ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అఫీషియల్ గా ఏ సినిమా చేయబోయేది కన్ఫామ్ చేయకపోయినా.. పవన్ నెక్ట్స్ సినిమా దర్శకులుగా వినిపిస్తున్న పేర్లు మాత్రం, అభిమానులను భయపెడుతున్నాయి. ముఖ్యంగా సక్సెస్ కు చాలా దూరంలో ఉన్న దర్శకులు పవన్ తో సినిమాకు రెడీ అవుతున్నారన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.మొన్నటి వరకు తమిళ దర్శకుడు ఎస్ జె సూర్యతో పవన్ నెక్ట్స్ సినిమా ఉంటుందన్న వార్త టాలీవుడ్ లో షికారు చేసింది.
దాదాపుగా కన్ఫామ్ అయిన ఎస్ జె సూర్య ప్రాజెక్ట్ ను ఇప్పుడు పవన్ పక్కన పెట్టేశాడట. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అజిత్ వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో కూడా షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు పవర్ స్టార్. కందిరీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత రభసతో భారీ డిజాస్టర్ ను అందించిన సంతోష్ శ్రీనివాస్ ను వేదలం రీమేక్ కు దర్శకుడిగా ఎంచుకున్నాడు. దీంతో అభిమానులు ఈ సినిమా రిజల్ట్ పై డౌట్ పడుతున్నారు. మరి పవన్ ఈ కాంబినేషన్ లో సినిమా చేస్తాడా లేక.. మరో గాసిప్ తో ఆడియన్స్ ను తికమక పెడతాడా.. చూడాలి.
Post a Comment