అదృష్టం ఇంట్లోకి చొరబడటమన్నా, జాక్‌పాట్ తగలడమన్నా అంటే ఇదేనేమో. సస్పెండ్ కావాల్సిన చోట ఆ శాఖకు రాష్ట్ర ఇన్‌చార్జి అయితే ఎలా ఉంటుంది? ఇది కూడా అదే. మూణ్నెళ్ల క్రితం గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ఎలుకలు కొరికి శిశువు మృతిచెందింది. అప్పటి సూపరింటెండెంట్‌తో పాటు పలువురు సస్పెండ్ కావాలి. కానీ అదే సూపరింటెండెంట్ ఇప్పుడు రాష్ట్రానికి వైద్య విద్యా సంచాలకులుగా పదోన్నతి పొందారు.
అంతేకాదు సుమా అదనపు వైద్యవిద్యా సంచాలకులు, ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్, ఏపీ పారామెడికల్ బోర్డు సెక్రటరీ వంటి పోస్టులన్నీ ఆ అధికారి చేతిలోనే ఉన్నాయి. ఓ దశలో మంత్రితోపాటు ఉన్నతాధికారులంతా ఈ సూపరింటెండెంట్ అక్కర్లేదు, ఎలుకలు కొరికి శిశువు మృతిచెందుతుంటే కళ్లు మూసుకుని కూర్చున్నాడా.. ఆ మాత్రం బాధ్యత లేదా? ఆయనను సస్పెండ్ చేయాల్సిందేనంటూ అందరూ పట్టుపట్టిన వాళ్లే! ఇప్పుడు పదోన్నతుల గుత్తి ఆయన చేతికి ఇచ్చారు. జాక్‌పాట్ అంటే అదే మరి!
Post a Comment