భాగ్యనగర సిగలో మరో ఐటీ దిగ్గజం చేరుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ యాపిల్- హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ఆరంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు బుధవారం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. గత కొద్దిరోజులుగా యాపిల్ ఉన్నతస్థాయి వర్గాలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే జూన్ నుంచి తొలుత ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఆరంభించాలని ఈ అమెరికా సంస్థ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం గచ్చిబౌలిలోని తిష్‌మాన్ స్పేయర్ ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో 2.5లక్షల చదరపు అడుగుల స్థలంలో కేంద్రాన్ని నెలకొల్పనున్నారు. ఈ మేరకు ఆ సంస్థతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని సమాచారం. ‘గూగుల్ తరహాలోనే మ్యాప్స్‌ను తయారు చేయాలని యాపిల్ నిర్ణయించింది. తమ ఫోన్లు, మ్యాక్‌ల్లోనూ మ్యాప్స్ ఉండాలనుకుంటోంది. అమెరికాలోని తమ ప్రధాన కార్యాలయం ఆవల సాంకేతికాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని సంకల్పించింది. యూరప్‌లోని చాలా ప్రాంతాలతో పాటు... భారత్‌లోని ప్రధాన నగరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత... చివరకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. మరో నాలుగు నెలల్లో (జూన్‌లో)తొలుత ఇన్నోవేషన్ కేంద్రంతో ఆరంభించి... సంవత్సరాంతానికి మ్యాప్స్ విభాగాన్ని పూర్తిస్థాయిలో పనిమొదలెడతారు. సుమారు 4500 మందికి ఉద్యోగావకాశాలు లభించబోతున్నాయి’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, డెల్‌లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు కొలువుతీరాయి. మరో మూడేళ్లలో దక్షిణాసియాలోనే అతిపెద్ద సొంత ప్రాంగణాన్ని నిర్మించటానికి గూగుల్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఇటీవల దిల్లీకి వచ్చినప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో యాపిల్ కూడా అమెరికా ఆవల హైదరాబాద్‌ను తన కేంద్రంగా ఎంచుకోవటంపై తెలంగాణ ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తంజేస్తున్నాయి. ‘‘కొత్త విధానాలతో, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి ఇదెంతో స్థైర్యాన్ని కల్గించే విషయం. మరిన్ని కంపెనీలు హైదరాబాద్‌కు వరుస కడుతాయని ఆశిస్తున్నాం’’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.
February 11, 2016
హైదరాబాద్‌కు యాపిల్ ....

About the Author
Unknown
Author & Editor
No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment