హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో శుభవార్త. ఇప్పటికే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన పోలీస్‌శాఖ తాజాగా సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. పోలీస్ శాఖలోని ఆయా విభాగాలలో ఖాళీగా ఉన్న 510 ఎస్ ఐ పోస్టులకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
సివిల్, స్పెషల్ పోలీస్, ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక శాఖలో ఎస్‌ఐ, తత్సమాన హోదాలో ఉన్న పలు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిజాస్టర్ ఎస్ఐ-9, సీపీఎల్ అంబర్ పేట ఎస్ఐ-2 పోస్టులు ఉండగా, సివిల్ ఎస్ఐ-208, ఏఆర్ ఎస్ఐ-74, రిజర్వ్ ఎస్ఐ-205, ఎస్పీఎఫ్ ఎస్ఐ-12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ నెల 10 నుంచి మార్చి 3 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని పేర్కొంది. ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ కు సంబంధించి వివరాలను www.tslprb.in వెబ్ సైట్ లో పొందవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి భారీ సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది పోలీస్ విభాగమే. ఇప్పటికే కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దాదాపు మూడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Post a Comment