మరోసారి ప్రయోగానికే ఓటేశాడు..!!!
PUBLISHED ON: January 10, 2016
BY: Unknown
IN: MOVIE NEWS
యంగ్ జనరేషన్ హీరోలలో ప్రయోగాత్మక చిత్రాలు చేయాలంటే ముందుగా వినిపించే పేరు శర్వానంద్. కెరీర్ స్టార్టింగ్ నుంచి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా సినిమాలు చేస్తున్న శర్వా అదే జానర్ లో మంచి విజయాలు సాధిస్తున్నాడు. ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో స్టార్ హీరోలతో ఢీ కొడుతున్నాడు. ఈ సినిమా సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న శర్వానంద్ తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా మరోసారి ప్రయోగానికే ఓటేశాడు.
సంక్రాంతి కానుకగా జనవరి 14న ఎక్స్ ప్రెస్ రాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వానంద్. త్వరలోనే ఓ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. సందీప్ కిషన్ హీరోగా రారా కృష్ణయ్య సినిమాను తెరకెక్కించిన మహేష్ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ లవ్ స్టోరి చేయడానికి రెడీ అవుతున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఓ బడా నిర్మాణ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు.
About the Author
Unknown
Author & Editor
No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!
Post a Comment