చెర్రీతో శైలజ
PUBLISHED ON: January 10, 2016
BY: Unknown
IN: MOVIE NEWS
చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా నేను శైలజా, రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మళయాలి ముద్దుగుమ్మ కీర్తి సురేష్. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్న ఈ బొద్దుగుమ్మ మరో భారీ ఆఫర్ ను సొంతం చేసుకుంది. తొలి సినిమాతోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటి రామ్ చరణ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. బ్రూస్ లీ సినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులు గడుస్తున్నా, చరణ్ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీఒరువన్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్టుగా ప్రకటించినా.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. దీనికి తోడు నటీనటుల ఎంపిక కూడా పూర్తవ్వకపోవటంతో సినిమా మొదలవ్వటానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే విలన్ గా ఒరిజినల్ వర్షన్ లో చేసిన అరవింద్ స్వామినే కన్ఫామ్ చేయగా హీరోయిన్ పాత్రకు కీర్తి సురేష్ ను ఎంపిక చేశారన్న టాక్ వినిపిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.
About the Author
Unknown
Author & Editor
No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!
Post a Comment