బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ కోసం శనివారం జరుగుతున్న వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు కరుణ్ నాయర్ కు ఊహించని ధర దక్కింది. అతని కనీస ధర రూ.10 లక్షలు ఉండగా, నాలుగు కోట్లకు అమ్ముడుపోయాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కరుణ్ నాయర్ ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ లోని జోథ్ పూర్ కు చెందిన కరుణ్ నాయర్.. 2013 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడగా, 2015 ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే నాయర్ ను ఈ ఏడాది బెంగళూరు జట్టు నుంచి విడుదల చేయడంతో వేలంలో తాను ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని పొందాడు. మరోవైపు త్వరలో ఆరంభం కానున్న శ్రీలంక, ఆసియాకప్, వరల్డ్ టీ 20 టోర్నీలలో భాగంగా భారత జట్టులో స్థానం దక్కించుకున్న లెఫ్మార్మ్ స్పిన్నర్ పవన్ నేగీ జాక్ పాట్ కొట్టాడు. పవన్ నేగీకి రూ. 8.5 కోట్ల ధర వెచ్చించి ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది. ఇతని కనీస ధర రూ. 30 లక్షలు కాగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో నేగీ నిలవడం విశేషం.
ఇదిలా ఉండగా యువరాజ్ సింగ్ కు డిమాండ్ తగ్గగా, ఊహించని విధంగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కు కాసుల పంట పండింది. సన్ రైజర్స్ హైదరాబాద్ .. యువీని 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గతేడాది వేలంలో రూ. 16 కోట్ల ధర పలికిన యువీ.. ఈసారి దాదాపు సగానికి సగం తక్కువ ధర పలికాడు. కాగా వాట్సన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9.5 కోట్ల రూపాయలకు వాట్సన్ ను దక్కించుకుంది. వేలంలో ఆటగాళ్ల ధరలు.. కొనుకొన్న ఫ్రాంచైజీల వివరాలు..
*షేన్ వాట్సన్ (రూ. 9.5 కోట్లు): రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
*యువరాజ్ సింగ్ (రూ. 7 కోట్లు):సన్ రైజర్స్ హైదరాబాద్
*దినేశ్ కార్తీక్ (రూ. 2.3 కోట్లు): గుజరాత్ లయన్స్
*కెవిన్ పీటర్సన్ (రూ. 3.5 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్
*ఇషాంత్ శర్మ (రూ. 3.8 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్
*ఆశీష్ నెహ్రా (రూ. 5.5 కోట్లు): సన్ రైజర్స్ హైదరాబాద్
*డేల్ స్టెయిన్ (రూ. 2.3 కోట్లు): గుజరాత్ లయన్స్
*జోస్ బట్లర్ (రూ. 3.8 కోట్లు): ముంబై ఇండియన్స్
*సంజూ శామ్సన్ (రూ. 4.2 కోట్లు): ఢిల్లీ డేర్ డెవిల్స్
*ఇర్ఫాన్ పఠాన్(కోటి): పుణె సూపర్ జెయింట్స్
*క్రిస్ మోరిస్ (రూ. 7 కోట్లు): ఢిల్లీ డేర్ డెవిల్స్
*స్టువర్ట్ బిన్నీ (రూ.2 కోట్లు): రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
*మిచెల్ మార్ష్ (రూ. 4.8 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్
*ధవళ్ కులకర్ణి (రూ. 2 కోట్లు): గుజరాత్ లయన్స్
*ప్రవీణ్ కుమార్ (రూ.3.8 కోట్లు): గుజరాత్ లయన్స్
*మోహిత్ శర్మ (రూ. 6.5 కోట్లు): కింగ్స్ లెవెన్ పంజాబ్
*టిమ్ సౌథీ (రూ.2.5 కోట్లు): ముంబై ఇండియన్స్
*సచిన్ బేబీ (రూ.10 లక్షలు)-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
Post a Comment