బాపట్ల : కాంట్రాక్ట్ పద్ధతిలో 7వేల వ్యవసాయ ఉద్యోగాలు భర్తీచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో వసతి గృహాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి 1000హెక్టార్లకు ఒక ఎంపీఈవో చొప్పున నియమిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ నెలలో రెండవ విడత రుణమాఫీకీ సంబంధించి 4వేల కోట్లరూపాయిలు బ్యాంక్ ఖాతాలలో జమ అవుతాయన్నారు. సమావేశంలో వీసీ డాక్టర్ ఎ.పద్మరాజు, రిజిస్ర్టార్ డాక్టర్ టి.వి.సత్యనారాయణ, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ తాతినేని రమే్‌షబాబు, అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ఆర్.కె.ప్రసాద్, ఎంపిపి మానం విజేత, చైర్‌పర్సన్ తోటమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment