-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 10, 2016

మీకు ఆధార్ కార్డు ఉందా? అయితే ఇది తప్పక చదవండి!

మన దేశీయుల ఆధార్ కార్డ్ వివరాల్లో సమస్త సమాచారమూ ఉంటుంది. ఆ డేటాబేస్‌ని ఎవరైనా హ్యాక్ చేస్తే - దేశ ప్రజలందరి డిటైల్స్ వారికి తెలిసే అవకాశం లేదా? అన్నదే ఇక్కడ ప్రశ్న! అసలు మన దేశీయుల ఆధార్ డేటాబేస్ ఎంత సెక్యూర్డ్ గా ఉంది? ప్రొటెక్షన్ మెజర్స్ యూఎస్ కంటే గొప్పగా ఉన్నాయా? లేనప్పుడు - దేశ ప్రజల మొత్తం సమాచారాన్నీ కన్నూకాలూ వివరాలతో సహా - సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఒకచోట సేకరించి పెట్టడం, పైగా ఆధార్ తప్పని సరి అంటూ అందరినీ అందులోకి దింపజూడడం - అజ్ఞానం, తొందరపాటు కాదా? ఈ ప్రశ్నలకి సమాధానాలు ప్రతి పౌరుడికీ తెలియాలి. వాళ్లంతా ఓకే అని అంగీకరిస్తేనే ఆధార్ కార్డ్‌ని తప్పనిసరి చేయాలి.

అమెరికాకే అదిరిపోయింది! మరి మనం?
"అయ్యబాబోయ్! డేటా పోయింద"ని యూఎస్ గవర్నమెంట్ ఇప్పుడు గోల పెడుతోంది.- యూఎస్ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన కొంత డేటా పోయిందట! పోవడం అంటే పూర్తిగా మిస్ అవడం కాదు. డేటా వివరాలు ఇతరులకి తెలిసిపోయాయి. DHL అనే పేరు వినే ఉంటారు. United States Department of Homeland Security అన్నది దీని పూర్తి పేరు. ప్రత్యేకావసరం కోసం అఫిషియల్స్ తో ఏర్పరచే క్యాబినెట్ డిపార్ట్ మెంట్స్ లో ఇదొకటి... సెప్టెంబర్ 11 తరవాత సెక్యూరిటీ అవసరాల కోసం యూఎస్ ఏర్పరచిన DHL కి సంబంధించిన సమాచారం ఇప్పుడు కొందరు హ్యాకర్లు తస్కరించారట! పాలస్తీనాకి మద్దతిచ్చే ఓ హ్యాకర్ గ్రూప్ వాళ్లెవరో ఈ పనిచేసినట్టు భావిస్తున్నారు. మొత్తం మీద దాదాపు 200 జీబీ డేటా తస్కరణకి గురయిందట ! హ్యాకర్లు తస్కరించినదాంట్లో క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్లూ , అతి ముఖ్యమైన పాస్ వర్డ్స్ లాంటి సెన్సిటివ్ సమాచారం పెద్దగా లేదని అంటున్నారు. అయినప్పటికీ దాదాపు DHL లో పని చేసే దాదాపు 30000 మంది ఉద్యోగుల పేర్లు, కాంటాక్ట్ నంబర్లూ హ్యాకర్లు తెలుసుకున్నారట.. యూఎస్ ఈ విషయంలో సీరియస్‌గా ఉంది.

ఇక మన విషయానికొద్దాం. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విషయంలో ఇంతింతనరాని జాగ్రత్త చూపించే యూఎస్ లోనే ఇలా ఉంటే - అసలు సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన అంతంతమాత్రంగానే ఉన్న మనదేశంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉండవచ్చో ఊహించవచ్చు. నిజంగా అలాగే ఉంది అని చెప్పడానికే ఇది!

