ఈ పోలీస్ అధికారి చాలా మంచోడట. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. 'అరెస్ట్ చేయవచ్చు లేదా జరిమానా వేయవచ్చు కానీ నేను మంచోడు కాబట్టి వదిలేస్తా.. అయితే నాతో శృంగారంలో పాల్గొనాలి లేదంటే అరెస్ట్ చేస్తా'.. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఓ మహిళకు పోలీస్ అధికారి ఇచ్చిన ఆఫర్ ఇది. కారణం ఏదైనా కానీ ఆమె ఒళ్లు అమ్ముకుంటే.. అతను విధుల్లో ఉంటూ పోలీస్ యూనిఫామ్ ను తాకట్టుపెట్టాడు. ఇంగ్లండ్ లో జరిగిన ఈ ఘటనలో డేవిడ్ గిబ్సన్ (44) అనే పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. లివర్ పూల్ క్రౌన్ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. పోలీసు యూనిఫామ్ లో ఉంటూ తన పట్ల దారుణంగా వ్యవహరించిన తీరును బాధితురాలు వెల్లడించింది.
కోర్టులో ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం.. వెస్ట్ డెర్బీలోని ఈటన్ రోడ్డు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్ గిబ్సన్ 2014, నవంబర్ 6న నైట్ డ్యూటీలో ఉన్నాడు. స్టేషన్ లో ఎవరికీ చెప్పకుండా టూబ్రూక్ లో షీల్ రోడ్ ఏరియాలో తన వాహనాన్ని పార్క్ చేశాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఈ ప్రాంతానికి సెక్స్ వర్కర్లు వస్తుంటారు. ఆ సమయంలో బాధిత మహిళ గిబ్సన్ కంటపడింది. 'జరిమానా కట్టాలని పోలీస్ అధికారి ఆదేశించగా, తన వద్ద డబ్బులు లేవని బాధిత మహిళ చెప్పింది. తనను వదిలిస్తే ఈ వీధుల్లోకి రానని ఆమె చెప్పింది. అయితే తాను మంచివాడినని, అరెస్ట్ చేయనని, జరిమానా వేయనని, తన కోసం ఏం చేస్తావని గిబ్సన్ అడిగాడు. గిబ్సన్ ఓ పోలీస్ అధికారిగా తన హోదాను దుర్వినియోగం చేశాడు. తన శారీరక వాంఛ తీర్చుకునేందుకు దుర్భల స్థితిలో ఉన్న ఓ మహిళను అవకాశంగా తీసుకున్నాడు. గిబ్సన్ తన వాహనంలో ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి తన కోరిక తీర్చుకున్నాడు. బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేశాడు' అని కోర్టులో ప్రాసిక్యూటర్ మరియా మస్సెలిస్ వాదించారు.
Post a Comment