ఖాట్మాండ్: నేపాల్ ఈశాన్య ప్రాంతంలో శుక్రవారం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.5గా నమోదు అయింది. ఈ మేరకు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రాన్ని సింధూపాల్ చౌక్ జిల్లాలో గుర్తించినట్లు తెలిపింది. అయితే ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదని పేర్కొంది. గతేడాది ఏప్రిల్, మే మాసాల్లో ఇదే ప్రాంతంలో బలమైన భూ ప్రకంపనలు వచ్చాయని జాతీయ భూకంప కేంద్రం ఈ సందర్భంగా గుర్తు చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment