లాస్ ఏంజెలిస్: అదృష్టం తలుపు కొట్టినా తీయకపోతే.. ఇదే కాలిఫోర్నియా లాటరీ టికెట్ కొన్న వ్యక్తి పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు 63 మిలియన్ డాలర్ల (సుమారుగా రూ.425 కోట్లు) లాటరీ అది. కాని ఆ టికెట్ కొన్న వారు మాత్రం దాన్ని క్లైమ్ చేసుకోలేదు. దీంతో ఆ డబ్బంతా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిపోతుందట. గురువారం (4న) సాయంత్రం 5 గంటలకు గడువు ముగిసిందని, అయితే లాటరీ మొత్తాన్ని దక్కించుకునేందుకు ఎవరూ రాలేదని కాలిఫోర్నియా లాటరీ అధికార ప్రతినిధి అలెక్స్ ట్రావెర్సో తెలిపారు. ‘లాటరీ గెలిచిన నంబర్ 46-1-33-30-16-24. ఆ టికెట్ లాస్ ఏంజెలిస్‌లోని 7-ఎలెవెన్ స్టోర్‌లో అమ్ముడుపోయింది.
అయితే ఆ టికెట్‌తో ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. ఎవరూ క్లైమ్ చేసుకోలేదు కాబట్టి మొత్తం 63 మిలియన్ డాలర్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తాయి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, తనకు లాటరీ తగిలిందని నిర్వాహకుల వద్దకు వెళ్లానని, కాని లాటరీ చిరిగిపోయిందని, ప్రాసెసింగ్ చేయలేమని వారు చెప్పారని బ్రాండీ మిల్లర్ అనే వ్యక్తి ఆరోపించారు. కాగా, జనవరి 13న విడుదల చేసిన 1.6 బిలియన్ డాలర్ల పవర్‌బాల్ లాటరీని కూడా ఎవరూ క్లైమ్ చేసుకోలేదు.
Post a Comment