ఆత్మకూరు రూరల్(కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా ఆత్మకూరు రూరల్ మండలం బావనంతాపురం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం సైకో వీరంగం సృష్టించాడు. శివ(35) అనే యువకుడు వేటకొడవలితో ఇద్దరు వ్యక్తులను నరికి చంపాడు. మరో ఇద్దరు తప్పించుకుని పారిపోయారు. గాయపడినవారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
శివ అప్పులు విపరీతంగా చేశాడు. అవి తీర్చలేక సైకోగా మారాడు. కనిపించినవారిపై దాడిచేయడం ప్రారంభించాడు. బుధవారం మధ్యాహ్నం కర్నూలు నుంచి నలుగురు వ్యక్తులు వచ్చి తమ అప్పు చెల్లించమని కోరడంతో రెచ్చిపోయిన శివ వేటకొడవలితో వారిపై దాడిచేశాసి పరారయ్యాడు. ఆత్మకూరు పోలీసులు కేసి నమోదుచేసి నిందితుని కోసం గాలిస్తున్నారు.
Post a Comment