బ్రిస్బేన్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్నరెండో వన్డేలో సెంచరీ చేసిన రోహిత్.. ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు శతకాలు చేసిన భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. గత పెర్త్ వన్డేలో భారీ సెంచరీ చేసి భారత మాజీ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ సరసన నిలిచిన రోహిత్.. ఈ తాజా సెంచరీతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
దీంతో పాటు గబ్బా స్టేడియంలో అత్యధిక స్కోరు చేసిన భారత ఓపెనర్ గా నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్ ఈ స్టేడియంలో ఓపెనర్ గా చేసిన 91 పరుగుల రికార్డును రోహిత్ సవరించాడు. ఓవరాల్ గా రోహిత్ కెరీర్ లో ఇది 10వ వన్డే సెంచరీ కాగా, ఆస్ట్రేలియాపై ఐదో సెంచరీ. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో వరుసగా రెండో సెంచరీ చేయడంతో వీవీఎస్, గ్రేమ్ హిక్ ల సరసన రోహిత్ నిలిచాడు. ఆస్ట్రేలియాపై 20 ఇన్నింగ్స్ లను పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ సుమారు 95. 00 ఉండగా, అతని సగటు దాదాపు 68.00కు పైగా ఉండటం విశేషం. ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ వన్డే అత్యధిక స్కోరు 209.
Post a Comment