ఏదీ మన సెక్యూరిటీకి ఆధారం?
ఆధార్ కార్డ్ విషయాని కొస్తే - ఇప్పటికీ ఆధార్ కార్డు వల్ల మన అందరి వ్యక్తిగత సమాచారాలకి ముప్పుందన్న విషయం గురించి నిపుణులంతా ఎప్పటినుంచో గోల పెడుతున్నారు. దేశ ప్రజల మొత్తం వేలిముద్రలు, ఐరిస్ వివరాల్లాంటి సెన్సిటివ్ సమాచారం టెక్నాలజీ పేరుతో ఎవరైనా గుప్పిట్లోకి తీసుకుంటే ఎంత ప్రమాదం! టెక్నికల్ గా తెలిసీ తెలియని నైపుణ్యం లేని వ్యక్తుల ఆధ్వర్యంలో ఇలాంటి సమాచారం, అందులోనూ ఇంత పెద్ద ఎత్తున సమాచారం ఉండడం భద్రతా పరంగా మంచిదికానే కాదు. కానీ ఆధార్ కార్డ్ వల్ల ఉత్పన్నం కాగల సమస్యల్ని - సామాన్య ప్రజలలోకి ఎవరూ గట్టిగా తీసుకువెళ్లలేకపోయారు. ఒకవేళ తీసుకు వెళ్లినా జనం అంత సీరియస్ గా తీసుకునే పరిస్థితీ లేదు. ఎందుకంటే - రేషన్ కార్డులాగే అది కూడా ఓ అవసరమైన కార్డు అనుకుంటున్నారే తప్ప - దాంట్లో సెక్యూరిటీ పరమైన సమస్యలు దాగి ఉన్నాయన్న విషయం సామాన్యులకి తెలియనే తెలియదు.

కోర్టు వరమిచ్చినా...
సుప్రీం కోర్టు ఎంతో ముందు చూపుతో ఆధార్ అవసరం లేదని చెప్పడం ఎంతో ఆనందకరమైన విషయం. అన్నిటికంటే సీరియస్ జోక్ ఏంటంటే - సాక్షాత్తూ సుప్రీం కోర్టు చెప్పినా - ఇటు ప్రభుత్వాలు గానీ సంస్థలు గానీ... ఈ విచక్షణ, అవగాహన లేకుండా ప్రతి పనికీ ఆధార్ కార్డే కావాలంటున్నాయి. మొన్నటికి మొన్న జీహెచ్ఎంసీ ఓటుకీ ఆధార్ కీ లింకు పెడితే ఎవరూ కిక్కురుమనలేదు. ఆధార్ లేదని ఓటు తీసేయడం కోర్టు ధిక్కారమే. కానీ ఆ విషయం ఎవరికీ పట్టలేదు. మరో పక్క ఎడ్యుకేషన్ సీటుకి కూడా ఆధార్ అడుగుతున్న ప్రబుద్ధులు ఉన్నారు. - ఇలా అన్నిటికీ ఆధార్ కార్డు కావాలని, ప్రతిదానికీ ఆధార్ ని లింక్ చేయాలనీ కోరుతుండడం, దాన్ని ఎవరూ ప్రశ్నించకపోవడం - నిజంగా మన అజ్ఞానానికి నిదర్శనం ! దేశఃలో ఏ సంస్థయినా, గవర్నమెంటయినా ఏ విషయంలోనైనా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేస్తే - అది అజ్ఞానం మాత్రమే కాదు. కోర్టు ధిక్కారం కూడా! ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ప్రశ్నించాలి. సెక్యూరిటీ పరంగా ఈ మాత్రం చైతన్యం కూడా లేకపోతే - జాతీయ స్థాయిలో డేటా సెక్యూరిటీ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఏం లాభం? డేటా సెక్యూరిటీ పట్ల ఎంతో అవగాహన ఉన్న యూఎస్ నుంచే డేటాను తస్కరించగల హ్యాకర్స్ ఉన్నప్పటికీ - యూఎస్ వాళ్లు వెంటనే చైతన్యవంతులై సెక్యూరిటీని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. కానీ ఏ డేటా చైతన్యమూ లేని మన దేశం పరిస్థితేమిటి?

ప్రమాదాన్ని తప్పనిసరి చేయాలా?
సింపుల్‌గా చెప్పాలంటే - మన దేశీయుల ఆధార్ కార్డ్ వివరాల్లో సమస్త సమాచారమూ ఉంటుంది. ఆ డేటాబేస్ ని ఎవరైనా హ్యాక్ చేస్తే - దేశ ప్రజలందరి డిటైల్స్ వారికి తెలిసే అవకాశం లేదా? అన్నదే ఇక్కడ ప్రశ్న! అసలు మన దేశీయుల ఆధార్ డేటాబేస్ ఎంత సెక్యూర్డ్ గా ఉంది? ప్రొటెక్షన్ మెజర్స్ యూఎస్ కంటే గొప్పగా ఉన్నాయా? లేనప్పుడు - దేశ ప్రజల మొత్తం సమాచారాన్నీ కన్నూకాలూ వివరాలతో సహా - సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఒకచోట సేకరించి పెట్టడం, పైగా ఆధార్ తప్పని సరి అంటూ అందరినీ అందులోకి దింపజూడడం - అజ్ఞానం, తొందరపాటు కాదా? ఈ ప్రశ్నలకి సమాధానాలు ప్రతి పౌరుడికీ తెలియాలి.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu