
‘‘సినిమా ప్రేమకు, నిజ జీవితంలో ప్రేమకు ఎంతో వ్యత్యాసం ఉంది. నటుడ్ని కాక మునుపు నన్ను ఒక్క అమ్మాయి కూడా ఇష్టపడి ‘ఐ లవ్ యు’ చెప్పలేదు. నటుడ్ని అయ్యాక ఎంతోమంది ఇష్టపడుతూ ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు పెడుతుంటారు. అంటే ఇక్కడ వాళ్లు ఇష్టపడుతున్నది ‘నాని’ అయిన నన్ను కాదు.. ‘అష్టాచెమ్మ’లో రాంబాబును, ‘అలా మొదలైంది’లో గౌతమ్‌ను, ‘ఈగ’లో నానిని, ‘భలే భలే మగాడివోయ్’లో లక్కీలను ఇష్టపడుతున్నారన్నమాట. ఆ సినిమాప్రేమ నిజమైన ప్రేమ కాలేదు కదా!
‘‘నేను చాలా అప్రోచబుల్‌లాగ కనిపిస్తాను కాబట్టి ఎక్కువ మంది అమ్మాయిలు మెసేజ్‌లు పెడుతుంటారు. నానిలాంటోడు దొరకొచ్చు అన్నది వాళ్లకు అత్యాశ కాదు. మహే్‌షబాబును ప్రేమించడమంటే అత్యాశ అవుతుందేమో కాని నానిని కాదుగా!’’
‘‘అంజూ సినిమా రిలీజైనప్పుడు మాత్రమే నాతో కలిసి ఫస్ట్‌షో చూస్తుంది. అంతే తప్పిస్తే.. నా వర్క్‌ను, పర్సనల్ లైఫ్‌ను కలిపే ప్రయత్నం చేయను. సినిమా రిలీజ్‌కు పది రోజుల ముందు నేను పడే టెన్షన్ తను కూడా పడుతుంది. అంతకుమించి నా కెరీర్ ప్రభావం తన మీద పడనీయను..’’
‘‘నా భార్య పేరు అంజు- అసలు పేరు అంజన. మా ఫ్రెండ్‌కు కజిన. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్లింటికి వెళ్లినప్పుడు పరిచయమైంది. మాటలు కలిసాయి. స్నేహం చిగురించింది. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌ని. హీరో కావాలనే ఆలోచన ఇంకా పూర్తిగా కూడా లేదు. మా మధ్య స్నేహం పెరిగింది. దాదాపు మా ఇద్దరి అభిరుచులు ఒకటే. నా గురించి తనకు తెలుసు. తన గురించి నాకు తెలుసు. మా రిలేషనషి్‌పలో అసహజత్వం ఎప్పుడూ లేదు. ఆమెను అతిగా ఇంప్రస్ చేయాలని నేనెప్పుడూ ప్రయత్నించలేదు. నన్ను ఆకర్షించాలని తనూ అనుకోలేదు. స్నేహం బాగా ముదిరి ప్రేమ దశకు చేరుకునే వరకు మేం వేచి చూశాం. ఒకరికొకరం ప్రేమ గురించి ఎన్నడూ మాట్లాడుకోకపోయినా... ఒకరి పట్ల మరొకరికి ఫీలింగ్స్ ఉన్నాయనే విషయం తెలుసు. మన మనసులో మాటలను చెప్పకనే చెప్పించే స్వభావం ప్రేమకు మాత్రమే ఉంటుంది. ప్రేమికులకు మాత్రమే అర్థమయ్యే సత్యం ఇది. చాలాసార్లు మన జీవితంలో జరిగేదానికి, బయట సినిమాల్లో చూసేదానికి మధ్య బోల్డెంత తేడా ఉంటుంది. మా విషయంలో అదే జరిగింది. అంజుకు నేను గులాబి చేతిలో పట్టుకుని ప్రపోజ్ చేయలేదు. తెలివిగా ఆమె చేతే ప్రపోజ్ చేయించా. (నవ్వులు..) అదెలా అంటే... నన్ను ఆ విషయం అడగొద్దు. అదొక సీక్రెట్.
