానం) అని చెప్పాడు. తాను జీసెస్ వద్ద నుంచి ఓ సమాచారం తెచ్చానన్నాడు. త్వరలో నువ్వు గర్భం దాల్చి ఓ మగ బిడ్డకు జన్మనిస్తావని, ఆ బిడ్డ జీసెస్ కొడుకని నాతో చెప్పాడ’ని ఆమె వెల్లడించింది. మొదట లతిఫా చేస్తున్న వాదనకు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే చిన్నపట్నుంచి దైవ భక్తి గల వారు చివరకు లతిఫాను సమర్థిస్తున్నారు.
కాగా, లతీఫా ప్రెగ్నెన్సీ నార్మల్‌గానే ఉందని, అయితే సాంకేతికంగా అది వర్జిన్ ప్రెగ్నెన్సీ అని వైద్యులు ధ్రువీకరించారు. అంతమాత్రాన ఆమె బిడ్డకు తండ్రి జీసెస్ అని తాము చెప్పలేనన్నారు. అలాగే మగబిడ్డే పుడతాడు అని చెప్పడం కూడా సమంజసం కాదని అన్నారు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత.. అతను కచ్చితంగా క్రీస్తు కొడుకే అని రుజువు చేస్తానని ఆ బాలిక నమ్మకంగా చెబుతోంది. కాగా, ఈ అంశం గురించి నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
Post a Comment