లండన్: లండన్ లో ఆన్ లైన్ రేప్ లు హడలెత్తిస్తున్నాయి. గత ఏడాదికన్నా ఈ ఏడాది వాటి సంఖ్య అమాంతం పెరిగినట్లు లండన్ కు చెందిన నేషనల్ క్రైం ఎజెన్సీ (ఎన్ సీఏ) తెలిపింది. వారు తెలిపిన ప్రకారం ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ల ద్వారా, యాప్ ల ద్వారా పరిచయమైన వ్యక్తులను కలిసేందుకు వెళ్లిన తర్వాత వారిపై లైంగిక దాడులు జరిగిన ఘటనలు ఎక్కువయ్యాయి. సాధరణంగా డేటింగ్ యాప్ ల ద్వారా అంతకుముందు ఒకరికొకరు తెలియని వారు కూడా పరిచయం అవుతారు.
అలా పరిచయమైనవారిని కలిసేందుకు వెళుతుంటారు. ఇలా వెళ్లినప్పుడు వారిపై బలవంతంగా లైంగిక దాడులు ఎక్కువయ్యాయట. 2009లో ఇలాంటి ఘటనలు 33 జరుగగా 2014లో వీటి సంఖ్య 184కు అమాంతం పెరిగింది. ఇలాంటి ఘటనలకు బాధ్యులైనవారిలో 85శాతం మంది మహిళలు ఉండగా వారిలో 42శాతం మంది 20 నుంచి 29 ఏళ్ల లోపువారు, 24శాతంమంది 40 నుంచి 49ఏళ్లలోపువారు ఉన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని తగిన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి చేయిదాటిపోతుందని ఎన్ సీఏ ఆందోళన వ్యక్తం చేసింది.
Post a Comment