ప్రస్తుతం బెంగళూరు నాట్కల్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీదివ్య, సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సమంత, ఆర్య, బాబీ సింహా, లక్ష్మీరాయ్ లు నటిస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. తమిళనాట ఈ శుక్రవారం రిలీజ్ అయిన బెంగళూర్ నాట్కల్ డిసెంట్ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీదివ్య, షూటింగ్ సమయంలో రానా తనను తెగ ఇబ్బంది పెట్టాడని చెప్పింది.
అయితే రానా, శ్రీదివ్యను ఇబ్బంది పెట్టింది వ్యక్తిగతంగా కాదులేండి. రానా, శ్రీదివ్యలు ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి హైట్ మ్యాచ్ కాకపోవటంతో షూటింగ్ సమయంలో నానా తంటాలు పడాల్సి వచ్చిందట. కార్ సీట్ నుంచి ప్రతీ విషయంలో శ్రీదివ్యను హైట్ గా చూపించటం కోసం తెగ కష్టపడాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని సరదాగా మీడియాతో షేర్ చేసుకుంది శ్రీదివ్య.
Post a Comment