సంచలన తారగా పేరొందిన నయనతార మరోసారి కలకలానికి కేంద్రంగా మారారు. ఈ క్రేజీ నటి మలేషియా విమానాశ్రయంలో నకిలీ వీసాతో అక్కడి అధికారులకు పట్టుబడ్డారనే ప్రచారం శుక్రవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. దీంతో కోలీవుడ్‌లో కలకలం చెలరేగింది.ఆ మధ్య నానుమ్ రౌడీదాన్ చిత్ర సన్నివేశంలో నయనతార ఒక టాస్‌మార్క్ షాపులో మద్యం బాటిల్ కొంటున్న ఫొటో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.
దీంతో ఈ తాజా సంఘటన కూడా చిత్రానికి ఫ్రీ ప్రచారంలో ఒక భాగం అని ఒక వర్గం పేర్కొంటున్నారు. అయితే మలేషియా విమానాశ్రయంలో నయనతారను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేసింది వాస్తవమే అన్నది తెలియవచ్చింది. వివరాల్లకెళితే నయనతార ప్రస్తుతం విక్రమ్ సరసన ఇరుముగన్ చిత్రంతో నటిస్తున్నారు.
మలేషియాలో జరుగుతున్న ఆ చిత్ర షూటింగ్‌లో పాల్గొని ఇండియాకు తిరుగు ముఖం పట్టిన నయనతార మలేషియా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కేఎల్1, కేఎల్2 అనే రెండు రకాల టెర్మినల్ విధాలను అమలు పరుస్తున్నారు. ఇండియాకు వచ్చే ప్రయాణికులు కేఎల్1 టెర్మినల్ ద్వారా ప్రవేశించాల్సి ఉండగా కేఎల్2 టెర్మినల్ వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా తనిఖీ చేసి సరిగా లేవంటూ చిన్న కలకలానికి కారణం అయ్యారు. అయితే వారికి నటి నయనతార క్లారిఫికేషన్ ఇచ్చి ఇండియాకు చేరుకున్నారని ఇరుముగన్ చిత్ర యూనిట్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా నయనతార పాస్‌పోర్టు నకలు మలేషియా ఇంటర్నెట్లలో ప్రచారం కావడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసి నయనతారపై సాగుతున్న వదంతులకు పుల్‌స్టాప్ పెట్టారు.

Post a Comment