నేను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అని నేను ఎప్పుడూ అనుకోలేదు. మన జీవితంలో అనేక మంది వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. కొందరు మాత్రమే మనతో కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ కావాలంటే ముందు నమ్మకమనే పునాది పడాలి. మా విషయంలో అదే జరిగింది. ఒకరంటే మరొకరికి నమ్మకం కలిగింది. ఒకసారి నమ్మకం ఏర్పడిన తర్వాత కావాల్సింది ఓర్పు. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకొనే సహనం ఉండాలి. చిన్న చిన్న చిటపటలకే బంధాలు తెంచుకొనేటంత అపనమ్మకం ఉంటే ఏ బంధం నిలవదు. కూరలో కారం సరిగ్గా వేయలేదనో.. సాయంత్రం సినిమాకు తీసుకువెళ్లలేదనో విడాకులు తీసుకోవటానికి సిద్ధపడే వారిని చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. చిన్న సమస్యలపై అతిగా ఆలోచిస్తే అవి పెద్దవిగా తోస్తాయి. మన జీవితంలో ఎక్కువ భాగాన్ని కమ్మేస్తాయి.
మనిషి మంచి చెడులు కలిసిన ఒక ప్యాకేజ్. అందరికీ అన్నీ మంచి లక్షణాలే ఉండవు. అలాగని చెడు లక్షణాలూ ఉండవు. ఈ రెండింటినీ సమానంగా తీసుకోగలిగినప్పుడే ప్రేమబంధం నిలబడుతుంది. మనిషిలో మంచిని మాత్రమే చూసి.. చెడు కనిపించినప్పుడు.. అయ్యో ఈ వ్యక్తి ఇలాకూడా ఉంటాడా? అనుకోవడం తప్పు. అంజనకు ఈ విషయం బాగా తెలుసు. సినిమాలు సక్సెస్ అయినప్పుడు ఒకలా.. ఫ్లాప్‌లు వచ్చినప్పుడు ఒకలా ఉండదు. ఈ రెండు సందర్భాలలోను నా భావోద్వేగాలతో కలిసి ప్రయాణిస్తుంది. తనకు నేను జీరోగా ఉన్నప్పుడూ తెలుసు. హీరో అయినప్పుడూ తెలుసు. ప్రియురాలు భార్యగా మారిన తరువాత వచ్చే ఫిర్యాదులు చాలానే ఉంటాయి. అవి సహజం. ఎవరికైనా తప్పవు. ‘నువ్వు సినిమాను మరీ సీరియ్‌సగా తీసుకుంటావు’ అనేది అంజు ఫిర్యాదు. నేను సినిమా షూటింగ్‌లతో బిజీ అయిపోయినప్పుడు ఒక్కోసారి తను రెండుమూడు సార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయను. కొన్నిసార్లు పరధ్యానంగా ఉంటానని కూడా ఫిర్యాదు చేస్తుంటుంది. అప్పుడు తను చాలా సీరియస్ అవుతుంది. ఇలాంటివన్నీ సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే సమసిపోతాయి. ఆ విషయంలో అంజు అద్భుతం.
వెయిట్ చేయండి
పూర్వం ఏ హీరోహీరోయిన్ నచ్చినా వాళ్లను భుజాన వేసుకునేవాళ్లు అభిమానులు. వాళ్ల సినిమాలు వరుసగా ఫ్లాఫ్‌లు అయినా సరే కేవలం వాళ్ల మీద ఉండే అభిమానంతో చూసేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎంత పెద్ద హీరో సినిమా అయినా బాగుండకపోతే చూడరు. అనుబంధాల విషయంలో కూడా ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇద్దరి మధ్య బంధం ఏర్పడితే అది చివరి దాకా మిగిలేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కువ కాలం ఎవరికీ ఏదీ నచ్చటం లేదు. దానికి కారణం కూడా తెలియదు. సినిమా విషయంలోనైనా, ప్రేమ విషయంలోనైనా ఇదే జరుగుతోంది. అందుకే వాలంటైన్స-డే సందర్భంగా నేను ప్రేమికులకు చెప్పేదొకటే... తొందర తొందరగా ప్రేమించుకుని, తొందర తొందరగా పెళ్లి చేసుకుని, అంతే తొందరగా విడిపోయే పరిస్థితులను కల్పించుకోవద్దు. పెళ్లికి తొందరపడొద్దు. ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటే కొద్ది కాలం ఆగండి. ఓర్పుతో ఇద్దరిలోని ప్లస్‌లు మైన్‌సలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రేమలో పాజిటివ్ ఒక్కటే కాదు, నెగిటివ్ కూడా ఉంటుందన్న సంగతి మరవొద్దు.When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment