-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 10, 2016

మాది సక్సెస్‌ఫుల్ పెయిర్: త్రిష


త్రిష... పరిచయం అక్కర్లేని పేరు. పుష్కరానికి పైగా సినిమాల్లో నటించిన అనుభవం. త్రిష అంటే గ్లామర్‌, గ్లామర్‌ అంటే త్రిష అనే పేరు ఆమె సొంతం. సినిమాల్లో ఇదీ త్రిష ట్రాక్‌ రికార్డ్‌. మొన్న మొన్నటి దాకా గ్లామర్‌ పాత్రలు చేసిన త్రిష ఉన్నట్టుండి పంథా మార్చింది. యాక్షన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల వైపు మనసు పెట్టింది. గ్లామర్‌తో ప్రేక్షకులను మెప్పించడమే కాదు, యాక్షన్‌తో భయపెట్టగలను అంటున్న త్రిషతో.... 

కంగ్రాట్స్‌ తెలుగులో ‘కళావతి’తో మంచి విజయం అందుకున్నట్టున్నారు? 
సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే భలే సంతోషంగా అనిపిస్తోంది. 
 
ఈ విజయాన్ని ముందే ఊహించారా?
లేదు. నా సినిమాల గురించి ఎప్పుడూ నేను ఊహించుకోను. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ముందుగానే ఊహించాను. సినిమా చేస్తున్న సమయంలోనే మంచి విజయం సాధిస్తామన్న నమ్మకం కలిగింది. అందరూ అనుకున్నట్టుగానే విజయం లభించింది. 
 
చాలా రోజుల తరువాత సిద్ధార్ధతో కలిసి నటించినట్టున్నారు?
మాది సక్సెస్‌ ఫుల్‌ పెయిర్‌! గతంలో నాతో చేసినప్పుడు సిద్ధార్థ్‌ ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. తనలో ఎలాంటి మార్పు రాలేదు. అప్పుడూ, ఇప్పుడూ తనతో కలిసి నటించడం చాలా కంఫర్ట్‌బుల్‌గా అనిపించింది. 
 
హన్సికతో కలిసి నటించడం ఎలా ఉంది?
మల్టీస్టార్‌ సినిమాలు చేయడంలో నాకు ఎప్పుడూ ఇబ్బంది లేదు. హన్సిక చాలా కోఆపరేటివ్‌గా ఉంటుంది. అరన్‌మనై సినిమాలో తనదే మెయిన్‌ క్యారక్టర్‌. ఈ సినిమాలో కూడా తనది ఇంపార్టెంట్‌ రోలే! కాకపోతే మేం ఇద్దరం కలిసి చేసిన షూటింగ్‌ చాలా తక్కువ. ఒక్కరోజు మాత్రం కలిసి చేశాం. 
 
మీ రాబోయే సినిమా ‘నాయకి’ గురించి...
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కామెడీ బేస్డ్‌ సినిమా ఇది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ అందరూ పడీ పడీ నవ్వాల్సిందే! ఈ సినిమాలో నాది సింగిల్‌ రోల్‌! కాకపోతే చాలా షేడ్స్‌ ఉన్న పాత్ర. దాంతో డ్యూయల్‌ రోల్‌ అని అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమా విడుదల కోసం నేను కూడా బాగా వెయిట్‌ చేస్తున్నాను. 
 
ఇన్ని సంవత్సరాలలో బాగా ఇబ్బంది పడిన సందర్భం?
నాకు డ్యాన్సులంటే చాలా భయం. డ్యాన్సు నేర్చుకున్నాను కానీ ఎందుకో చేయాలంటే భయం. షూటింగ్‌లో పాట అయిపోయింది అంటే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటాను. 
 
డ్యాన్స్‌ నేర్చుకున్నప్పుడు భయం ఎందుకు?
పాటకు సరిగ్గా స్టెప్పులు వేయాలి. లిప్‌ మూమెంట్‌ ఉండాలి. అన్నీ సరిగ్గా ఉంటే పాట బాగుంది అంటారు. కెరీర్‌ ప్రారంభంలో ఈ భయం మొదలైంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 
 
రానాతో తిరిగి క్లోజ్‌గా ఉంటున్నట్టున్నారు?
నేనూ తను మంచి స్నేహితులం. కలిసి లేదా ఫోన్‌లో మాట్లాడుకోవడం చేసుకునేవాళ్ళం. ఇటీవలి కాలంలో అది కుదరడం లేదు. అందుకే ట్విటర్‌ ద్వారా మాట్లాడుకుంటున్నాం. అది చూసి మా మధ్య ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారు. పెళ్ళి వేరు. స్నేహం వేరు. 
 
సినిమాల ఎంపికలో ఎవరి సలహా అన్నా తీసుకుంటారా?
హీరో కన్నా, ముందు కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. నేను విన్న తరువాత మా మదర్‌ వింటారు. తను ఫైనల్‌ చేస్తుంది. నాకు నచ్చిన ప్రతి కథా తనకూ నచ్చుతుంది కాబట్టి ఇప్పటి వరకూ ఎలాంటి సమస్యా రాలేదు. 
 
పెళ్ళి గురించి....
ఈ సారి తొందరపడదలుచుకోలేదు. ఇదే విషయం చాలా సార్లు చెప్పాను. అయినా ఇప్పుడు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తయ్యాక పెళ్ళి గురించి ఆలోచిస్తాను. 
 
సెట్లో ఎవరితో పెద్దగా కలవరు అంటారు ఎంత వరకూ నిజం?
పని మీద దృష్టి సారించడానికే కొద్దిగా రిజర్వ్‌డ్‌గా ఉంటాను తప్ప బయట చాలా జోవియల్‌గా ఉంటాను. ఈ విషయం నాతో పనిచేసే ప్రతి ఒక్కరికీ తెలుసు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu