వెండితెరపై ‘బాహుబలి’ చిత్రం సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘బాహుబలి’ కామిక్ బుక్స్, గేమ్స్, యానిమేషన్, నవలల రూపంలో అలరించనుంది. ‘‘గ్రాఫిక్ ఇండియాతో కలిసి మేం చేయబోతున్న ఈ ప్రయత్నం నాకు చాలా ఎగ్జయిట్‌మెంట్‌నిస్తోంది. వెండితెరకు మాత్రమే కాకుండా, మరిన్ని రూపాల్లో ‘బాహుబలి’ని అందించబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని చిత్రదర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు.
‘‘ఆర్కా మీడియా, రాజమౌళితో కలిసి మా గ్రాఫిక్ ఇండియా చేస్తున్న మంచి ప్రయత్నం ఇది. ఇండియన్ సినిమా గురించి చెప్పేటప్పుడు ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’కి తర్వాత అంటే అతిశయోక్తి కాదు’’ అని గ్రాఫిక్ ఇండియా సీఈవో, కో-ఫౌండర్ శరద్ దేవరాజన్ అన్నారు. ‘బాహుబలి’: ది లాస్ట్ లెజెండ్స్’ పేరుతో యానిమేషన్ ఫార్మట్‌ను విడుదల చేయనున్నారు.
మామూలుగా హాలీవుడ్‌లో దాదాపు ప్రతి సినిమాకీ గేమ్స్, కామిక్స్ వంటివి విడుదల చేస్తుంటారు. వాటిని ప్రచారానికి ఉపయోగించుకుంటారు. ‘బాహుబలి’ విడుదలైన ఆరు నెలలకు ఇప్పుడీ ప్రయత్నం చేయడం ద్వారా మలి భాగంపై క్రేజ్ రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Post a Comment